రైల్వే ట్రేక్‌కి కనుచూపుమేరలో... |
కాకినాడకి దగ్గరలో రేపూరు అనే ఊరిలో 116 అడుగుల ఎత్తైన సాయిబాబా విగ్రహం, నాలుగంతస్తుల భవనం మీద కూర్చొని ఉన్న భంగిమలో నిర్మించారు. ప్రపంచంలోనే ఎత్తైన సాయిబాబా విగ్రహం ఇదే అని చెపుతున్నారు. విగ్రహం వెయ్యిటన్నులకంటే ఎక్కువ బరువు ఉంటుంది. నిర్మాణానికి సుమారు పుష్కరకాలం పట్టిందట, మూడుకోట్లవరకూ ఖర్చు అయ్యిందట.
కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్‌లో, కొవ్వాడ స్టేషన్‌కి సమీపంలో రేపూరు సాయిబాబా ఇలా దర్శనమిస్తాడు. తాడిచెట్ల తలల కంటే పైన సాయిబాబా కూర్చున్న పీఠం కనిపిస్తుంది. ఆ అందమైన దృశ్యం మీకోసం.
© Dantuluri Kishore Varma
మంచి సేకరణ, టపా, అభినందన ... ధన్యవాదము.
ReplyDeleteధన్యవాదాలు ప్రసాదరావుగారు.
Delete