కాకినాడ నుంచి కోటిపల్లి వెళ్ళడానికి చాలా ఆర్‌టీసీ బస్సులు ఉన్నాయి. కానీ ట్రైన్‌లో వెళ్ళాలంటే ఒకేఒక్క ఆప్షన్ ఉంది. అదే రైల్‌బస్. రెండు స్టేషన్ల మధ్య చిన్న ట్రేక్‌లమీద నడిచే రైల్‌బస్‌లు దేశంలో చాలా తక్కువగా, విదేశాలలో కొన్నిచోట్లా ఉన్నాయి. అలా అరుదుగా కనిపించే రైల్‌బల్ మనజిల్లాలో కూడా ఉండడమే దీని ప్రత్యేకత. దీనిలో నలభై మంది కూర్చోవడానికి సరిపడే ఒకే ఒక బోగీ ఉంటుంది. నలభై కిలోమీటర్ల వేగం దాటి వెళ్ళదు. ఇంజన్‌డైవర్ కంట్రోల్స్‌ని ఎలా ఆపరేట్‌చేస్తున్నాడో అతని వెనుకే కూర్చుని గమనించవచ్చు. బస్సులోలాగా టికెట్లని ఇవ్వడానికి కండక్టర్‌కూడా ఉంటాడు.
లెవెల్ క్రాసింగుల దగ్గర గేటు వెయ్యడానికీ, తియ్యడానికీ ఈ లైన్‌లో ప్రతీచోటా ఉద్యోగి ఎవరూ ఉండరు. అందువల్ల, ఆ పనికోసం ఒకవ్యక్తి రైల్‌బస్‌లోనే ప్రయాణిస్తాడు. క్రాసింగ్‌కి ఇవతల బస్ ఆపితే దిగివెళ్ళి గేటు వేస్తాడు. బస్ క్రాసింగ్ దాటిన తరువాత మళ్ళీ ఆగుతుంది. అప్పుడు అతను గేటు తీసి వచ్చి, బస్ ఎక్కి, విజిల్ వేసిన వెంటనే బండి కదులుతుంది. ప్రతీగేటు దగ్గరా ఆగుతుంది కనుక ప్రయాణీకులు చాలామంది అక్కడే ఎదురుచూస్తూ ఉంటారు. వరదబాదితుల పునరావాస కేంద్రాల్లా కనిపించే పురాతనమైన రైల్వే స్టేషన్లలోకూడా కొంతమంది ఎక్కుతారు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఒక్కోసారి ట్రేక్‌మీద బండికి ఎదురుగా నడుచుకొంటూ వచ్చి బస్సుని ఆపినట్టు ఆపే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఆపాలనే రూలేమీ లేకపోయినా, సాధారణంగా బండి ఆగుతుంది.
మంగళవారం తప్పించి వారంలో ప్రతీరోజూ ఇది నడుస్తుంది. కాకపోతే రోజుకి ఒకటే ట్రిప్. ఉదయం తొమ్మిదిన్నరకి కాకినాడలో బయలుదేరితే పది స్టేషన్లు దాటుకొని 45 కిలోమీటర్లదూరంలో ఉన్న కోటిపల్లికి పదకొండున్నరకి చేరుతుంది. మళ్ళీ పన్నెండు గంటలకి అక్కడ బయలుదేరి కాకినాడకి మద్యాహ్నం రెండుగంటలకి వచ్చేస్తుంది. రైల్‌బస్‌లో వెళ్ళి అష్టసోమేశ్వర ఆలయాలలో ఒకటైన కోటిపల్లి దేవాలయం(ఈ లింక్ క్లిక్ చెయ్యండి) దర్శించుకొని మళ్ళీ అదే ట్రైన్ అందుకోవాలంటే కుదరదు. తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సో, మరొకటో చూసుకోవాలి.
ఇంకొక ముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఒకవైపు రెండుగంటల ప్రయాణంలో చుక్క మంచినీళ్ళుకానీ, టీకానీ, సమోసా పల్లీలు లాంటి చిరుతిళ్ళు కానీ అస్సలు దొరకవు. స్టేషన్లన్నీ ఊళ్ళకి చివర, పొలాలకి దగ్గరగా ఉంటాయి. ప్రయాణంలో మేత అలవాటు ఉన్నవాళ్ళు ఎవరిపాట్లు వాళ్ళు పడవలసిందే!
