Pages

Sunday 16 November 2014

మిగిలిన కథలు..

దియేటరు దాటి కొంచం ముందుకు వెళ్ళగానే అప్పుడే చేసిన నేతి సున్నుండల వాసన వచ్చేది. "తాచుపాము ఉన్నచోట ఇలాంటి వాసన వస్తుంది," అని బండి వాడు చెప్పేవాడు. ఊరు నిద్రపోతుండగా రెండు సరిహద్దులకీ మధ్య ఉన్న కంకర గోతులు అనే ప్రదేశంలో ఉండే మర్రి చెట్టు దాటుకొని మావూరు తిరిగి వెళ్ళాలి. ఆ మర్రిచెట్టుమీద దెయ్యాలు ఉంటాయని చెప్పుకొనేవారు....

ఒక్కసారి రాసింది పదిసార్లు చదివినదానితో సమానం అంటారు. అలాగే ఒక్కసారి వివరించి చెబితే పదిసార్లు రాసినదానితో సమానం అన్న సత్యం నాకు ఇక్కడే తెలిసింది. ఒక డిబేట్ కోసం తయారయినప్పుడు విషయం మనకి మాత్రమే అర్ధమైతే సరిపోదు, దానిని ఎదుటి వాళ్ళు మెచ్చేలా చెప్పాలి - దీనినే  డ్రైవింగ్ ద పాయింట్ హోం అంటారు.

ముఖ్యంగా బ్యాటింగ్ మీదే కాన్సెంట్రేషన్ అంతా. ఎందుకంటే,  బౌలింగ్ అంత ఏమీ నేర్చుకోవలసిన విషయం కాదని గొప్ప నమ్మకం. ఫేస్ అంటే ఎంతవీలయితే అంత దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చి వెయ్యడం. నీరసంవచ్చి దూరంపరిగెత్తలేనప్పుడు వేసిది స్పిన్- As simple as that!


ఒక్కో రోజు గోదావరి గట్టుమీద కూర్చుని బ్రిడ్జ్‌మీదనుంచి పోతున్న రైళ్ళని, వెలుగుతున్న విద్యుత్ లైట్లని, లంగరువేసి ఉన్న పడవల్నీ, ఊగుతున్న మర్రి చెట్టు ఆకుల్నీ, ఒడ్డుని తాకుతున్న అలల్నీ చూస్తూఉంటే గంటలు  నిమిషాలు అయ్యేవి.  మంచుకురుస్తున్నప్పుడు రోడ్డు వెంబడి నడవడం, ఎండ మండిపోతున్నప్పుడు చెట్టునీడల్లో సైకిలు మీద పెట్టి చీరికలుగా కోసి అమ్ముతున్న పుచ్చకాయ ముక్కలో, బొప్పాయి ముక్కలో తినడం, స్కూటర్‌మీద కొవ్వూరు వెళుతున్నప్పుడు గోదావరి బ్రిడ్జ్ దాటడం, పేపరుమిల్లు వైపు వెళ్ళే దారిలో పాతపుస్తకాల షాపు, దామెర్ల రామారావు ఆర్టు గేలరీ, లాలా చెరువు దగ్గర దాబాలో రోటి - దాల్ కాంబినేషన్.... రాజమండ్రీ అంటే పంచేద్రియాలూ ప్లస్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతాయి.

పొయ్యిముందు కూర్చొన్న మనిషి చేస్తున్న పనిని చూస్తుంటే కుతూహలం పెరిగిపోయింది. దగ్గరకు వెళ్ళి నేను కూడా చేస్తానన్నాను.  `నువ్వు చెయ్యలేవు కానీ, కావాలంటే ఇది తిను,` అని కుండమీద అప్పుడే తీసిన రేకుని చేతిలో పెట్టారు. పలుచటి ఉల్లిపొరలా ఉంది. రుచి అమోఘం! అదిగో సరిగ్గా అప్పుడే ఆపదార్థంతో ప్రేమలో పడిపోయాను - ఇప్పటికీ హింకా.. తేరుకోలేదు.

ఎవరో పై కండువాగా వేసుకొనే తెల్ల తువ్వాలు చుట్టబెట్టి ధర్మయ్యకోసం బహుమానం తెచ్చారు. `ఇదిగోరా ధర్మయ్యా వొండించుకో, మంచి చేపలు,` అని మూటని వాడి చేతిలో పెట్టారు. ఏరకం చేపలో తెలుసుకోక పోతే వాడికి మనసు మనసులో ఉండదు. వెంటనే మూట ముడి విప్పాడు. లోపలినుంచి `బుస్` మంది. ఇంకేముంది, దాన్ని అక్కడే పారేసి పరుగో, పరుగు! 

ఇవన్నీ జ్ఞాపకాల తునకలు. మొదటినుంచీ ఈ బ్లాగ్‌లో రాసుకొంటూ వచ్చినవి. పూర్తి కథలు చదవాలనుకొంటే లింక్‌లు క్లిక్ చెయ్యండి. 

Dantuluri Kishore Varma

4 comments:

  1. మరెందుకో ..ఎవరు చెప్పారో జ్ఞాపకం లేదుగాని..నాక్కూడా ఎక్కడైనా రోడ్డు పక్కన సున్నుండ వాసన వస్తే ఆ తాచుపాము సెన్సేషనే కలుగుతుంది.నిప్పు లేనిదే పొగరాదు గదా ..బహుశా నిజమేనేమో లెండి. మీ టపా బాగుంది వర్మ గారు..!ఫోటోలు కూడా...!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మూర్తిగారు :)

      Delete
  2. కిశోరే వర్మ గారు .....అనుభవాలు ,జ్ఞాపకాలు ..అందరికి ఉంటాయి .కానీ కొందరు మాత్రమె వాటిని అందంగా చెప్పగలరు ....అలా మీరు మీ బ్లాగ్స్ చెప్పే విషయాలు చదువుతుంటే చాలా హాయిగా అనిపిస్తాయి ..అప్పుడెప్పుడో ,ఆ రోజుల్లో జీవితం ఎంత బావుండేదో కదా అని (చదివిన అందరిని )...తలుచుకునేటట్టు చేస్తున్నారు .. Thanks ..keep it up...

    ReplyDelete
    Replies
    1. చదివి వెళ్ళిపోకుండా ఒక్క నిమిషం ఆగి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఉంది సత్య ఆనంద్ గారు. ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!