Pages

Thursday, 11 October 2012

ఓ అందమైన అమ్మాయి ఆత్మకథ :p

గోదావరి జిల్లాల ప్రజలు స్నేహశీలురు, గౌరవమర్యాదలు తెలిసున్నవాళ్ళు. అలాగని అమాయకులని మాత్రం అనుకోవడానికి వీలులేదు. `ఆయ్` అని మర్యాద చూపిస్తూనే, తమమర్యాద ఏమైనా తగ్గుతుందని భావిస్తే చమత్కారంగా మాటకి మాట అప్పజెప్పగల చతురులు. ఏ పరిస్థితులలో అయినా నెగ్గుకురాగల వ్యవహారధక్షత కూడా వీళ్ళకు ఎక్కువే. "ఏమిటి, గోదావరి వాళ్ళ వకాల్తా పుచ్చుకొన్నట్టు, అంతలేదు, ఇంతలేదు అని కోతలు కోస్తున్నావ్? వాళ్ళకేనా సుగుణాలు? ఇంకెవరికీ ఉండవా?" అని వాదనకి రావద్దు. ఎందుకంటే, ఈ ప్రాంతపు ప్రజలతో నాకు ఉన్న స్నేహం అపూర్వం. చాలా సంవత్సరాలుగా వాళ్ళ సహవాసం. అదే మీతో స్నేహం ఉండుంటే, మీగురించే చెబుతానుకదా? అర్ధం చేసుకోరూ!   ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ? వస్తున్నా...వస్తున్నా... అక్కడికే వస్తున్నా.

ఇంకొక్క చిన్న ముచ్చట ఉంది. అదికూడా చెప్పనివ్వండి ముందు. అది మన భాగ్యనగరం హైదరాబాద్ గురించి. హమ్మో! ఎంత పెద్ద నగరం. ఫేక్టరీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, స్కూళ్ళు, కాలేజీలు, సినిమా స్టూడియోలు  , షాపింగుమాళ్ళు, హాస్పిటళ్ళు, ప్రాచీన కట్టడాలు, టూరిస్టుప్లేసులు, ఎమ్యూస్మెంట్ పార్కులు, హోటళ్ళు, ప్రభుత్వ ఆఫీసులు... మిలియన్ల కొద్దీ జనాలు... అబ్బో చెప్పాలంటే చాలా ఉంది. "మాకు తెలుసులే. పెద్ద పుడింగిలా నువ్వు మాకు ఏమీ చెప్పకర్లెద్దు," అంటారా? సరే, అలాగే కానిద్దాం. నిజంచెప్పాలంటే, నాకు కూడా ఈ సిటీ గురించి పెద్దగా ఏమీ తెలియదండీ. చెప్పుకొంటుంటే వినడమే.  హైదరాబాదులో నాకు బాగా తెలిసున్న ప్రదేశం రైల్వే స్టేషన్ ఒక్కటే! :P

"నువ్వు ఎవరు? ఎవరు?? ఎవరు??" అని బల్ల గుద్ది అడగక్కర్లా. నేను...నేను...మరేమో నేనూ..... "చెప్పెహే, తొందరగా," అని విసుక్కోవద్దు. అందమైన అమ్మాయిల ముందు అలా అసహనం ప్రదర్శిస్తే ఏం బాగుంటుంది చెప్పండి?

నావయస్సా? హన్నన్నా, ఎంతమాటా? ఎంతమాటా? అమ్మాయిల వయస్సు అడుగవచ్చునా? అడిగినా పరవాలే! నాకు చెప్పుటకు సమ్మతమే. కానీ... అంతకు ముందు మీకు ఇంకొంచము చరిత్ర వివరించవలె!(అమ్మో! అన్నగారి భాష పొంగుకొని వచ్చేస్తుంది ఈ రోజు).

