Pages

Thursday 3 January 2013

వాకలపూడి లైట్ హౌస్

కాకతీయుల కాలం నుంచీ కాకినాడ ఒక ప్రధానమైన తీరప్రాంతంగా ఉండేదట. తరువాత ఈస్ట్ఇండియా కంపెనీ భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టినప్పుడు, 19వ శతాబ్ధం మధ్యలో  రంగూన్ నుంచి, మచిలీపట్టణం వరకూ చాలా రేవు పట్టణాలలో ఆగుతూ వెళ్ళే స్టీమరు సర్వీసుని ఏర్పాటుచేసింది. మధ్యలో ఆగే రేవుపట్టణాలలో కోకనాడ ఒకటి. 
పాత లైట్ హౌస్
సముద్రంలో ప్రయాణించే నావికులకి చూట్టూ నీరు తప్పించి మరేమీ కనిపించదు. ఏదయినా రేవుని సమీపించినప్పుడు అది ఏ రేవు, అక్కడ ఉండే పరిస్థితులు ఏమిటీ అనే విషయాలు తెలియడానికి ఒక మార్గనిర్ధేశం కావాలి. ఒక్కోచోట లోతుతక్కువ నీరు ఉండవచ్చు, లేదా సముద్రపు అడుగున బండరాళ్ళు ఉండవచ్చు. ఏది ఉన్నా నౌకకి ప్రమాదమే. ఈ సమాచారం తెలియజేయడానికి లైట్ హౌస్‌ల అవసరం ఏర్పడింది.      

కాకినాడ పట్టణానికి సుమారు పది కిలోమీటర్లదూరంలో బీచ్ ఒడ్డున మొదటి లైట్‌హౌస్ నిర్మాణ సన్నాహాలు 1860లో మొదలయ్యి, 1879లో పుర్తిస్థాయిలో ముగిశాయి. ప్రారంభంలో వొత్తి, చమురులతో వెలిగే దీపం ఉండేవట. క్రమంగా సాంకేతిక పరిజ్ఞానం, వాటితోపాటూ అభివృద్దీ జరిగింది. దీపంనుంచి కిరణాలుగా విడిపోయే కాంతిని ఒకే  పెద్ద కాంతిపుంజంగా మార్చడానికి ఉపయోగించే ఫ్రేనల్ లెన్స్(స్పెల్లింగ్ Fresnel అని ఉంటుంది, కానీ ఉచ్చారణ మాత్రం ఇదే) కనుగొనడం(1822) లైట్‌హౌస్‌ల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలు రాయి అని చెపుతారు. ఈ సాంకేతికత కాకినాడకి 1936లో వచ్చిందట. 
Fresnel lighthouse lens - Not from Kakinada  Light House.
పాత లైట్ హౌస్ స్థానే కొత్తది 2008లో నిర్మాణం జరిగింది. భారతదేశంలో లైట్ హౌస్‌లన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్ ఆద్వర్యంలో నిర్వహించబడతాయి. నిర్వాహణా సౌలభ్యం కోసం దేశాన్ని ఏడు జిల్లాలుగా విభజించారు. గమనించవలసింది ఏమిటంటే ఇవి మనజిల్లాల వంటివికాదు, లైట్ హౌస్ జిల్లాలు. అవి కలకత్తా, మద్రాసు, విశాఖపట్టణం, కొచ్చిన్, ముంబాయి, ఖచ్ & సౌరష్ట్రా, అండమాన్‌నికోబార్ లు. మన జిల్లాలో ఉన్న మూడు లైట్ హౌస్‌లూ (వాకలపూడి, సాక్రమెంటో, అంతర్వేది) విశాఖపట్టణం జిల్లాలోకి వస్తాయి.
కొత్త లైట్ హౌస్
దీని ఎత్తు 45 మీటర్లు. లోపలనుంచి వర్తులాకార మెట్లు లైట్‌హౌస్ పైవరకూ ఉన్నాయి. ముగ్గురు సిబ్బంది ఉన్నారు. వారికి క్వార్టర్స్ కూడా లైట్ హౌస్ ఉన్న ప్రాంగణంలోనే ఉన్నాయి. ఇక్కడ నేవిగేషనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కామేశ్వరరావుగారు చాలా విలువైన సమాచారం అందించారు. దానితోపాటూ ఉద్యోగ కష్టాలు ఎలా ఉంటాయో కూడా చెబుతూ, నాగాయలంక లైట్‌హౌస్ ముచ్చట ఇదిగో ఇలా చెప్పారు.

