Pages

Wednesday 18 December 2013

శీతాకాలం సాయంత్రం....

శీతాకాలం సాయంత్రం అలా మెయిన్‌రోడ్‌లోకి వాకింగ్‌కి వెళ్ళి చూడండి, ఎంత బాగుంటుందో! 
అయిదున్నర అయ్యేటప్పటికే చలి మొదలైపోతుంది. 
నిమిషనిమిషానికీ చీకటి చిక్కబడిపోతుంది.
మంచుతెర పట్టణమ్మీద పరుచుకొంటుంది.
విద్యుత్ లైట్ల వెలుగులు ఆ పరదాలని చిల్చుకొని తొంగిచూడాలని ఆరాట పడతాయి. 
జర్కిన్లు, స్వెట్టర్లు వేసుకొని షాపులదగ్గర కొనేవాళ్ళు,
వేడివేడి టీని ఊదుకొని తాగేవాళ్ళు, 
తలపాగాలో, మఫ్లర్లో చుట్టుకొని తోపుడుబండి దగ్గర అమ్మేవాళ్ళు,
మునిసిపాలిటీ ఎండుచెత్తతో చలిమంట వేసుకొని దానిచుట్టూ కూర్చొనే రిక్షావాళ్ళు 
స్నానంచేసి చక్కగా తయారయి గుడికో, పురాణకాలక్షేపానికో వెళ్ళే భక్తులు
మంచు కురిసే అందాల్ని చూడాలంటే ఉదయంపూట పల్లెటూరిలో, రాత్రి పూట పట్టణాలలో చూడాలి. ముఖ్యంగా ఏమయినా సంబరాలు జరిగేటప్పుడైతే మరీ బాగుంటుంది. మావూరు పేరుకి పట్టణమే కానీ, నిజానికి పెద్ద పల్లెటూరు లాంటిది! 
నిన్న రాత్రి తొమ్మిది అయ్యింది...
మెయిన్‌రోడ్ నుంచి డప్పులు, సందడి వినిపిస్తుంది.
`హనుమంతుడి ఊరేగింపు వెళుతుంది, వెళ్ళి చూసొద్దాం,` అంది మా చిన్నమ్మాయి.
వెళ్ళాం!
హనుమాన్ జయంతోత్సవాలు జరుగుతున్నాయి కదా? ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తున్నారు. వాహనానికి ముందు బాలహనుమంతుల హల్‌చల్ చేస్తున్నారు. గరగ నృత్యాలు, కోలాటాలు... అబ్బో చాలా సందడిగాఉంది. 


మెయిన్‌రోడ్‌లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.  వీలయినంతవరకూ ప్రక్కరోడ్లలోకి తిరిగిపోయి ఏసువారి వీధికి కలిసిపోతున్నారు. అక్కడినుంచి మునసబుగారి జంక్షన్‌కి చేరుకోవచ్చు. 

దీనిలో కొసమెరుపు ఏమిటంటే, మావీధిలోకి తిరిగిన బస్సుల్లో ఒకటి మాయింటికి వచ్చే ఇంటర్నెట్ కేబుల్ని కట్ చేసుకొని పోయింది. అదిగో అప్పుడు పోయిన కనెక్షన్, ఇప్పటికి వచ్చింది!
© Dantuluri Kishore Varma

8 comments:

  1. మీ ఊరి సందడి మా కన్నులను తాకింది, నిజంగా అనిపిస్తుంది ఇలాంటి హడావుడి లేకపోటే జీవితాలు మరీ యాంత్రికంగా అయిపోతాయేమో,
    వర్మాజీ లాంటి వారులేకుంటే కొన్ని సందర్బాలు పేలవంగా ఉంటాయేమో..(ముఖస్తుతి కాదు)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి. మీరన్నట్టు సందడి లేకపోతే ఉత్సాహమే ఉండదు. నాకయితే దీపం పురుగులాగ సందడి ఉన్నచోటకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ, చిక్కేమిటంటే చాలా సార్లు వెళ్ళలేను.

      Delete
  2. Replies
    1. ప్రసాదరావుగారు, మీ కురచకథల్లో ఎంతచక్కగా కమ్యూనికేట్ చేస్తారో, కామెంట్స్‌లో కూడా మీ భావాన్నీ ఒక్క మాటలో సూటిగా చెప్పగలరు మీరు. ధన్యవాదాలు.

      Delete
  3. Avunandi sitaakaalam chaliki tattukune bandobastuto alaa tirigoste bhale untundi aahlaadamgaa.. maa ullo sitakaalmlo udayam bayatakellinappude kadu intlo undikuda maa inti prakka polam chustu enjoy chestaa..radhika (nani)

    ReplyDelete
    Replies
    1. మీరు అదృష్టవంతులు రాధికగారు. ఇంటికి ప్రక్కనే పొలాలు, ప్రకృతి. మీ బ్లాగ్‌లో ఫోటోలు డిలైట్‌ఫుల్‌గా ఉంటాయి. రెగ్యులర్గా అప్డేట్ చెయ్యండి.

      Delete
  4. మంచు కురిసే అందాల్ని చూడాలంటే ఉదయంపూట పల్లెటూరిలో, రాత్రి పూట పట్టణాలలో చూడాలి. ముఖ్యంగా ఏమయినా సంబరాలు జరిగేటప్పుడైతే మరీ బాగుంటుంది. మావూరు పేరుకి పట్టణమే కానీ, నిజానికి పెద్ద పల్లెటూరు లాంటిది!

    True!!! :)

    ReplyDelete
    Replies
    1. శిశిరగారు :) ధన్యవాదాలు!

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!