హంస పాలనీ, నీళ్ళనీ విడగొట్టగలిగినట్టు వీళ్ళు భక్తినీ, రక్తినీ విడగొట్టారు. ఎలాగా అంటారా? టౌన్‌లో మెయిన్ రోడ్‌కి సమాంతరంగా అటుఒకటి, ఇటుఒకటీ రోడ్లు ఉంటాయి. ఒకదానిలో ఈచివరినుంచి, ఆచివరివరకూ ఎన్నో దేవాలయాలు ఉంటాయి. అందుకే దాన్ని దేవాలయం వీధి అంటాం. ఇక రక్తి విషయానికి వస్తే - దానికి కూడా ఒక ప్రత్యేకమైన రోడ్డు వుంది. ఇంతకు ముందు చెప్పాను కదా రెండుసమాంతరమైన రోడ్ల గురించి? ఆ రెండవదే జనాలకి వినోదం కలిగించేది. పేరు సినిమా వీధి. ఒకటి, రెండు సినిమా హాళ్ళు మినహా మిగిలినవన్నీ ఇదే వీధిలో ఉండేవి. అప్పటికప్పుడు అనుకొని సినిమాకి బయలుదేరినా, వరసగా థియేటర్లన్నీ ఒక్కొక్కటీ చూసుకొంటూ వెళితే, ఎక్కడో ఒకచోట టిక్కెట్లు దొరికేవి.
జగన్నాధపురం వంతెన దాటి కుడివైపుకి తిరిగి కొంచెం ముందుకి వెళితే ఎడమచేతివైపు వచ్చే పెద్దరోడ్డు సినిమా వీధి. విశాలమైన స్థలంలో కట్టిన పెద్ద హాలు స్వప్నా థియేటర్. ఇప్పుడు దాన్ని మూసేశారు కానీ, ముప్పై ఏళ్ళక్రితం టౌన్‌లో ఉండే రెండు, మూడు మంచివాటిల్లో ఇదొకటి. 1983లో సాగరసంగమం విడుదలయ్యింది. స్వప్నా థియేటర్‌లోనే చూశాను. బాల్కనీ టిక్కెట్టు నాలుగు రూపాయల యాభై పైసలు. ఇంటర్‌వెల్లో అమ్మే సాఫ్టీ ఐస్‌క్రీం చాలా బాగుండేది. ఎప్పుడు వెళ్ళినా తప్పనిసరిగా కొనుక్కోవలసిందే.
సినిమా పేరు చెపితే ఎవరికైనా ఎన్నెన్నో జ్ఞాపకాలు ఉంటాయి. సత్యగౌరీ హాలులోకి ఎప్పుడూ ఇంగ్లీష్ సినిమాలు వచ్చేవి. చూడటానికి పాతరైస్‌మిల్లుని రీమోడల్ చేసినట్టు ఉంటుందికానీ సౌండ్ సిస్టం మాత్రం మరెక్కడాలేని లేటెస్ట్‌ది వీళ్ళు పెట్టేవారు. ఏ.సీ. హాలు కాకపోయినా సౌండ్‌క్వాలిటీ గురించే ఇక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ బ్లాక్‌లో టిక్కెట్లు దొరికే ప్రసక్తే లేదు. కౌంటర్ దగ్గర `మనిషికి ఒక్క టిక్కెట్టు మాత్రమే` అని బోర్డ్ పెట్టేవారు. చాలా కాలం నుంచి ఇక్కడికి వెళ్ళలేదు కానీ, ఇప్పటికి కూడా పరిస్తితి అలాగే ఉన్నట్టుంది. బ్రేక్‌లో అమ్మే పూరీ కూర చాలా బాగుంటుందని చెపుతారు(నేను తినలేదండి, ఎప్పుడూ...ప్చ్!). చార్లీ చాప్లిన్ సినిమాలు సిటీ లైట్స్, మోడ్రన్ టైంస్, ది కిడ్ లాంటివి వరుసగా వచ్చేవి. లారెల్ అండ్ హార్డీ, జేంస్‌బాండ్, జపనీస్ షావోలిన్ తరహా మార్షల్ ఆర్ట్స్ సినిమాలు చాలా ఇక్కడ చూసాను.
