Friday, 8 February 2013

ఉన్నదేంటి, లేనిదేంటి?

`నాకూ తియ్యండి సార్,` అన్నాడు ఆ అబ్బాయి. కాకినాడకి ఓ యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరు అది. కొండప్రదేశం. మేం పిక్నిక్‌కి వెళుతూ, రోడ్డువార నీరుపెట్టిన పొలాల్లో దుక్కిదున్నుకొంటూ, నాట్లు వేసుకొంటున్న మనుష్యులని ఫోటోలు తీయ్యడానికి ఆగినప్పుడు  ఓ పదేళ్ళ కుర్రాడు మావెనుకనుంచి వచ్చి అడిగిన సందర్భం ఇది. అతనికి ఫొటో తీస్తే, `నన్ను చూడనియ్యండి,` అన్నాడు. డిజిటల్ కెమేరాలో తీసిన ఫొటోని చుపిస్తే చాలా అనందపడిపోయాడు. ఇంకొక అయిదు నిమిషాల తరువాత ఒక చిన్న పిల్లని తీసుకువచ్చి, `మా చెల్లికి కూడా ఫొటో తియ్యండి,` అన్నాడు. ఆ అమ్మాయి సిగ్గుపడిపోయి మొహం చేతుల్లో దాచేసుకొంది. సెల్ ఫోన్లలో ఇన్‌బిల్ట్ కెమేరాలు వచ్చిన తరువాత ఫోటో తియ్యడం, తీయించుకోవడం పెద్ద విశేషాలు కాదు. కానీ ఈ ప్రదేశంలో సెల్ సిగ్నల్ రాదుకనుక ఈ సాంకేతికత వాళ్ళకి అందుబాటులో లేదు. ఇది ఏజన్సీ ప్రాంతం ఏమీ కాదు. జిల్లా కేంద్రానికి చాలా దగ్గరలోనే ఇలాంటి పల్లెలు ఇంకా ఉన్నాయి. కొన్ని చోట్ల ఊళ్ళకి విద్యుత్ సరఫరా లేదు. సరయిన రోడ్లు లేవు.
మార్గమధ్యంలో మేం వెళ్ళవలసిన ప్రదేశానికి దారి తెలుసుకోవడానికి ఒక గొర్రెల కాపరిని ఆపాం. అతని చేతిలో మద్యాహ్న భోజనానికి ముంత ఉంది, ఇంకొక చేతిలో మేకలని అదిలించడానికి కర్ర. ఉదయం చల్దన్నం తిని మేకలని కొండమీదకి మేపడానికి తీసుకొని వెళతాడట. ఏ చెట్టుక్రిందో కూర్చుని మద్యాహ్న భోజనం తినేసి సాయంత్రం వరకూ కాపలా కాస్తూ, పొద్దు పోయే లోపే ఇంటి దారి పడతాడట. `సాయంత్రం టీ.వీ. చూస్తావా?` అంటే. `మాకు కరెంటు లేదు కదా! తినేసి, తొంగోడమే!` అన్నాడు. లేదనే బాధ అతని మాటల్లో ఏమీ కనిపించలేదు.

అమరావతి కథల్లో సత్యం శంకరమంచి రాసిన `ఒకరోజు వెళ్ళిపోయింది` అనే కథ జ్ఞాపకం వచ్చింది. పిచ్చయ్య పరుగెత్తే ప్రవాహం అడుగు తెలియకుండా ఈదుకెళ్ళే చేపపిల్లలా, తొణకని సరస్సులో కదలని అలలా , కాలానికి తెలియకుండా, కాలంతో కలిసిపోయి బ్రతుకుతాడు. ఉదయాన్నే కృష్ణా నదికి స్నానానికి వెళ్ళింది మొదలు, సాయంత్రం నిద్రలోకి జారుకొనేవరకూ మార్పులేని ఒకేరకమైన జీవితాన్ని ప్రతీరోజూ, మరణించేవరకూ గడుపుతాడు - పూర్తి సంతృప్తితో. కథ చివరిలో రచయిత `ఇది చాలదా?` అని ప్రశ్నిస్తాడు. `చాలడంలేదు చాలామందికి,` అని కూడా నొక్కి వక్కాణిస్తాడు. 

