ఇంటిచుట్టూ చిక్కటి తోట
ఇంటిముందు కొత్తగా వేసిన సిమ్మెంటు రోడ్డు
ఇంటివెనుక పంటకాలువ
నీళల్లో ముఖాలు చూసుకొని మురిసిపోతున్న కొబ్బరిచెట్లు
కాలువ అవతల అల్లంత దూరంలో అగ్రహారం
ఉషోదయపు వేళ పలుచటి నీరెండలో
గెంతులేసి, ఎగిరెగిరి దూకి, అల్లరి చేసిన
ఆరురోజుల వయసు ఆవుదూడ
అలసిపోయిందేమో... కొంతసేపు సేదతీరుతూ
తల్లి ఉన్నవైపు సాలోచనగా చూస్తోంది.
`గోవు మహాలక్ష్మి. అది ఉన్న ఇంట సిరుల పంటే!` అంటారు చాగంటి వారు.
తినడానికి అప్పుడే కోసుకొచ్చిన లేత పచ్చగడ్డి
సాయంత్రం బొగ్గుల దాలిలో ఉడకబెట్టిన ఉలవలు
ప్రేమగా వెన్ను నిమిరే యజమాని చెయ్యి
తాగడానికి బావిలోనుంచి చేది పోసిన చల్లని మంచి నీళ్ళు
సేదతీరే చెట్టునీడా... ఉంటే, గోలక్ష్మి ఇదిగో... ఇలా ఉంటుంది.
పల్లెటూరి ప్రశాంతతకి అందాన్ని అద్దేది
చుట్టు గుడిశా, గడ్డిమోపా?
ఇటుక ముక్కలు పేర్చి కట్టిన గోడలో..
దానికి వారగా పెరిగిన పిచ్చి గడ్డిలో..
జామ చెట్ల పింది పూతల్లో...
అందం నేనున్నానని హొయలు పోతుంది కదూ?
ఎక్కడెక్కడ తిరిగినా ఇంట్లోకి వచ్చేముందు
బావి దగ్గర ఆగి తాడుకట్టిన చేదని బావిలోకి వేగంగా వదిలి
రెండు బారలతో నీటిని చేదుకొని
ముఖం, కాళ్ళూ చేతులూ శుబ్రం చేసుకొనిగానీ
రైతు ఇంటిలోకి అడుగు పెట్టడు.
ఇక్కడ ఇనుప బకెట్ కనిపిస్తుంది కానీ,
తాటి ఆకుతో పెద్ద దొన్నెలా తయారు చేసుకొని ఉపయోగించే చేదని చూసిన జ్ఞాపకం మీకుందా?
వేసవి ప్రతాపం చూపిస్తుంది.
ముంజుకాయలు తింటూనో,
కొబ్బరిబొండంలో తియ్యటినీళ్ళో తాగుతూనో
తెరలు తెరలుగా వచ్చే పైరగాలిని అస్వాదిస్తూ
ఒక్కరోజు అలా...లా... గడిపేస్తే బాగుంటుంది కదూ?
© Dantuluri Kishore Varma
ఇంటిముందు ఆగున్న ఆ తెల్లకారు చూస్తుంటే ఇది మీ స్వంతూరు, ఆ ఊర్లో మీ ఇల్లు అనిపిస్తోంది. కరక్టేనా రాజు గారూ? (మీ ఈ బ్లాగ్ పేజ్ లో కింద మీ తెల్లకారు ఫొటో పెట్టారు కదా. దాన్ని చూసి తట్టినది :-) )
ReplyDeleteఫోటోలు చాలా బాగున్నాయండి. గోదావరి జిల్లా పల్లెల అందాల గురించి ఎంత చెప్పినా తనివితీరదు కదండి.
మీ ఊహ కొంతవరకూ కరక్టే నరశింహరావు గారు. ఈ ఇల్లు మా ఇన్‌లాస్‌ది. ఫోటోలు మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
Deleteఫోటోలు అన్నీ బాగున్నాయి వర్మ గారు.అభినందనలు !
ReplyDeleteధన్యవాదాలు మూర్తిగారు :) .
Deleteఅదిరందండి పోష్టు. ఫోటోలు కూడా బాగున్నాయి. పల్లెటూరిలో ఒకరోజులో ఇంకా చాలా అందాలు-ఆత్మీయతలని ఫోటోలలో బంధించవచ్చు. పల్లె ప్రపంచం జిందాబాద్ :)
ReplyDeleteధన్యవాదాలు కొండలరావు గారు. పల్లెల్లో కంటికి కనిపించినంత మేరా పచ్చదనమే, అడుగడుగునా ఆత్మీయతల పరిమళమే. ఫోటోల్లో బంధించగలగేవి కొన్నే, హృదయంలో దాచుకొవలసినవి మాత్రం ఎన్నో!
Deleteతాటాకు ”చేద” ఇప్పుడెవరి తెలుసు వర్మాజీ? మంచి టపా
ReplyDeleteనిజమే శర్మగారూ. వెతుకి, ఫోటో చూపిద్దామంటే గూగుల్ ఇమేజస్‌లో కూడా కనిపించలేదు. మీకు టపా నచ్చిందని చెప్పినందుకు ఆనందంగా ఉంది.
Deleteతాటాకు చేద బొమ్మ ఇక్కడ ఉంది చూడండి.
Deletehttp://radhemadhavi.blogspot.in/2012/05/blog-post_07.html
మీరు ఇచ్చిన లింక్‌లో తాటి చెట్టు వ్యాసం చాలా బాగుంది బోనగిరి గారూ. బొమ్మలు కూడా.. ధన్యవాదాలు.
Deleteఇల్లు బాగుందండి.
ReplyDeleteదేనికైనా,..... ఉండాలండి.
ధన్యవాదాలు బోనగిరిగారు.
Delete:) :)
ఇల్లు చాలా బాగుంది.
ReplyDeleteయెక్కద బడితే అక్కడ ఓ కర్చీఫ్ వేసుకుని కూర్చున్నా హ్యాపీ!
హ.. హా.. అలా అంటారా? అయితే ఓకే!
Deleteమీ కామెంట్‌కి ధన్యవాదాలు హరిబాబు గారు.
If you don't mind, can I ask which village is it? This is for my retirement plan. I want to retire and live in village. So, fishing for a beautiful village and this exactly fits the dream :-)
ReplyDeleteYour retirement plan is very interesting Sameera garu.
DeleteIt is a typical Konaseema village near Yanam.
వర్మ గారూ, అది కోనసీమ పల్లె అని తెలుస్తూనే ఉందిలెండి :)
Deleteపాపం ఆవిడ అడిగినందుకైనా ఊరిపేరేమిటో చెప్పచ్చుగా ?
సమీరగారు, నరసింహా రావుగారు ఆ పల్లె పేరు `పిల్లంక` అండి.
Deleteఊరిపేరు చెప్పినందుకు థాంక్స్ వర్మ గారూ. కాకపోతే "typical Konaseema village" అని మీరు చెప్తున్నా మిమ్మల్ని మరీ మొహమాటపెట్టేసి ఊరిపేరు రాబట్టానా అని చిన్న అనుమానం. అందమైన ఊరిపేరేమిటో తెలుసుకుందామనే కుతూహలం అంతే. ఏమనుకోకండి. మరోసారి థాంక్స్ అండీ.
Delete:) :)
DeleteThank you both :-). I did want to hear the village name.
Delete