సందర్భం వచ్చింది కనుక ఇంటర్‌వెల్‌లో మేతగురించి ఇంకొక్కవిషయం చెప్పాలి. అన్ని సినిమా హాళ్ళలోనూ తప్పనిసరిగా ఉల్లిపొకోడీ, ఉల్లిసమోసాలు అమ్మేవారు. వాటి వాసన అమోఘం. చేతినిండా ఆయిల్ అంటుకొన్నా, పెద్ద వాళ్ళు తినొద్దని తిట్టినా- కొనమని అడగకుండా, తినకుండా ఉండలేకపోయేవాళ్ళం.
విజయా, పేలెస్, క్రౌన్, మెజస్టిక్, వేంకటేశ్వరా, కల్పనా లాంటి సినిమాహాళ్ళు మూతపడ్డాయి. అయినప్పటికీ ఒకటిరెండు జంక్షన్లని మాత్రం మెజస్టిక్ వీధి అనీ, కల్పనా సెంటర్ అనీ ఇప్పటికీ పిలుచుకొంటున్నాం. పేలెస్, పద్మనాభా వాళ్ళు చాలా మటుకు పెద్దలకు మాత్రమే తరహా సినిమాలు ఆడించేవారు. కాలేజిలో చదువుకొన్నప్పుడు మా క్లాస్ మేట్ ఒకడు, హాస్టల్‌లో ఉండేవాడు. కాకినాడలో ఏ ప్రాంతమూ సరిగ్గా తెలీదు వాడికి ఒక్క దారి తప్ప - పేలెస్ థియేటర్‌నుంచి హాస్టల్‌కి వెళ్ళేది. అందరం ఆటపట్టించేవాళ్ళం వాడిని `ఎప్పుడైనా దారి తప్పిపోతే, పేలెస్‌కి ఎలా వెళ్ళాలో అడుగు, అక్కడినుంచి నీకు ఎలాగూ తెలుసు కదా,` అని.
దేవీ శ్రీదేవి, చాణుక్య చంద్రగుప్తా మాత్రమే ట్విన్‌థియేటర్లు. కొత్తసినిమాలు వచ్చేవి. సినిమా వీధిలో చాణుక్య చంద్రగుప్త దాటిన తరువాత మరేమీ లేవు. ఓవర్ బ్రిడ్జ్ దాటిన తరువాత ఆనంద్, పద్మప్రియా ఉండేవి. వాటికి వెళ్ళాలంటే ఊరిచివరకు వెళ్ళినట్టే.
ఆనంద్‌కి ఎదురుగా ఖాళీ స్థలం ఉండేది. అక్కడ ఎవరో సైకిల్ స్టాండ్ పెట్టారు. సినిమాకి వచ్చిన వాళ్ళు థియేటర్‌లో పార్క్ చెయ్యడం మానేసి, బయటివాళ్ళు ఎవరో నిర్వహిస్తున్న ఈ స్టాండ్లో చేసేవారు. దానితో, ఆనంద్‌స్టాండ్‌లో పార్క్ చేస్తే కౌంటర్ దగ్గరకి వెళ్ళక్కర్లేకుండానే టిక్కేట్లు ఇచ్చేవారు. కొత్తసినిమా వచ్చినప్పుడు బండి ఇక్కడ పార్క్ చెయ్యగలిగితే టిక్కెట్ రిజర్వ్‌చేసుకొన్నట్టే. ఒక్కోసారి సైకిళ్ళు లేనివాళ్ళు అద్దె సైకిల్ షాపునుంచి తీసుకొని స్టాండ్‌లో పార్క్‌చేసి టిక్కేట్లు సంపాదించేవారు.
ఆనంద్‌కి ప్రక్కనే వాళ్ళదే గీత్‌సంగీత్, అంజనీ, కరణంగారి జంక్షన్ దగ్గర వీర్‌కమల్, తూరంగిలో సూర్యామహల్, వంతెనదగ్గర చంద్రికా, మెయిన్‌రోడ్లో తిరుమలా, మెజస్టిక్ దగ్గర మయూరీ, పద్మప్రియాకి చేర్చి శ్రీప్రియా లాంటి హాళ్ళు క్రమంగా వెలిశాయి. కొన్ని మల్టీప్లెక్స్‌లు గా రూపాంతరం చెందాయి.
