Pages

Sunday 3 November 2013

కొందరికి ఆనందం, కొందరికి వెర్రి సరదా!

మావీధిలో ఒక హైస్కూల్ అమ్మాయిల గవర్నమెంట్ హాస్టల్ ఉంది. దీపావళి ఒక్కరోజుకోసం వాళ్ళకి శెలవు ఇచ్చి ఇంటికి పంపించరు. తల్లితండ్రులు కొనిచ్చిన  ఒకటో, రెండో కాకరపువ్వొత్తుల ప్యాకెట్లు, కొన్ని మతాబాలు చెతుల్లో పట్టుకొని ఒక వరసలో హాస్టల్  బయటకి వస్తారు. రోడ్డుమీది అటూ, ఇటూ ఎదురెదురుగా రెండువరుసల్లో నుంచుంటారు. ఒక అరగంటసేపు వీధిలో రాకపోకలకి దారి మళ్ళిస్తారు. ఎవరికి వాళ్ళు తెచ్చుకొన్న మందుగుండు సామాగ్రి వెలిగించడం మొదలౌతుంది. వెలిగే మతాబాలతో చిరునవ్వులు, కాకరపువ్వొత్తులు చూసి కళ్ళల్లో మెరుపులు తళుక్కుమంటాయి. అందరికీ కలిపి హాస్టలు వాళ్ళు ఇచ్చే చుచ్చుబుడ్లు వెలిగించడంతోమొదలయ్యే కేరింతలు, అవి జ్.........అని పైకెగసిపడుతున్నప్పుడు చేసే శబ్ధంతో పాటూ వాళ్ళ గోలకూడా మిన్నంటుతుంది. ఒక అరగంటలోనే సందడి సద్దుమణుగుతుంది. కానీ, ఆ కొంత సమయంలోనే వాళ్ళ ఆనందాన్ని చూడడం బాగుంటుంది. 
*     *     *
ఏడుగంటలకల్లా దివిటీలు కొట్టి, దీపాలు పెట్టి దీపావళి సందడి మొదలుపెట్టారు అందరూ.తిరిగే భూచక్రం, వెలుగులు నింపే మతాబులు, ముత్యాలు జిమ్మే కాకరపువ్వొత్తులు, నిప్పుల ఫౌంటెన్లా పైకెగసే చుచ్చుబుడ్లు, చెవులు గళ్ళెక్కించే బాంబులు.. ఇళ్ళు, రోడ్లు, ఊళ్ళు హోరెత్తిపోయే సమయం అది.  
గిర, గిర మని తిరుగుతున్న చిన్న భూచక్రాన్ని చూడండి. 
సందడి ఇంకా సద్దుమణగకుండానే బైకులమీద ఇద్దరు, ముగ్గురు చొప్పున కుర్రాళ్ళు వీధుల్లో సర్వేకి బయలుదేరారు. పేలుతున్న సీమటపాకాయల మధ్యనుంచి దూసుకొని వెళ్ళడం ప్రమాదకరమైన వెర్రి సరదా కొందరికి. ప్రమాదం జరగడం వేరు, కావాలని కొని తెచ్చుకోవడం వేరు! ఈ వీడియోలో చూడండి ఒకడు అలాగే చిక్కుకొన్నాడు. 
అందరూ ఆనందంగా దీపావళి జరుపుకొన్నారని భావిస్తూ శెలవు!
© Dantuluri Kishore Varma 

2 comments:

  1. మీ టపా సర్దాగా ఉన్నా, సందేశనాత్మకంగా ఉంది, అభినందనలు,

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మెరాజ్ గారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!