Pages

Wednesday 8 May 2013

నాకు ఎందుకు అలా కనిపించడం లేదు!

ఒక వృద్దుడు - అరవై ఏళ్ళు ఉంటాయి-  రోడ్డు వారగా నడచి వెళుతున్నాడు. చేతిలో వాకింగ్ స్టిక్ ఉంది. మోటార్‌బైక్ ఒకటి అతనిని వొరుసుకొంటూ వేగంగా ముందుకు వెళ్ళింది. బైక్ నడుపుతున్న పాతికేళ్ళ కుర్రాడు వెనక్కితిరిగి పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు. `ముసలోడా..వాకింగ్ పార్క్‌లో చేసుకోవచ్చుకదా?` అన్నాడు. రోడ్డు వెంబడి కనిపించిన జనాలనందరినీ ఏదో ఒకటి అని ఆనందం పొందడం వాడికి అలవాటులా ఉంది. ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలినీ, అడ్డంగా రోడ్డు దాటుకొంటూ వెళుతున్న మామిడిపళ్ళతో ఉన్న తోపుడు బండినీ చూసుకోలేదు. ఒక్క క్షణంలో బైక్ ఆ బండిని గుద్దుకోవడం, బైక్ నడుపుతున్న కుర్రాడు ఎగిరి నేలమీద పడడం జరిగిపోయాయి. వాకింగ్ స్టిక్ తో నడుస్తున్న వృద్దుడు నాలుగు అంగల్లో అక్కడికి చేరుకొని కుర్రాడు పైకి లేవడానికి చెయ్యి అందించాడు. 
కొట్టుకుపోయి మండుతున్న మోచేతులూ, మోకాళ్ళను తడుముకొంటూ ఆ కుర్రాడు అడిగాడు, `వెటకారం చేసిన నేనంటే కోపం లేదా?` అని. 

పెద్దాయన అన్నాడు, `నా కొడుకు నీలానే తప్పుచేసి, తరువాత వాడికి ఇలా జరిగితే చూస్తూ ఊరుకోగలనా? నీ వయసు కుర్రాళ్ళలో నా కొడుకే కనిపిస్తాడు.`

`మీవయసు పెద్దవాళ్ళలో నాకు నా తండ్రి ఎందుకు కనిపించడం లేదు! నేను మారాలి` అనుకొన్నాడు ఆ కుర్రాడు.

© Dantuluri Kishore Varma 

14 comments:

  1. కిషోర్ వర్మ గారు ,

    చాలా బాగుందండి ,


    ధన్యవాదాలు ,

    techwaves4u.blogspot.in
    తెలుగు లో టెక్నికల్ బ్లాగు

    ReplyDelete
  2. Well said:) Good moral.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు అనూ గారు. మీకు నా బ్లాగ్‌కి స్వాగతం.

      Delete
  3. అదే యువత కీ తాతకీ ఉన్న తేడా,
    చాలా చక్కని పరిశీలన!

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ చిన్ని ఆశ గారు.

      Delete
  4. పొరపాటు చేసిన వారందరూ ఆ కుర్రాడి లా ప్రవర్తిస్తే సమాజం తొందరగానే మారుతుంది . ఆరోజు రావాలి .

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్‌కి మీకు స్వాగతం నాగరాణీ గారు. మీ కామెంటుకి ధన్యవాదాలు.

      Delete
  5. చాలా బాగుంది సర్! మీరు ఒక విషయాన్ని చెప్పడంలో మీది ఒక ప్రత్యేకమైనశైలి..... చిన్న కధతో పెద్ద ఆలోచన చేయిస్తారు..... అభినందనలు......... గ్రేట్! :)

    ReplyDelete
    Replies
    1. కృష్ణచైతన్య గారు మీ అభిమానానికి ధన్యవాదాలు :)

      Delete
  6. okka chinna mukkalo chala adham chepparandi simply super

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు సంతోషం :)

      Delete
  7. కథ మీ చేతిలో ఉంది కాబట్టి, ఆ కుర్రాడికి అంత త్వరగా పశ్చాత్తాపం కలిగింది. బయట అసాధ్యం.

    ReplyDelete
  8. చాలా బాగుంది సర్!

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!