ఈ బ్లాగ్ చదువుతున్నవాళ్ళలో ఎంతోమంది సొంతవూరికి చాలా దూరంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. నాస్టాల్జిక్‌గా దీనికి కనెక్ట్ అవడానికి, మధురస్మృతులని మళ్ళీ జ్ఞాపకం చేసుకోడనికీ ఈ టపా! చదువుతున్న మీరు కాకినాడ వాళ్ళు కాకపోయినా థియేటర్ల, ప్రాంతాల పేర్లు తప్పించి మీవూరి సినిమాహాళ్ళ చరిత్రకూడా ఇలాగే ఉండవచ్చు!
మీ సినిమా కబుర్లని, జ్ఞాపకాలనీ కామెంట్లుగా పంచుకొంటే సంతోషిస్తాను.
© Dantuluri Kishore Varma
కాకినాడలోని సినిమా హాళ్లు గురించి అంత అవసరమా సర్?
ReplyDeleteఅవసరం కాకపోవచ్చు చౌదరిగారు :)
DeleteAvasareme, nenu interemediate lo unnapudu anni theaters parichayame, mukyam ga satya gowri theater lo clifhanger etc. movies vachinapudu bhaari settings vesevaru, anni theaters lonu block lo tickets dorikevi okka satyagowri lo thappa. ee article chala bagundi varma garu, thanq
Deleteమీజ్ఞాపకాలను పంచుకొన్నందుకు ధన్యవాదాలు, రాజ్‌గారు.
Deleteఏభయి ఏళ్ళకితం వార్ఫ్ రోడ్ నుంచి కల్పనా టాకీస్ దాకా ఆ ముందు త్యాగరాయ గాన సభదాకా రోజూ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర దాకా బీట్ కాసేవాళ్ళం. :)
ReplyDeleteమీరు ఏ విషయంలోనూ తగ్గలేదు శర్మగారు, హ్యాట్సాఫ్!
Deleteచూశారా శర్మ సర్ ఎంత పని చేశేవారో...:-)
ReplyDeleteవర్మాజీ , అప్పటి దారులే గుర్తుకు వచ్చాయో... లేక ఇంకేవైనా గుర్తుకు వచ్చాయో ఓ మారు అడగండి మాస్టార్ని.
బాగుందండి మీ పురప్రముఖులకు మీరిచ్చే కానుక ఈ బ్లాగ్.
ఆ..మధుర జ్ఞాపకాల గురించి శర్మగారే చెప్పాలి
Delete(శర్మగారూ, `కామెంటు పెడితే ఇలా తగులుకొన్నారేమిట్రా బాబూ!` అనుకొంటున్నారా?).
మెరాజ్‌గారూ ధన్యవాదాలు.
మీ విశ్లేషణ చాలా బాగుంది వర్మ గారూ...! కాకినాడ లో వాకలపూడి లోని సూర్య మహల్ మరియు తిమ్మాపురం లో ఉన్న రాజ్ దియేటర్ ల గురించి కూడా రాసి ఉండాల్సింది...!
ReplyDeleteఅవునండీ రాయవలసింది. నేను మరచిపోయిన విశేషాలు ఉంటే ఎవరయినా అందిస్తారనే ఉద్దేశ్యంతోనే పాఠకులనుండి ప్రత్యేకంగా కామేంట్లు కోరడం జరిగింది. సమాచారానికి ధన్యవాదాలు.
Deleteమా ఫ్రెండ్ రాజమండ్రి అప్సరాని వదిలేసి... ఇంగ్లీష్ సినిమాలు చూడడానికి కాకినాడ సత్యగౌరికి నెలకి రెండుసార్లు వెళ్ళేవాడు... (వాళ్ళన్నయ్య అక్కడ జేఎన్‌టీయూలో చదువుతుండేవాడు లెండి...)
