Pages

Friday 7 March 2014

అష్టవిధ నాయికలు

అష్టవిధనాయికల గురించి వినే ఉంటారు...

వస్తానని చెప్పి రాని ప్రియుడి కోసం ఎదురుచూసే విరహోత్కంఠిత మొదటి నాయిక. 
వేరొక స్త్రీతో సరస సల్లాపాలు సాగించి ఇంటికి తిరిగి వచ్చిన ప్రియుడిని చూసి వెలిగించిన మైనపు వొత్తిమీద గుగ్గిలం చల్లినట్టు మండిపడే పడతి  ఖండిత
ఖండితకి పూర్తి వ్యతిరేకం స్వాధీనపతిక. ప్రియుడికి ఈమె అంటే ఎల్లలులేని ప్రేమ. అలా ఉండడం ఆమెకి ఎంత గర్వకారణం? ఎంత సంతోషం? ఏ దూర తీరాలకు వెళ్ళినా ఆమెనే కలవరిస్తాడు. ఆమెకోసం వెతుక్కొంటూ వస్తాడు.
ఇక్కడ తరువాతి నాయికను చూడండి. స్వాధీనపతికలా కాదు. తానే స్వయంగా ప్రియుడిని వెతుక్కొంటూ వెళుతుంది. అలా వెళ్ళే పడతిని అభిసారిక అంటారు. 
అయిదవ నాయిక ప్రోషిత భర్తృక. ప్రియుడి పనిమీద దూర దేశాలకు వెళ్ళినప్పుడు, వియోగానికి చింతిస్తుంది.
తనకు చేసిన వాగ్ధానాలన్నీ తప్పి, ప్రియుడు వెళ్ళిపోయాడని దు:ఖించేది విప్రలభ్ధ
ప్రియుడు వచ్చేవేళకి చక్కగా అలంకరించుకొని ఉండేది వాసవసజ్జిక
ఇక చిట్టచివరి నాయిక కలహంతరిత. కలహం ఆమె పేరులోనే ఉంది కదూ? ప్రియుడితో గొడవపడుతుంది. అతను వెళ్ళిపోతాడు. ఆప్పుడు `ఆయ్యో, తప్పుచేశానే!` అని చింతిస్తుంది. 

ముద్దగాఉన్న నాయికల పేర్లమీద క్లిక్ చెయ్యండి. 
వీడియోలు ఉన్నాయి. 
అభినయించిన కళాకారులని అభినందించకుండా ఉండలేం!

శ్రీకృష్ణుని పియురాళ్ళలో అష్టావిధ నాయికలని అందరినీ చూడవచ్చనుకొంటాను. మరి మీరేమంటారు?

© Dantuluri Kishore Varma

6 comments:

  1. అద్భుతంగా ఉంది,అభినందనలు వర్మాజి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మెరాజ్ గారు.

      Delete
  2. Replies
    1. ధన్యవాదాలు గాయత్రి గారు.

      Delete
  3. Chaalabaga vivarincharu vaatikitagga vedios kuda pettaru chala santosham Kishorevarmagaru Thank you very much

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!