అదేనండీ, మా గోదావరి జిల్లాల్లో ఎంతలేదనుకున్నా ప్రతీ నాలుగయిదు ఇళ్ళకీ కనీసం ఒక్కడయినా మనరాష్ట్ర రాజదానిలో ఉంటాడండీ. ఎందుకా? చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు...ఇంకా చాలా ఉన్నాయి లెండి. వీళ్ళుకాక ప్రతీరోజూ వైద్యానికో, విహారానికో, రాజకీయ రికమండేషన్లకో, సినీమాల్లో వేషాలకోసమో చాలా మంది చలో హైదరాబాదన్నమాట.  పండగలకి, పబ్బాలకి, శెలవులకి, మంచికి, చెడ్డకి... అటునుంచి ఇటు, ఇటునుంచి అటూ నిరంతరం జనాలు తిరగడం నా కళ్ళారా నేను పుట్టింది మొదలు పాతిక సంవత్సరాలనుంచి  చూస్తూనే ఉన్నాను.  అయ్యయ్యో! చూసారా, ఇంకా చెప్పకూడదనుకొంటూనే, నా వయసు యెంతో చెప్పేశాను?  వయస్సు దాచుకొంటే దాగుతుందా? అందులోనూ ఉరుకులెత్తే పరువంలో ఉన్న నాలాంటి వాళ్ళ విషయంలో. ఇలా ఎందుకంటున్నానంటే? నన్నందరూ సూపర్ ఫాస్ట్ అంటారండీ! మీ మీద ఒట్టు. నిజ్జంగానే నేను సూపర్ ఫాస్టు!  బై ద వే! ఈ మధ్యనే అక్టోబరు మూడున నా బర్త్ డే కూడా అయ్యింది. నేను పుట్టిన సంవత్సరం 1987.  

నిరంతరం ప్రజలతో కలిసి తిరిగే ఉద్యోగం. ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇంత జాబ్ సాటిస్ఫేక్షన్ మరెక్కడా దొరకదు. సరదాలు, సంతోషాలు; కేరింతలు, తుళ్ళింతలు; కష్టాలు, కన్నీళ్ళు; నిరుత్సాహాలు, నిట్టూర్పులు; ముచ్చట్లు, మురిపాలు; కొట్లాటలు, దొమ్మీలు - జీవితమంటే రిదమిక్ గా, కమ్మగా సాగే పాటే నాకు. ఒక్కోసారి, ఆ పాటలో అపసృతులు కూడా దొర్లుతుంటాయి. నాలుగేళ్ళ క్రితం వరంగల్లో కే సముద్రం అనేచోట ఏం జరిగిందంటే... అమ్మో! వద్దులెండి, వరంగల్ మాట అంటేనే వెన్నులో వణుకు పుడుతుంది.

నా ఉద్యోగంలో నాకు అస్సలు నచ్చని విషయం... వీడ్కోలు. టాటా చెబుతూ, కంటి చివరి మెరిసే కన్నీటిచుక్కని రెండవచేతితో తుడవడానికి విశ్వప్రయత్నం చెయ్యడం. భార్యనుంచి, భర్తని; కొడుకునుంచి, తండ్రిని; ఓ స్నేహితురాలి నుంచి, స్నేహితుడిని... విడదీసే పాపం. నాకే ఎందుకు? అటువంటి సమయంలోనే నా బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. తిరిగి రాత్రి గడచి, పొద్దుపొడిచే సరికి ఎన్ని ఆనందమైన ముఖాలు... అవే నన్ను మళ్ళీ కర్తవ్యోన్ముఖిని చేస్తాయి. జీవితం అంటేనే కలవడం, విడిపోవడం - అంతే కదా! అమ్మో, ఫిలాసఫీ ఒచ్చేస్తుంది.
మిమ్మల్ని చాలా సేపు సుత్తి కొట్టి విసిగించానండీ...ఉంటానే. పంక్చువాలిటీ ముఖ్యం. బై! కూ...చుకు, చుకు..... ఏమిటండీ మళ్ళీ? నా పేరా? ఇందాకా చెప్పలేదా? అయ్యో, నా మతిమరుపూ, నేనూ! చా! వాకే, వాకే అక్కడికే వస్తున్నా. నా పేరు....గౌతమి.

(ఇంతకీ ఈ కాకినాడ - సికింద్రాబాద్ అమ్మాయి ఎవరో మీకుతెలుసా?)
© Dantuluri Kishore Varma

60 comments:

  1. ఆయ్! బాగా చెప్పేరండి!! :)

    ReplyDelete
  2. :)బాగుందండీ.. బాగా రాశారు.

    ReplyDelete
  3. కష్టేఫలి శర్మగారు మీకు నచ్చినందుకు ఆనందంగా ఉందండి, ఆయ్! ధన్యవాదాలండి.