పూర్వకాలంలో రాజకుమారులు దేశాటన పూర్తిచేస్తేనే కానీ పట్టాభిషేక అర్హత సంపాదించలేకపోవడం గురించి కథల్లో చదువుకొన్నాం. రాజధానినుంచి పల్లెసీమల్లోకి వెళ్ళి ప్రజల స్థితిగతుల గురించి తెలుసుకోవడం గురించి ఈ దేశాటనలు.   అలాగే, ఇంగ్లాండ్లో చదువు పూర్తయిన తరువాత గ్రాండ్ టూర్ అని ఒకటి ఉండేదట. పెద్ద పట్టణాలను కొన్ని నెలల పాటు సందర్శించి రావాలి.  ఇవన్నీ చదువులో ఒక భాగమే.

స్వామీ వివేకానంద ఒక ఉపన్యాసంలో `మనుష్యుల మధ్య తారతమ్యాలు ఎందుకు వస్తాయి?` అనే విషయం గురించి చెపుతూ నూతిలో కప్ప కథని ఉదహరిస్తాడు. ఒక నూతిలో కప్ప తానున్నదే ప్రపంచం అనుకొంటూ ఉంటుంది. ఒకరోజు ఎక్కడినుంచో ప్రమాదవశాత్తు ఒకసముద్రంలో ఉండే కప్ప వచ్చి నూతిలో పడుతుంది. `నువ్వు ఎక్కడినుంచి వచ్చావు?` అని అడిగి, సముద్రం నుంచి అని తెలుసుకొని, `మీ సముద్రం మా నుయ్యి అంత పెద్దగా ఉంటుందా?` అని అతిశయంతో నుయ్యి ఆ చివరి నుంచి, ఈ చివరికి గెంతుతుంది. ఆమాటలకి ఆశ్చర్యపోవడం సముద్రపు కప్ప వంతు అవుతుంది.

ఇక్కడ పల్లె నూతి లాంటిది, పట్టణం సముద్రం లాంటిది అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. మనపరిదిని దాటి ప్రజలని,    వాళ్ళ జీవన విధానాల్నీ తెలుసుకోకపోతే ఏదయినా నూతి లాంటిదే. పల్లెల సౌందర్యాన్ని చూడకపోతే, అక్కడి మనుష్యుల ప్రశాంతమైన జీవనవిధానాన్ని తెలుసుకోకపోతే  చదువుకి పరిపూర్ణతలేదు. అలాగే జరుగుతున్న అభివృద్ది గురించి తెలుసుకోకుంటే  ఆలోచనా పరిధి కుంచించుకుపోయినట్టే.

ఒక వ్యక్తిత్వ వికాశ ఉపన్యాసంలో ఒక ఉదాహరణ చెప్పారు. ఊరపంది దృష్టి ఎప్పుడు చెత్తమీదే ఉంటుందట. పుట్టింది మొదలు తనకు తినడానికి పనికి వచ్చే పదార్థాలకోసం పెంటకుప్పల వెంట, రోడ్డు ప్రక్కల, డ్రయనేజీల్లో వెతుకుతూ ఉంటుంది. అది బాగా బలిసిన తరువాత కసాయి దాన్ని పట్టుకొని కాళ్ళు కర్రకి కట్టేసి తల్లక్రిందులుగా వ్రేలాడదీసి తీసుకొని పోతాడు. అప్పుడు మొట్ట మొదటిసారి దానికి ఆకాశం కనిపిస్తుందట. `ప్రపంచం ఇంత ఉందా!` అని అచ్చెరువొందుతుందట. కానీ ఏం లాభం అప్పటికే జరగాల్సిన కాలయాపన జరిగిపోతుంది.

పట్టణాలలో యాంత్రికమైన జీవన విధానానికి అలవాటు పడిపోయి, అసంతృప్తితో బ్రతుకులు వెళ్ళదీస్తున్న జనం, వాళ్ళ వాళ్ళ చట్రాల్ని విడిచిపెట్టి  ప్రపంచంలోకి వెళితే, వాళ్ళకి నిజంగా ఉన్నదేంటో, లేనిదేంటో తెలుస్తుంది. జీవించడం యొక్క నిజమైన విలువ అవగతమౌతుంది.
© Dantuluri Kishore Varma

10 comments:

 1. మనకి పక్కవారిని పలకరించడానికే సమయం లేదండి, పోగేతతో.

