Pages

Saturday 1 February 2014

సంకోచించకుండా తాగండి!

వేసవి మెల్లగా ప్రవేశిస్తుంది. ఎండలో తిరగడం, దాహం తీర్చుకోవడానికి కూల్‌డ్రింకులు తాగడం మొదలైపోతుంది. వాటివల్ల దాహం తీరినట్టు అనిపించినా, కొన్ని క్షణాల్లోనే నోరు ఎండిపోతుంది. కూల్‌డ్రింకులు ఆరోగ్యానికి కూడా మంచివి కాదు అని చెపుతున్నారు. కాబట్టి ఫ్రూట్ జ్యూస్‌లు, చెరుకురసం, కొబ్బరినీళ్ళు లాంటివి త్రాగడం ఉత్తమం. చెరుకురసం తాగే టప్పుడు అందులో వేసే ఐసు ఏనీళ్ళతో తయారుచేసి ఉంటారో ఆలోచించుకోవాలి. సాధ్యమైనంతవరకూ ఐసులేని చెరుకురసం త్రాగడం మంచిది. ఫ్రూట్ జ్యూస్‌ల విషయంలో కూడా డిటో. వీటన్నింటిలోనూ ఉత్తమమైనది కొబ్బరిబొండాం. శరీరానికి వెంటనే శక్తిని అందించే ఎలక్ట్రోలైట్లు కొబ్బరినీళ్ళల్లో ఉంటాయట. కొబ్బరినీళ్ళు రక్తపోటుని అదుపుచేసి, గుండెకు మేలు చేస్తాయి. పేషంట్లకి కూడా వీటిని ఇవ్వడానికి కారణం శరీరానికి శక్తినిచ్చి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి కనుకనే. అదృష్టం ఏమిటంటే మనదేశంలో విరివిగా కొబ్బరి దిగుబడి వచ్చే నాలుగు రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి. మొత్తం దేశ కొబ్బరి ఉత్పత్తిలో 92శాతం కేరళ, తమిళ్‌నాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుంచే వస్తుంది. దాహం వేస్తే వెంటనే జ్ఞాపకం రావలసింది కొబ్బరిబోండమే. కొబ్బరి బొండాలకి జై!   

© Dantuluri Kishore Varma

3 comments:

  1. చెరుకు రసం మంచిదే కాని, బళ్ళ దగ్గరుండే ఐస్ మంచిది కాదు, అది వేసుకుని తాగే కంటే నిమ్మకాయ కలిపి ఇచ్చినది పుచ్చుకోడం మంచిది. వర్మగారు మీరూ తాగడం అంటే ఎలా? తాగుడు అన్నది మత్తు పదార్ధాలకే పరిమితం, మిగిలనవి పుచ్చుకోవడం అనాలన్నారు శ్రీపాదవారు.కొబ్బరిబొండాం అసలు సిసలు పానీయం.సాధ్యమైనంత తెనుగు వాడదాం ఏమంటారు, తెనుగు పదాలు లేనప్పుడెలాగా తప్పదు.

    ReplyDelete
    Replies
    1. చెరుకురసం దగ్గర ఐసు గురించి నేను కూడా ఆర్టికల్లో రాశాను. ఇక తాగడం, పుచ్చుకోవడాల గురించి ... మీరు చెప్పాకా కాదనేదేముంది? అలాగే. ధన్యవాదాలు శర్మగారు.

      Delete
  2. varma gaaru i need some help in blogging .
    how to contact u ?

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!