    ReplyDelete
  4. శిశిర గారు. నా బ్లాగుకి మీకు స్వాగతం. మీకు నచ్చేలా వ్రాయగలిగినందుకు సంతోషంగా ఉంది. మీ స్పందన ఇకముందుకూడా తెలియజేస్తూ ఉంటారని భావిస్తున్నాను. మీ బ్లాగ్లో సంకురాత్రీ ఫౌండేషన్ లింక్ చూసాను. ఈ సంస్థ గురించి నేను ఒక పోస్టు రాశాను. మీకు నచ్చవచ్చు.

    http://manakakinadalo.blogspot.in/2012/09/blog-post.html

    ReplyDelete
  5. వావ్... మన కాకినాడ బ్లాగ్ కూడా ఉందే.. అవునండీ గౌతమికి 25 ఏళ్ళేనా? ఎప్పటినుంచో ఉందేమో అనుకుంటున్నానండీ.. బాగా వ్రాసారు :)
    -సుభ

    ReplyDelete
  6. స్వాగతం శుభహాసిని గారు. `మన కాకినాడలో..` బ్లాగు ఫాలో అవుతూ మీ అమూల్యమైన అభిప్రాయాలని తెలియజేస్తూ ఉండాలని కోరుకోంటున్నాను.

    ReplyDelete
  7. masteruuu...bahu baga rasaru...nijamga melo inta baga rase kala undani nen anukoledu...:)

    ReplyDelete
  8. థాంక్స్ సమీరజ. నా లెసన్స్ లో కూడా కథలుండేవి. నువ్వు గమనించావో, లేదో!

    ReplyDelete
  9. Thank you Mr Trinadh. Welcome to my blog. Keep following.

    ReplyDelete
  10. గౌతమీ ఎక్ష్ప్రెస్స్ ప్రవేశ పెట్టడానికి గల కారణం కూడా బ్లాగ్ లో పోస్ట్ చేస్తే బావుండును .........నేను అది ప్రవేశ పెట్టడానికి గల కారణం మా నాన్న గారి ద్వార తెలుసుకున్నాను ....మీరు పోస్ట్ చేస్తా అంటే సమాచారం అందించడానికి నేను సిద్దం

    ReplyDelete
  11. ప్రమోద్ కుమార్ గారు, ధన్యవాదాలు. ఆ కారణం నాకు తెలియక ఈ పోస్టులో వ్రాయలేక పోయాను. మీ దగ్గర ఉన్న ఆ సమాచారాన్ని కామెంట్ గా అందించండి. పోస్టు స్క్రిప్టులో కూడా కలుపుతాను.

    ReplyDelete
  12. చాల బాగుంది ..

    ReplyDelete
  13. కీర్తి రెడ్డి గారు, రాజా చంద్రగారు - నా బ్లాగుకి ఆహ్వానం. స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు. నా బ్లాగ్ ని ఫాలో అవుతూ మీ అభిప్రాయాలని ఎప్పటికప్పుడు చెబుతారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  14. Thank you Veerababu Pandu gaaru. Keep visiting my blog.

    ReplyDelete
    Replies
    1. అయ్ బాబోయ్ అప్పుడే పాతికేళ్ళయ్యాయాండీ. గోదావరోళ్ళకి గౌతమి తెల్దేటండీ మాబాగారాశారు సుమండీ :)

      Delete
  15. గోదావరి భాషలో మీరు చేసిన ప్రశంస బహులెస్సగా ఉంది. ధన్యవాదాలు పరిమళంగారు.

    ReplyDelete
  16. ధన్యవాదాలు kvrn గారు.

    ReplyDelete
  17. :p title చదివి మోసపోయానుగా....
    కామెంట్స్ చదివేంత వరకు అర్థం కాలేదు మేటర్ train గురించి అని, "గౌతమీ" express సికింద్రాబాద్ వరకు వొస్తున్నప్పుడు హైదరాబాద్ బొత్తిగా తెలీదు అనడం... హ్మ్.... దీన్ని తీవ్రం గా కండించడమైనది .. :p :p

    చాల చాల బావుంది పోస్ట్.... :) బహు బాగా నచ్చినది... :)

    ReplyDelete
  18. నాబ్లాగుకి మీకు స్వాగతం సంతుగారు. స్టేషన్, ట్రేక్‌లు దాటి ఎప్పుడూ వెళ్ళలేదు కనుక, నగరంలో ఏమీ పెద్దగా చూడలేదండీ ఈ ముద్దుగుమ్మ. మీ కామెంటుకి ధన్యవాదాలు.

    ReplyDelete
  19. భలే రాసారులెండి . చివరి వరకూ మీ గురించే చెపుతున్నారనుకున్నా. ( పాతికేనా అబద్ధం ముప్పై ఈజీగా వుంటాయ్ అని కూడా అనుకున్నా..హి..హి.. )

    ReplyDelete
  20. నాబ్లాగ్‌కి మీకు హృదయపూర్వక స్వాగతం లలితగారు. మీ కామెంట్‌కి థాంక్స్.