* * *
గోదావరి డెల్టాకి రవాణా సదుపాయం కోసం 1928లో ఈ లైన్‌ని బ్రిటిష్‌వాళ్ళు వేశారట. 1940లో రెండవ ప్రపంచ యుద్దం రావడంతో స్టీలుకి ఎక్కడలేని కొరతా వచ్చింది. దానివల్ల కోటిపల్లి లైన్‌లో పట్టాలని తొలగించి వేరే చోటకి తరలించారు. అప్పుడు తీసిపారేసిన పట్టాలని తిరిగి వెయ్యడానికి 64 సంవత్సరాలు పట్టింది. సుమారు డెబ్బై కోట్లు ఖర్చయ్యింది. 2004లో అప్పటి రైల్‌వే మంత్రిగారి చేతులమీదుగా కొత్తగా నిర్మించిన కాకినాడ స్టేషను, కోటిపల్లి రైల్వే లైను ప్రారంభించబడ్డాయి.
కాకినాడ-కోటిపల్లి రైల్వే లైన్‌ని బ్రాంచ్ లైన్ అంటారు. ఇది కోటిపల్లి దాకా వెళ్ళి ఆగిపోతుందికానీ అసలు పెద్ద ప్రోజెక్ట్‌లో ఒక భాగం, కోనసీమవాసుల దశాబ్ధాల కల. ఈ లైన్‌ని అమలాపురం మీదుగా నరసాపూర్‌కి కలపాలి. అయితే మధ్యలో గోదావరినదియొక్క మూడుపాయలు - వశిష్ట, వైనతేయ, గౌతమీ ప్రవహిస్తున్నాయి. మూడు బ్రిడ్జీలు కట్టాలి(కోటిపల్లి నుంచి ముక్తేశ్వరానికి, బోడసకుర్రు నుంచి పాసర్లపూడికి, సఖినేటిపల్లి నుంచి నరసాపూర్కి). ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ లైన్ నిర్మాణానికి 700 కోట్ల పైనే ఖర్చవుతుంది. ఖర్చు మోపెడు, బడ్జెట్ కేటాయింపులు పిడికెడు. అందుకే ఎంతోమంది విశ్వప్రయత్నాలు చేస్తున్నా, కల కల గానే ఉండిపోతుంది.
అంతవరకూ ఎదురుచూస్తూ......
© Dantuluri Kishore Varma
Good post
ReplyDeleteధన్యవాదాలు శర్మగారు!
Deleteబాగుందండి.
ReplyDeleteనరసాపురం వద్ద ఉన్న పాయ వశిష్ట గోదావరి.
మరొకసారి సరిచూసుకొంటాను బోనగిరిగారు. తప్పు ఉంటే మారుస్తాను. థాంక్స్!
Deleteమంచి ఆర్టికల్, నెక్స్ట్ టైం తప్పకుండ ఈ కారు ఎక్కుతాము. నా చిన్నప్పుడు కనీసము ఒకసారి సామర్లకోట కి ఎక్కినట్లు గుర్తు.
ReplyDeleteతప్పనిసరిగా వెళ్ళండి రవిగారు. బాగుంటుంది.
DeleteIt is very nice Even though my hometown is Kakinada, we never had board this Railbus. Next time definitely we will see all these things. Thanks for the posting.
ReplyDeleteI am happy you liked this post. Do board this rail bus. It would be an enjoyable trip.
Deleteఅంతా GMC బాలయోగి గారి చలవ. ఆయనేగాని తలచుకోకపోతే ఈ ప్రాజెక్టు సాకారమయ్యేది కాదు. ఆయనుంటే ఈ పాటికి కోనసీమ వాసుల చిరకాల స్వప్నం సాకారమయ్యేది
ReplyDeleteమీతో ఏకీభవిస్తున్నాను. మీ పేరు కూడా రాస్తే బాగుండేది.
Deleteఈ రైల్ బస్ గురించి ఎక్కడో చదివా కానీ ,మీరు చాలా బాగా రాసారు .
ReplyDeleteధన్యవాదాలు రాధిక గారు.
DeleteIt will be a diff experience travelling in it ...Sirivennela cinema starting lo ilanti rail bus ni chusi andulo vellalani undedi..
ReplyDeleteGMC balayogi garu undi unte ee route inka extend aipoyi main line lo kalisi poyedi ..
మనకి అందుబాటులో ఉంది కనుక ఒక్కసారి వెళ్ళి చూడండి. బాగుటుంది. మీరన్నట్టు, నిజంగానే ఈ లైన్ మెయిన్ లైన్‌లో కలిసి ఉండేది.
Deletebaaga rasaarandi. enno vishayalu chakkaga vivaristhunnaru. thanks andi.
ReplyDeleteమీ కామెంటుకి ధన్యవాదాలు మూర్తిగారు.
Deleteadbhutam. writing style super.
ReplyDeleteధన్యవాదాలు రాఘవాచార్యగారు.