ReplyDeleteఒక్కొక్క బ్రాండ్ నేం అలా స్థిరపడిపోతుంది. ఈ థియేటర్‌కి కూడా అలానే అయ్యింది ఫణిగారు.
DeleteYou touched my heart.....it remained me so many things.... thank you...we stayed at jagannickpur
ReplyDeleteThank you so much :)
Deletethank you Kishore garu, mee post naaku chaalaa nacchindi.
DeleteNandoori Sundari Nagamani (Karuna)
ఈ టపా మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది కరుణగారు :)
Deleteమీ పోస్ట్ చదవగానే మనసు ఒక్కసారిగా పురి విప్పిన మయూరమై బాల్యపు బంగారు వనం లోనికి దూసుకుపోయింది. మేము 1972 నుండి 1977 వరకూ అక్కడే ఉన్నాము. ఆరో తరగతి నుండి, పదవ తరగతి వరకూ అక్కడే చదువుకున్నాను. సినిమా వీథి అంటే ఆరోజుల్లోనే మాకొక పాషన్. ‘కల్పనా థియేటర్’ లో చూసిన పాత సినిమాలు ఎన్నెన్నో... ముఖ్యంగా విజయా వారివి, మరింత ముఖ్యంగా సినిమాలల్లో మహా సినిమా అయిన చిత్ర రాజం ‘ మాయాబజార్’ అక్కడే బోలెడన్ని సార్లు చూసాం. ఇంకా పుట్టినిల్లు- మెట్టినిల్లు, ‘రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్’ కూడా అక్కడే. ఇంకా సత్యగౌరీ సినిమా లో చూసిన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం... ఆరోజు ఎంత రష్షో చెప్పలేను. ‘క్రౌన్’ హలో ‘మంచి మనుషులు’, ‘బంగారు బాబు’ చూసాము. ‘మెజెస్టిక్’ లో ‘చెల్లెలి కాపురం’, ‘వివాహ బంధం’, ‘యశోదా కృష్ణ’ సినిమాలు... ‘బడిపంతులు’ కూడా అక్కడే అని గుర్తు. ‘పద్మప్రియ’ లో ‘భక్త కన్నప్ప’, ‘జేబు దొంగ’... ‘స్వప్న’ లో ఒక్కటి కూడా చూడలేదు. ఆ హాల్ల్లో సినిమా చూడటం అంటే ఒక లగ్జరీ మాకు. అంత ప్రతిష్టాత్మకమైన థియేటర్ లో సినిమా చూడలేకపోయినందుకు ఈనాటికీ చింతే మరి. ఇంకా ‘అమ్మాయిల శపథం’, ‘దేవుడే దిగివస్తే’ ఇవి ఏ హాల్లోనో గుర్తు లేదు. ‘ఆనంద్’ లో ఒక్కటీ చూడలేదు. ‘విజయ’, ‘పాలస్’ గుర్తు లేవసలు. మిగిలినవి మీరు రాసిన సినిమా హాల్స్ అన్నీ తర్వాత వచ్చినవి. ఇంచక్కని పోస్ట్ పెట్టినందుకు థాంక్స్ అ లాట్ అండీ...
ReplyDeleteమీ చిన్నప్పటి జ్ఞాపకాలని పంచుకొన్నందుకు ధన్యవాదాలు. `మనసు ఒక్కసారిగా పురి విప్పిన మయూరమై బాల్యపు బంగారు వనం లోనికి దూసుకుపోయింది.` ఈ మాటా చక్కగా చెప్పారు. :)
Deleteఆ రోజుల్లో కాకినాడలో ఉన్న అందమైన డీలక్స్ సినిమా థియేటర్లు ఆంధ్రదేశంలో మరెక్కడా లేవని చెప్పుకునేవారు. విచిత్రమేంటంటే కాకినాడ కూడా ఓ మహాపట్టణం అని తెలంగాణ, రాయలసీమల్లో తెలియకపోవడం. ఎందుకంటే ఇక్కణ్ణుంచి ఎప్పుడూ ఏ విధమైన క్రైమ్ న్యూసూ రాదు. ఇదో Silent City.
