టన్నెల్స్ ద్వారా వేసిన పట్టాల మీద పాసింజర్ రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు
దారిలో చూపుతిప్పికోనివ్వని ప్రకృతి సోయగాల ఆస్వాదనలో తలమునకలైనప్పుడు
కిటికీలోనుంచి వచ్చే చల్లగాలి...
పట్టాలమీద రైలు చక్రాలు చేసే లయాత్మక సవ్వడి
ఎప్పుడో చదివిన రస్కిన్‌బాండ్ కథ `ది టన్నెల్` ని గుర్తుకుతెస్తే
కనిపించే దృశ్యం నిజమో..
ఊహల్లోనుంచి రూపం సంతరించుకొన్న అద్భుతమో తెలియక తికమక పడతాం.
గోతెలుగు వెబ్ వారపత్రికలో నేను ఈ వారం రాసిన ద టన్నెల్ వ్యాసం చదవండి.
మీ అభిప్రాయాలు తెలియజేస్తే సంతోషిస్తాను.
ఫోటోలు విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే దారిలో తీసినవి.
© Dantuluri Kishore Varma
మీ సాహసమూ చెప్పుకోతగ్గదే రాజు గారూ - సొరంగం లోపల రైలుపట్టాల మధ్య కుటుంబంతో సహా నిలబడి ఫొటో తీయించుకున్నారు చూడండి, ధైర్యమే :)
ReplyDeleteనిజంగానే విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రైలుమార్గ దృశ్యాలు చాలా సొగసుగా వుంటాయి. అసలు తూర్పు కనుమల్లో (ఈస్టర్న్ ఘాట్స్) ఆ రైలుమార్గ నిర్మాణమే (DBK) ఒక ఇంజనీరింగ్ ఛాలెంజ్ / అద్భుతం. (అంత అందమైన ఈస్టర్న్ ఘాట్సుని తనకు అధికారమిస్తే పొగాకు పంటతో నింపేసేవాడినని గిరీశం అంటాడు, కాని అదృష్టవశాత్తూ అతనికా అధికారమూ అవకాశమూ దక్కలేదు బతికిపోయాం :) )
ఎన్నో ఏళ్ళ క్రితం చదివిన రస్కిన్ బాండ్ రచనల్ని తిరిగి గుర్తు చేసారు. మనదేశం గర్వించదగ్గ రచయితల్లో రస్కిన్ బాండ్ ఒకరు. తల్లిదండ్రులందరూ తమ పిల్లల చేత తప్పక చదివించవలసిన కధలు చాలా వున్నాయి రస్కిన్ బాండ్ రచనల్లో.
మీ కామెంట్‌కి ధన్యవాదాలు నరసింహరావుగారు. నిజానికి ఇలా ఫోటో దిగడంలో సాహసం ఏమి లేదండి. అది ట్రైన్ వచ్చే సమయం కాదు. వచ్చినా ప్రక్కకి తొలగి నిలబడడానికి రైల్వే ట్రేక్‌కీ, టన్నెల్ గోడకీ మధ్య చాలా జాగా కూడా ఉంది. డిబీకే లైను గురించి మీరు చెప్పిన ఇంజనీరిం మార్వెల్ అనే విషయం అక్షర సత్యం. రస్కిన్ బాండ్ నా అభిమాన రచయితల్లో ఒకరు. :)
Delete