DeleteIts nice article and nice work. I have seen this but not boarded. -
ReplyDeleteమీకు నచ్చినందుకు చాలా సంతోషం విజయ్‌గారు
Deletei rarely find time to read your blog but in that few minutes i try to know much more info about my dream homeland,the town of hospitality KAKINADA....i jus love our homeland and your efforts to give appropriate info about our homeland is awesome varma garu....keep posting about our hometown
ReplyDeleteI will try my best to give as much information as possible in the blog. Do give your feed back now and then. Thanks indeed for your valuable time.
Deleteచాలా అద్బుతంగా రాశారు వర్మ గారు..
ReplyDeleteఫోటో లతో సహా కంటి ముందు చూస్తున ఫీలింగ్ కలిగింది.
నాది కాకినాడ కకపొఇన, నాకు చాలా కుతూహలం తెలుసుకోవాలని,
థాంక్స్ రమేష్ గారు. ప్రాంతానిది ఏముందండి, చక్కటి విషయాలు ఎక్కడ ఉన్నా తెలుసుకొని ఆనందించడం ముఖ్యం కానీ!
DeleteDirector and Writer Sri Vamsi also wrote a similar article in Enaadu, Aadivram.'
ReplyDeleteYour article is equally interesting and more detailed. Delighted to read your blog.
Ravindranath Nalam
ధన్యవాదాలు రవీంద్రనాథ్ గారు.
Delete
ReplyDeleteమా పసలపుడి కతలు.లో..వంశీ గారు ఈ రైల్వే లైను గురించి వ్రాసారు..అప్పుడే అనిపించింది...ఒకసారైనా ఇందులో ప్రయాణించి...పల్లెటూర్ల అందాలన్నీ వీక్షించాలని.....మీ బ్లాగు లో మీరు చాలాబాగా వివరించారు...ధన్యవాదములు.....
.Vaidyanath, Palakol.
మీకు నచ్చడం చాలా సంతోషం. ధన్యవాదాలు.
Deleteకిషోర్ వర్మ గారికి ధన్యవాదాలు. చాలా చక్కటి ఇంఫర్మేషను, దానికి తగిన ఫొటోలు పొందుపరచినందుకు.
Deleteనరసాపురం వరకు కాకపొయినా మనం (తెలుగోళ్ళం) ఉంకో పని చెయ్యొచ్చు.
కోటిపల్లి నించి యానాం పది మైళ్ళు మాత్రమె. అంతవరకు యీ లైనుని ఎక్స్టెండు చెయ్యొచ్చు. యానాం పరరాష్ట్రం. పాండిచేరి గవర్నమెంటు తొ సంప్రదిస్తే పనులిట్టే అవుతాయి. అప్పుడు ఈ లైను కి జాతీయ స్థాయి వస్తుంది.
మా తాతగారిది మొగల్తూరు వద్ద జెట్టిపాలెం, నేను కాకినాడ ఇంగనీరింగు కాలేజి లో అయిదేళ్ళ కోర్సు చదివాను. కాకినాడ- నరసాపురం లైను వస్తే ముందే సంబరపడతాను నేను. వసిష్ఠ పైని యేనుగువాని లంక రైల్వే వంతెనకి అనువైనది.
మీరన్నది నిజమేనండి. మీ స్పందనకి ధన్యవాదాలు.
Deletesuperrrrrr post.... keep blogging :)
ReplyDeleteYes, I will Raja Chandra garu. Thanks a lot :)
Deletenice post andi
ReplyDeleteThank you! :)
Deletemeeru chala manchi work chestunnaru. ilane inka manchi vishayaly sekarinchandi mana East Godavari lo ilanti places chala unnay :)
ReplyDeleteధన్యవాదాలు మీకు. ప్రయత్నిస్తాను.
Deletewell post sir...vry rarw info thanx...ee line lo kevalam ee rail bus mathrame nadysthunda mamulu trains nadavava...
ReplyDeleteఈ ఒక్కరైలు మాత్రమే నడుస్తుందండి; మరేమీ నడవవు.
Deleteఇలాగే ఇంకా పెద్ద రైల్ కారు ఒకప్పుడు కాకినాడ సామర్లకోటల మధ్య నడిచేది.అది ఆస్ట్రేలియా తయారీ కోచ్.ఆస్ట్రేలియా ఇండియాకి బహుమతిగా ఇచ్చినదని వినికిడి.రిపేర్లు సామాను దొరకక పోవడం వల్ల కనుమరుగు అయ్యాయి.ఆ కోచ్ మీద తయారీ లేబుల్ పై ఆస్ట్రేలియా మేప్ బొమ్మ ఇప్పటికీ నాకు గుర్తు.
ReplyDeleteఈ విషయం గురించి తెలుసుకోవడం బాగుంది :) ధన్యవాదాలు.
DeleteVery nice sir..... meeru inka kakinada chuttu pakkala visheshaalatho regular ga articles raaayali
ReplyDeleteథాంక్యూ సుధగారు. తప్పని సరిగా రాస్తాను.
Delete