Pages

Friday, 20 November 2020

కాకినాడలో 6000 సంవత్సరాలనాటి ఆనవాళ్ళు

 కొంతకాలం క్రితం ద హిందూ న్యూస్ పేపర్లో దీని గురించి రాస్తూ 6000 సంవత్సరాల క్రితంనాటి సాంప్రదాయక పడవల తయారీ విధానం ఇంకా కాకినాడలో కొనసాగుతుందని సోదాహరణంగా చెప్పారు. గుజరాత్లో లోథాల్ అనే ప్రాంతంలో జరిపిన పురావస్తుశాఖ తవ్వకాల్లో హరప్పా నాగరికతకు సంబంధించిన చాలా అవశేషాల్లు బయటపడ్డాయి. వాటిల్లో 710అడుగుల పొడవు, 120అడుగుల వెడల్పూగల అతిపెద్ద పడవలు ఉన్నాయి. వీటిని తయారుచేసే విధానం గురించి ప్రాచీన గ్రంధాలయిన యుక్తి కల్పతరు, ఋగ్వేదం, సమరాంగణ సూత్రధార, కౌటిల్యుని అర్థశాస్త్రం మొదలైన వాటిల్లో రాసి ఉందట. ఇప్పుడు కాకినాడలో తయారు చేస్తున్న పడవలు అచ్చంగా అలాగే ఉంటున్నాయట. బోటు తయారీ దారులు తమకు ఈ విద్య తమ తాతల తాతలు నుంచి వంశపారంపర్యంగా పస్తుందని చెప్తారు. ఎక్కడోఉన్న గుజరాత్‌ని కాకినాడకి ఏదో రకంగా ముడిపెట్టి ఈ ఊరికి చారిత్రక ప్రాధాన్యం కలిగించడానికి కాదుకానీ ఒక పరంపర అప్రతిహతంగా కొనసాగుతున్న ఆనవాళ్ళు ఇక్కడ కనిపించడం చూస్తుంటే ఆనందంగా ఉండదూ?

Watch the video here.

No comments:

Post a comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!