మనరాష్ట్రంలో నాగాయలంక దగ్గర ఒకలైట్‌హౌస్ తీరంనుంచి 22 కిలోమీటర్లదూరంలో ఉన్న ఒక చిన్న దీవి లాంటిచోట కట్టారట. జనావాసాలు ఏమీ ఉండవు. మన కోరింగలో ఉండే మడ అడవుల లాంటి ప్రదేశం అది. ఒక్కొక్కరూ 15 రోజుల చొప్పున రొటేషన్ పద్దతిలో పనిచెయ్యాలట. ఉద్యోగిని స్టీమర్‌మీద తీసుకొనివెళ్ళి అక్కడ దింపేసి, పదిహేనురోజుల తరువాత తిరిగి తీసుకొనివస్తారు. అక్కడే వొంటరిగా క్వార్టర్స్‌లో ఉండి, వొండుకొని తింటూ ఉద్యోగ నిర్వాహణ చెయ్యాలి.    
క్వార్టర్స్
సముద్రంలో ప్రయాణించేటప్పుడు పగటిపూట లైట్హౌసులకి వేసిన రంగులవల్ల, రాత్రిపూట అవి వెలువరించే కాంతి వల్ల తీరం దగ్గరగా వచ్చామని తెలుస్తుంది. కానీ, ఏ తీరం అనేది తెలుసుకోవాలంటే ఎలా? మనుసుల్లో వేలిముద్రలు ఎవరివి వారికి ఎలా ఉంటాయో లైట్ హౌసులు వెలువరించే కాంతి యొక్క విధానం దేనిది దానికి ప్రత్యేకంగా ఉంటుంది.  దీనిని ఆ హౌస్‌యొక్క కేరెక్టర్‌స్టిక్ అంటారు. మనలైట్‌హౌస్ యొక్క కేరెక్టర్‌స్టిక్ ఏమిటంటే లైట్‌ సవ్యదిశలో తిరుగుతూ ప్రతీ 15 సెకండ్లకీ మూడు ఫ్లాష్‌లు వెలువరించడం. నావికులదగ్గర ఎల్లప్పుడూ ఉండే మారినర్స్ హేండ్ బుక్కులో ఈ కాంతి వెలువడే విధానానికి ఎదురుగా తీరంపేరూ, అక్కడ ఉండే పరిస్థితులూ ఇవ్వబడి ఉంటాయి. మన తీరం దగ్గరకి వచ్చేసరికి ఈ కాంతివెలువరించే విధానం వల్ల వాకలపూడి తీరం చేరామని తెలుస్తుంది.
లోపలనుంచి వర్తులాకార మెట్లు
పుర్వకాలంలో లైట్‌ని తిప్పడానికి కీ్ఇవ్వడంలాంటి విధానం ఉండేది. కాబట్టి ప్రతీ రెండుగంటలకీ కీ ఇస్తూ ఉద్యోగులు రాత్రంతా కాపలా ఉండవలసి వచ్చేది. కానీ ఇప్పుడు విద్యుత్ మీద నడిచే మోటర్ల సహాయంతో దానంతట అదే తిరుగుతుంది. గ్లోబల్ పొజీషనింగ్ సాటిలైట్ (జీ.పీ.ఎస్) లాంటి ఆధునిక సాకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత నావికులు లైట్‌హౌస్‌లమీద ఆధారపడే అవసరం తగ్గిపోయింది. అయినప్పటికీ, ఎప్పుడయినా వాళ్ళ పరికరాలలో ఏదయినా లోపం ఏర్పదినప్పూడూ లైట్‌హౌస్‌లే దిక్కు అవుతాయి. పోస్టాఫీసుల్లాగ, లైట్‌హౌస్‌లు కూడా క్రమంగా కాలగర్భంలో కలిసిపోయె జాబితాలోకి వెళుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో వీటిని మ్యూజియంలుగా, హెరిటేజ్ గేలరీలుగా మారుస్తున్నారు.

© Dantuluri Kishore Varma

10 comments:

  1. ఎప్పుడో చూశాను వాకలపూడి లైట్ హవుజ్! గుండ్రంగా ఉంటుంది లెన్స్ ముక్కముక్కలుగా ఉన్నట్లు. మంచి విషయం గుర్తు చేశారు.

    ReplyDelete
  2. మీరుచూసింది పాత లైట్‌హౌస్ అయివుంటుంది. మీరు ఉదహరించిన లెన్స్‌ని ఫోర్త్ఆర్డర్ రివాల్వింగ్ ఆప్టిక్ అంటారు - ఫోటోలో చూపించిన ఫ్రేనల్ లెన్స్ ఫోర్త్ ఆర్డర్‌కి చెందినదే.

    ReplyDelete
  3. God lives in details

    లైట్ హౌస్ గురించి ఇంత minure details తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు.

    ReplyDelete
  4. ధన్యవాదాలు తేజస్వి గారు.

    ReplyDelete
  5. very informative and history ni kuda include chesi google ki theliyani points ni add chesaru
    thanks for u info kishore garu
    me vijay

    ReplyDelete
  6. Nostalgia!, I had a deep love with this Light House. In 1990 i came first time to this beach at 11am and waited upt to 5pm to enter into it. in the evening i had entered into this light house and had an unforgettable attachment with it. Very recently i came to the same beach in a hired auto for Rs.250/- in a hot sun and crossing the Samaikya Protests being held in Kakinada City, but found a New one there. with a disappointment i returned back. There are 2 Big Companies there, which were not present during my first visit in 1990. One more Great memory i had was There was a Ship which was flooded to the shore and got struck there due to 9thMay1990 Cyclone. A ship from Philippines, i got info from a navy person climbing to the ship with the help of a rope ladder. I am privvilleged to see almost up to the bottom of the ship and propeller of it. Great Kakinada Beach. I love Kakinada though i am a proper Native of Guntur.

    ReplyDelete
    Replies
    1. You would have gone inside and revived your old memories. The old light house still stands there, though not functioning. Regarding the time you mentioned, we too had been there to see the ship that had been stranded. We took photographs, but could not go inside. You were lucky to have seen inside of it. If you remember well, there used to be a beach park, with a huge restaurant in it. Thanks for sharing your memories associated with the beach.

      Delete
  7. friends i am the one who worked in the old light house untill it was removed and few day in the new one too i am the lucky one

    ReplyDelete
    Replies
    1. Nice to have your comment here. Thank you so much Venkatesh garu.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!