ReplyDeleteమీరు చెప్పిన పాయింట్ నిజమే. కాకినాడ ఒక ప్రశాంతమైన పట్టణం. మీ అభిప్రాయాన్ని పంచుకొన్నందుకు ధన్యవాదాలు :)
Deleteస్వప్న మొట్టమొదటి ఏసి హాలు కాకినాడకి.ముత్తా గోపాలక్రిష్ణ కట్టించారు.మొదట పాకీజా సినిమాతో హాలు ఓపెన్ అయింది.రెండో సినిమాగా శారద వచ్చింది.టిక్కెట్టిచ్చి హాలు డోర్లు తెరవగానే లోపలికి దూరిపోవాలనేట్టు ఉండేది.మంచి వెస్టర్న్ మ్యూజిక్ వేసే వాడు.తెర కర్టెన్ పైకి లేవడం చూడటం కూడ ఆనందంగా ఉండేది.తెల్లటి పెద్ద బాతులు పెంచేవారు.హాలు ముందు పెద్ద వెదురు చెట్ల గుబురు చాలా అందంగా ఉండేది.సినిమా చూడటమే కాకుండా హాలు ఇచ్చే అనుభూతి కూడ చాల గొప్పగా ఉండేది.అదే గోపాలక్రిష్ణ ఇపుడు ఆ హాలుని ఎందుకు దెయ్యాల భవంతిలా వదిలిపెట్టాడో అర్ధం కాదు.ఆయన చాలా ధనవంతుడు లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా నడపగల సత్తా ఉన్నవాడే.కాకినాడలో మొదటి లగ్జరీ హోటల్ మానస సరోవర్ కట్టింది కూడ ఆయనే.అది ఇప్పటికీ పేరూ రూపూ మార్చుకుని నడుస్తోంది.
ReplyDeleteమీరు చెప్పిన స్వప్న థియేటర్ వర్ణన కళ్ళకు కట్టినట్టు ఉంది. చాలా బాగా చెప్పారు. అభినందనలు :)
Deletevarma garu ee article super.. memu free ga vundi , jebulo dabbulu vunte maa cycle meedha swapna theatre nundi start ayyi padmapriya varaku vachevallamu . choodani movie vunte aa theatre lo dhoore vaallamu
ReplyDeleteఓకే వీధిలో చాలా థియేటర్లు ఉన్నందువల్ల వరుసగా పోస్టర్లు చూసుకొంటూ వెళ్ళి నచ్చిన సినిమా చూడగలగడం మన కాకినాడ వాళ్ళకి దొరకిన సౌలభ్యం. ధన్యవాదాలు సుధ గారు :)
Deleteనా వంతు -
ReplyDeleteకల్పనా లో మయా బజార్ కౌంటు 16 సార్లు.
స్వప్నలో నర్తన సాల
సత్య గౌరిలొ జేమ్స్ బాండు సినిమాలు
ముఖ్యం గా - చాణుక్య లో సుందర కాండ నేల లో కూర్చొని ( అవి గేటు అయ్యాక, రిసుల్ట్ రాని ముందు. లేటు గా వెళ్ళా, ఎవడో బాల్కని అని నేల అంతకట్టాడు)
పద్మ ప్రియ లో Untouchables మూవీ ( Kevin Costner, 1993 లో ). ఇంకా చూస్తూనే ఉంటా.
జనాలు నవ్వుతారు గాని, ఆ సినిమా స్ట్రీటు లాస్ వేగాస్ స్ట్రిప్ లా వుండేది
మీవంతు జ్ఞాపకాలు బాగున్నాయి :) ధన్యవాదాలు రవి గారు.
Deleteసూర్య కళామందిర్ అద్భుతం
ReplyDeleteకాకినాడలో సరస్వతి గాన సభ స్వర్ణోత్సవాల సంధర్భంగా దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారు ప్రసంగించారు. ఆలింక్ ఇక్కడ చూడండి రవిగారు.
