Pages

Friday 28 March 2014

తిరుమల కొండల్లో శిశిర సౌందర్యం

గ్రీష్మంలో సూర్యాస్తమయం చేసే రంగుల మిశ్రమం 
వర్షఋతువులో మేఘావృతమయ్యే ఆకాశం, కురిసే వానచినుకు, తడిసిన మట్టివాసన
శరత్కాలంలో పుచ్చపువ్వుల్లాంటి వెన్నెల
హేమంతంలో ప్రకృతికాంతకు ఆకాశం వేసే మంచు మేలి ముసుగు.. 
అన్నీ అందమే!
కానీ... శిశిరం?
శిశిరానికి సౌందర్యం కూడానా!?
ఆకుల హరిత వర్ణం, పువ్వుల సోయగం ఏ కొమ్మపైనా కనిపించవే
మరి మోడువారిన వృక్షాలకి అందం ఎందుకు ఉంటుంది?
ఉంటుంది...
ఎప్పుడంటే...
ఓ మహిమాన్వితమైన కొండ, 
కొండవెనుక నీలి ఆకాశం, 
వాటికి ముందు ప్రకృతి అనే చిత్రకారుడు సన్నని కుంచెతో చెట్లకాండాలని మాత్రమే గీసి వదిలి పెట్టినట్లు 
ఆకురాల్చిన చెట్లు ఉంటే ఆ అందం ఇదిగో ఇలానే ఉంటుంది. 
కొండపైకి వెళుతున్నప్పుడు, తిరిగి దిగుతున్నప్పుడు టెంపో ట్రేవెలర్‌లో ప్రయాణిస్తూ తీసిన ఫొటోలు. 









© Dantuluri Kishore Varma

4 comments:

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!