    ReplyDelete
  21. వార్ని, నీ సిగతరగ...భలే రాత...కసేపు!...కూకొబెట్టెసావు గదయ్యా!...
    ..వేదమయుడు..

    ReplyDelete
  22. వృత్తాంతము చాలా బాగుంది.... :)

    ReplyDelete
  23. ధన్యవాదాలు జానకీరాంగారు. నా బ్లాగ్‌కి మీకు స్వాగతం.

    ReplyDelete
  24. గౌతమి ఎక్స్‌ప్రెస్‌కి ముందు కాకినాడ నుంచి కొన్ని బోగీలు సామర్లకోటలో గోదావరి ఎక్స్‌ప్రెస్‌కి కలిపేవారట.
    అలాగే నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ మొదలు పెట్టిన తరువాతే అక్కడి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళటం ఎక్కువయ్యింది.

    ReplyDelete
  25. ఖచ్చితంగా తెలియదుకానీ, నేను కూడా ఈ సమాచారం గురించి విన్నాను బోనగిరిగారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  26. aangla baasha lone kakunda telugu bashalo kuda meeku meere saati anipinchukunnaru guruvarya... meeku satha koti vandanamulu... :)

    ReplyDelete
    Replies
    1. మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
    2. quite interesting....keep writing, please> It improves ur writing skills and will increase our reading habit !!!

      Delete
    3. Thank you very much ~ Creative Thinking.

      Delete
  27. guruvu garu meeru keka undi co-canada gurunchi meeru bahu baga cheppinara............................... meeku dhnyavadalu........................

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు దుర్గా ప్రసాద్ గారు. స్పందన తెలియజేసినందుకు చాలా సంతోషం.

      Delete
  28. Veru gud information sir.....Dantuluri Kishore Varma Garu.....

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ సత్యన్నారాయణ రాజు గారు.

      Delete
  29. Baga cheparu andi Bava garu..........

    ReplyDelete
  30. చాలా చక్క గా వుందండి. అభినందనలు మీకు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సుమగారు.

      Delete
  31. మొదటిసారి చుస్తున్నాను అండి మీ బ్లాగ్ చాల బాగుంది:)

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది విజిగారు.

      Delete
  32. మా గౌతమి గురించి భలేగా చెప్పారండీ...

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు సంతోషం స్పురితగారు. ధన్యవాదాలు.

      Delete
  33. me blog chla bagundi kishore varma garu. facebook lo vunna telugu bloggerlu patakulu oka chota ane group dwara me blog parichayam aindi. mukhyam ga me sulabhamina padalato vyakteekarinch shayili baga nachindi andi....

    ReplyDelete
    Replies
    1. కుమార్‌గారూ, చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

      Delete
  34. :) బావుందండీ. మీ గౌతమి మహా కొంటె పిల్ల సుమండీ ! భలే చెప్పేసి మనసు దోచేసింది .

    ReplyDelete
  35. Awesome writing sir. It just happened to visit this page when one of my friend liked your post in FB.

    I'm going through many of your posts since morning. I enjoyed your writing very much.

    I'll install Telugu fonts on my system and next time I'll comment in Telugu.

    Thanks for making my day. I'll be waiting for your posts daily. :)

    ReplyDelete
    Replies
    1. గణేశ్‌గారు మీకు నాబ్లాగ్ నచ్చడం, నాకు ఆనందాన్నిస్తుంది. మీ ప్రశంసకి ధన్యవాదాలు. మీ తెలుగు కామెంట్లకోసం ఎదురు చూస్తూ ఉంటాను.

      Delete
  36. chala bagundi mee blog - thank u

    ReplyDelete
  37. Kishore varma garu..

    mee blog naaku chaala istam sir..
    almost regual gaa chaduvuthaa..
    konchem replies raayadaaniki baddakam..
    mee narration..cheppe vishayalu chakkaga vuntayi..
    veelunte..mummidivaram..muramalla gurinchi raayandi..
    eppudaina atu velthe..

    ReplyDelete
    Replies
    1. ఆ ప్రాంతపు విశేషాలు కూడా రాయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటికే కొన్ని ఉన్నాయి చదవండి. మీ వాఖ్యకి ధన్యవాదాలు.

      Delete
  38. ప్రతీ వ్యాఖ కి స్పందించే మీ సంస్కారం కి నా ధన్యవాదాలు

    ReplyDelete
    Replies
    1. మీ అప్రీసియేషన్ చాలా ఆనందపరుస్తుంది రావుగారు. ధన్యవాదాలు.

      Delete
  39. Cooll....ya😃😃

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!