Pages

Friday 4 January 2013

సంక్రాంతి

పెద్దపండగొస్తుంది 
సంబరాలు తెస్తుంది
రధం ముగ్గులేద్దాం 
రంగవల్లులద్దుదాం

చుట్టాలంతా వస్తారు
సరదా సందడి చేస్తారు
చక్కని ఆటలు ఆడుదాం
నచ్చిన పాటలు పాడుదాం

కొత బట్టలు కడదాం
పిండివంటలు తిందాం
రధం ముగ్గులేద్దాం
రంగవల్లులద్దుదాం

బుడబుక్కలొస్తాడు
కొమ్మదాసరొస్తాడు
కొంత కొంత పంచుదాం
హాయిగా పంపుదాం

చిడతల శబ్ధం బాగుంది
తంబుర నాదం బాగుంది
అరిగరిగరిగో హరిదాసుగారు
ఎన్నో పాటలు పాడేస్తారు
చారెడుబియ్యం ఇచ్చేస్తేమరి
అంటారు వారు, "హరిలో రంగ హరి"

భం భం భం భం శంఖానాధం
గణ గణ గణ గణ గంటల శబ్ధం
వింటున్నావా "శంభో శంకర!"
అతనే అతనే జంగం దేవర

డూ డూ డూ డూ బసవన్న
చెప్పినవన్నీ చేస్తావా?
అమ్మగారికి దన్నంపెట్టి
అయ్యగారికి దన్నంపెట్టి
తోచినదేదో ఇచ్చేస్తే
చక్కా తీసుకుపోతావా?

పెద్దపండగొస్తుంది
సంబరాలు తెస్తుంది
భోగి మంటలేద్దాం
'గొబ్బియల్లో' పాడుదాం


© Dantuluri Kishore Varma

2 comments:

  1. చిన్నప్పుడు ఆ బసవన్న ఇచ్చే దీవనల కోసం పోటీ పడే వాళ్ళం ...నేను ఇస్తాను డబ్బులు ...నేను ఇస్తాను అంటూ...ముందస్తు శుభాకాంక్షలు...వర్మ గారూ!...

    ReplyDelete
  2. ధన్యవాదాలు శ్రీగారు. `మన సంస్కృతి` లేబిల్‌తో ఇలా ఇంకా కొన్ని టపాలు పెడదామని పండుగకు చాలా ముందుగానే హడావుడి మొదలుపెట్టేశాను. మీకుకూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!