Pages

Monday 14 January 2013

ది ఎండ్ ఆఫ్ ద బిగినింగ్!

కాకినాడ బీచ్‌లో మూడురోజులు జరిగిన సాగర సంబరాలు 13వ తారీకున ముగిశాయి. సుమారు నాలుగు లక్షల మంది ఫెస్టివల్ కి వచ్చారని అంచనా. చివరిరోజే లక్షన్నర మంది వచ్చారు. బీచ్ వద్ద వన్ వే విధించి, వెళ్ళే వాహనాలని నేమాం, పండూరు మీదుగా పంపించినా, సాయంత్రం అయ్యేసరికి సూర్యారావు పేటలో ఉప్పుటేరుమీద ఉన్న ఇరుకు వంతెనమీద ట్రాఫిక్ జాం ఏర్పడింది. సాయంత్రం 5 గంటలనుంచీ ఇదే పరిస్థితి ఉంది. నాలుగయిదు గంటల పాటు సందర్శకులకి భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఉక్కిరి బిక్కిరి చేసింది. వచ్చే సంవత్సరం నుంచి ఈ సంబరాలు ప్రతీ ఏడూ జరుగుతాయని, వచ్చే ఏడాది ఇప్పటిలా మూడురోజులు కాకుండా, వారంరోజులపాటు ఉంటాయని సభలకు వచ్చిన రాజకీయ ప్రముఖులు చెప్పారు. అంతే కాకుండా కాకినాడ బీచ్ పార్క్, శిల్పారామాలు అభివృద్ది చేస్తారని, బీచ్ రోడ్డు విస్తరణ జరిగి నాలుగు లైన్ల  ఏర్పాటుకు కృషి జరుగుతుందని చెప్పడం అందరినీ ఆనంద పరచింది. జిల్లా వాసులంతా బీచ్ ఫెస్టివల్‌ని చాలా మెచ్చుకోవడం కనిపించింది. ఇంతకాలానికి సినిమా కాకుండా మరొక వినోద కాలక్షేపం ఈ కార్యక్రమం వల్ల అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయంగా అందరూ ఒకే మాటగా చెపుతున్నారు. పర్యాటక పటంలో కాకినాడకు సముచిత స్థానం లభించబోవడం చాలా ఆనందపడవలసిన సంగతి.


ఆసక్తి ఉంటే సాగర సంబరాల గురించి రాసిన ముందరి పోస్టులు ఇక్కడ చదవండి:
1. సాగర సంబరాలు
2. పోటెత్తిన సంబరాలు 
3. శిల్పారామం 
4. ఓరిగామి, ఇకెబన, ముకిమోనో


© Dantuluri Kishore Varma

3 comments:

  1. కాకినాడ బీచ్ సంబరాలు చాలా వైభవంగా జరిగినట్టున్నాయి. మీరూ చక్కగా మీ బ్లాగ్ లో కవర్ చేసారు. ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకూంటారనీ, మిగిలిన జిల్లాలకూ స్ఫూర్తి గా నిలవాలనీ ఆశిస్తూ...
    అభినందనలు!

    ReplyDelete
  2. మీ కాకినాడ బీచ్ సంబరాలు చదివిన తరవాత వచ్చే యేడు రావాలనిపిస్తోంది ....!!! Kakinada must be thankful to you varma garu..!

    ReplyDelete
  3. చిన్ని ఆశగారు, మూర్తిగారు మీ అభిమానానికి ధన్యవాదాలు. మూర్తిగారూ, తప్పనిసరిగా రండి.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!