  ReplyDelete
 2. Very good. Top heading ("Remamber") line in your blog has a spelling mistake. Please correct it. Excellent example for pig at the end.

  Regarding Swami Vivekananda in the last post.. yes his every word is inspriration. But do remember that behind that power is the decades of selfless service and sacrifice. And of course the spiritual power of Sri Ramakrishna. SRK used to tell SV, "Boy, if you want help I am ready even to beg from door to door for you," because SRK knew why SV was born.

  Such is the power of spiritual people like SRK who sat silently in one small area of Calcutta. That kind of people who sit quietly in the caves of Himalayas are the ones that influence the world, not us dealing with high tech everyday :-) ironic or not. Their thoughts come out of the caves with a thunder and move around the world with terrific power because they are selfless thoughts aimed at the general good of the world.

  Sometimes I would think, why did God choose Gandhi as freedom fighter? Gandhi was so frail and weak and he could hardly stand any 100 lb guy in fist fight. Why not someone like Arnold Schwarzneggar? It is becuase Gandhi alone could withstand the 30 or 40 days of fast; but not Arnold :-) Can Arnold ever get the mental toughness of a Gandhi? We know the answer NOW because we have seen what a Gandhi can do singlehandedly to the entire world. Ditto with Martin Luther King or Nelson Mandela.

  Finally a quote about SV again. Someone asked Him what message he would give to India/World. He said "I have give message for next ten thousand years." He lived for 39 years and gave a high voltage electric shock to the country. The vibrations were shocking, have been there and are sure to be felt for next 10K years.

  ReplyDelete
 3. I must thank you for having given your insights about these great personalities. As you have rightly pointed out, Gandhi, Vivekananda and such others had great mental prowess to withstand difficult situations and made indelible mark on the hearts of millions. We cannot expect ourselves to influence people at a degree at which Sri Rama Krishna or Vivekananda did. It is enough for me if I am able to gather some pearls of wisdom from his works. Thanks indeed for your correction DG garu.

  I am not able to get to your profile or your blog. There may be some technical problem.

  ReplyDelete
 4. నిజమే శర్మ గారు!

  ReplyDelete
 5. Wonderful Post.
  సిగ్గుపడుతున్న ఆ పాప, ఆ moment ఫొటోలో భలే బాగా capture చేశారండీ!
  చాలా బాగా రాస్తున్నారు.
  Congrats and Keep it up!

  ReplyDelete
 6. చాలా, చాలా ధాంక్స్ చిన్ని ఆశగారు.

  ReplyDelete
 7. అవునండి...మనిషి యెప్పుడు నిలవ నీరులా ఒకేచోట ఉండకూడదు...రకరకాల ప్రదేశాలు తిరుగుతున్నప్పుడే లోకం పోకడ మరింత బాగా అవగతమౌతుంది...ఒక bag,ఒకనీళ్ళబాటిల్ పట్టుకొని ఒంటరిగా ఒక్కో యేడాది ఒక్కో రాష్ట్రం తిరగడం నా హాబి.నిజం చెప్పాలంటే ఒక్కోసారి భయం కూడా వేస్తుంది."Be fearless my boy" అనే స్వామి వివేకానంద స్వరం వినబడినట్టుగా అనిపిస్తుంది.అంతే...భయం గాలిలోకి యెగిరిపోతుంది...dg గారు అన్నట్లుగా స్వామిజి ఆత్మ తన అనుయాయుల్ని యెప్పుడూ ఉత్షాహ పరుస్తూనే వుంటుంది. " My children will work like lions" అని వురికినే అన్నారా ఆయన..!Great post..please keep it up.#

  ReplyDelete
 8. మూర్తిగారు మీది నిజానికి చాలా మంచి హాబీ. అందరం అలా రకరకాల ప్రదేశాలకి వెళ్ళి చూడాలనుకొంటాం కానీ ప్రాక్టికల్‌గా చెయ్యలేం. మీ ఎక్స్పెడిషన్ల గురించి మీ బ్లాగులో చదువుతూ ఉంటాను. చాలా బాగుంటుంది. ఆలస్యంగా స్పందిస్తున్నందు క్షమించాలి. మీకు ఈ టపా నచ్చినందుకు ధన్యవాదారు.

  ReplyDelete
 9. పోస్ట్ చాలా బాగుంది వర్మ గారు!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు హర్షగారు.

   Delete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!