Pages

Saturday 12 October 2013

ఆరోగ్యానికి ఆ ఐదూ..

టాక్సిన్స్ అనే మాట తరచూ వింటూ వుంటాం. మరి, టాక్సిన్ అంటే ఏమిటీ?  

అది ఒక రసాయనిక పదార్థం అనుకోండి. పంటలు పండించడానికి వాడే రసాయనిక ఎరువులు, కలుషితమైన మంచినీరు, వాతావరణ కాలుష్యంవల్ల గాలిలో కలిసిన మలినాలు  కారణంగా టాక్సిన్లు శరీరంలోనికి పంపిస్తున్నాం. మన శరీరంలో ఉన్న లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తులు లాంటి అవయవాలు ఈ విషపూరిత వ్యర్ధాలను చెమటద్వారా, మూత్రంద్వారా బయటకు పంపిస్తాయి. కానీ ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ కారణంగా ఈ అవయవాల సామర్ధ్యాన్ని మించి టాక్సిన్లని తీసుకోవడం, అవి శరీరంలో పేరుకొనిపోయి అనారోగ్యాన్ని కలిగించడం జరుగుతుంది. కాబట్టి వీటిని వదిలించుకోవడానికి ప్రయత్నించాలి.  

మన జీవిత విధానాన్ని కొద్దిగా మార్చుకొని, క్రమం తప్పకుండా ఐదు నియమాలని పాటిస్తే చక్కటి ఆరోగ్యంతో జీవించవచ్చు. 
మొదటిది ద్రవపదార్ధాలని ఎక్కువగా తీసుకోవడం. శరీర అవసరాలకి సరిపోయేలా మంచినీళ్ళు త్రాగడం చాలా ముఖ్యం. వీలునిబట్టి కొబ్బరినీళ్ళు, తాజా పళ్ళరసాలు కూడా తీసుకోవచ్చు. దీనివల్ల స్వేదం, మూత్రం ద్వారా టాక్సిన్లు ఎక్కువగా  విసర్జించబడతాయి.

రెండవది వ్యాయామం చెయ్యడం. శ్వాస ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ కారణంగా విడుదలయ్యే చెమట డీ-టాక్సిఫికేషన్ చేస్తుంది.
మూడవది వొంటికి మర్ధనా(మసాజ్). దీనికోసం మసాజ్ సెంటర్లకి వెళ్ళక్కర్లెద్దు. నలుగుపిండి(సున్నిపిండి)తో నలుగుపెట్టుకొని స్నానం చెయ్యడంవల్ల, చెమటద్వారా బయటకు వచ్చిన వ్యర్ధాలు శుభ్రంగా తొలిగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రక్తప్రసరణకూడా పెరుగుతుంది. 

నాలుగవది ఆహారం. టేస్టింగ్ సాల్ట్‌లు, ఫుడ్‌కలర్, అనారోగ్యకారకమైనా నూనెలతో తయారు చేసే బయటి ఆహారం తీసుకోవడం వీలయినంత వరకూ తగ్గించాలి.  పీచుపదార్ధాలు(ఫైబర్) ఎక్కువగా ఉండే కాయగూరలు, పళ్ళు తీసుకోవాలి. వీటిలోని ఫైబర్ ఒక బ్రష్‌లాగా పనిచేసి పేగులని శుభ్రం చేస్తుంది. 

చిట్టచివరిది ఉపవాసం. నిరంతరం పనిచేస్తూ ఉండే జీర్ణవ్యవస్థకి; కిడ్నీ, లివర్ లాంటి అవయవాలకి వారానికి ఒకరోజు విశ్రాంతిని ఇవ్వడం చాలా మంచిది. కొత్తగా అరుగుదలచేసే బాధ్యత ఉండదు కనుక నిలువయిపోయిన వ్యర్ధాలని బయటకు పంపించే పనిని అవి నిర్వర్తిస్తాయి.

ఇవి నేను కొత్తగా చెప్పే విషయాలు కాదని మీకూ తెలుసు. మనతాతల కాలంనుంచీ ఉన్నవే. అప్పటిలో `ఎందుకూ?` అనే వివరం తెలియకుండా చేసేవారు. ఇప్పుడు ఎందుకో తెలిసినా క్రమశిక్షణతో పాటించలేకపోతున్నాం. 

`ఎస్, ఐ కెన్` అనుకొంటే చెయ్యలేమా? ఆరోగ్యమే మహాభాగ్యం! ఎంతకాదన్నా, దానికన్నా ముఖ్యమైనది ఏముంటుంది?
© Dantuluri Kishore Varma

6 comments:

  1. Chala manche post kishore garu, thank you.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీరాం గారు.

      Delete
  2. వర్మాజీ, ఇది కూడా మనకాకినాడలో భాగమేనా?..:-) (సరదాకి అన్నాను.)
    మంచి విష్యాలు చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. మిగిలిన అందరికిలాగే ఇటువంటి విషయాలు మా కాకినాడ ప్రజలకి కూడా అవసరమే అని రాస్తూఉంటాను మెరాజ్ గారు. ఇటువంటి జనరల్ టపాలు ఇంకా చాలా వుంటాయి - నిజానికి అవే ఎక్కువ.(అస్తమానూ కాకినాడే అంటే చదివేవాళ్ళకి బోర్‌కొడుతుంది కదా? అందుకన్న మాట). మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!