DeleteSatya Gowri Mahal Non AC theatre Special "English movies" Interval break with Semiya upma
ReplyDeleteధన్యవాదాలు :)
Deleteమధుర స్మృతులుని గుర్తుకు చేశారు వర్మగారి..సాగరసంగమం మా చిన్నతనం 8 రిక్షలో ఇరుగు పొరుగు వారితో వెళ్ళాం..పాత రోజులు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.. ఓల్డ్ is గోల్డ్
Delete:) 👍
Deleteనిన్న నాకొక వాట్సప్ ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది వర్మ గారూ. ఇంతకు ముందు చదివినట్లుందే అనిపించింది నాకు. తరువాత గుర్తొచ్చి చూస్తే .... ఆ మెసేజ్ మీ ఈ బ్లాగ్ టపాకి మక్కికి మక్కీ. కింద నుండి రెండవ పేరాలో “ఈ బ్లాగ్ చదువుతున్న వాళ్ళల్లో ........ “ అన్న మీ మాటల్ని “ఈ విషయం చదువుతున్నవాళ్ళల్లో ......” అని మార్చారు. అంటే మీ వ్యాసాన్ని అంత క్షుణ్ణంగా చదివారన్నమాట. మూలం మీ బ్లాగ్ అని మీ పేరూ కనబడలేదు.
ReplyDeleteవాట్సప్ పరిధి విస్తృతం కాబట్టి మీ వ్యాసం లోని విషయం / వివరాలు మరింత మందికి జేరాయని తృప్తి పడాలేమో 🤔?
ఆ ఫార్‌వార్డ్ మెసేజ్ నాకు కూడా వచ్చింది నరసింహా రావు గారూ. వాట్స్ఆప్ వచ్చిన తరువాత ఎవరు కాపీ చేసి గ్రంధ (బ్లాగ్ టపా) చౌర్యం చేస్తున్నారో కనిపెట్టడం కష్టం ఐపోతుంది. మీ దృష్టికి వచ్చిన విషయాన్ని 'నాకెందుకులే!' అని విడిచిపెట్టెయ్య కుండా, బాధ్యతగా తెలియజేసినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్!
Delete🙏
Deleteనాకిది ఈ రోజు వాట్సాప్ లో వచ్చింది. మీరు రైట్ క్లిక్ ని డిసేబుల్ చెయ్యవచ్చు ఎవరూ కాపీ చేయడానికి వీలు కాకుండా.
ReplyDeleteచేశానండి. అయినా లాగేశారు. తిరిగి తిరిగి నాకే వచ్చింది వాట్సప్‌లో.
Deleteమీ సూచనకు ధన్యవాదాలు మాధవ్ గారూ.
టపాను text రూపంలో కాకుండా image రూపంలో ఉంచితే - పైగా దాన్ని కాపీచేయకుండా వీలుంటే నిరోధించి మరీ post చేస్తే ఎలా ఉంటుంది. ఆ image లోనే మీ ముద్రకూడా వేస్తే సరి అది circulate ఐనా సరే మీ image క్రిందే వస్తుంది. ఎలా ఉందంటారు ఉపాయం?
Delete
Deleteఇంత కష్టేపడేదానికన్న టపా రాసేక మీరే దాన్ని వాట్సాపు లోకి మీకు తెలిసిన వాళ్లకందరికి నెట్టేయండి :) ఆ వాట్సాపు మెసేజి మీకు మళ్ళీ భూగోళమంతా తిరిగొస్తే దాన్ని రిసీవ్ చేసుకుని సంతోష పడి పోవచ్చు :)
జిలేబి
శ్యామలీయం గారి సలహా సాంకేతికంగా బాగుంది. అలా చెయ్యవచ్చు.
ReplyDelete“జిలేబి” గారి సలహా సూపర్ (సీరియస్ లీ). Pre-emptive step గా పనిజేస్తుంది. అందువలన దాన్ని గురించి నిశితంగా ఆలోచించండి, వర్మ గారూ.
వర్మాజీ!
ReplyDeleteనెట్ లో ఒక సారి వెళ్ళిపోయినదిక మనది కాదు,స్వానుభవం. ఏవో ప్రయత్నాలేం ఉపయోగంలేదు, దొంగిలించుకుపోతుంటే చూస్తూ ఊరుకోవడం తప్పించి చేయగలది లేదని నా...
చి.భా.శ