కాకినాడనుంచి పిఠాపురం వెళ్ళేదారిలో తిమ్మాపురం దాటిన తరువాత కుడిచేతివైపు రోడ్డుప్రక్కగా పే..ద్ద చెరువు ఉంటుంది. దానిని పండూరు చెరువు అంటారు. ఆ వెంటనే పండూరు ఊరిలోకి దారి. అలా లోపలికి వెళ్ళిపోతే ఊరి మొదటిలో రోడ్డుకి రెండువైపులా మావిడితాండ్ర తయారీ కేంద్రాలు కనిపిస్తాయి. విశాలమైన మైదానం లాంటి చోటుల్లో నేలకి రెండు మూడు అడుగుల ఎత్తులో సిమ్మెంటు స్థంబాల మీద మంచెల్లా కట్టి ఉంటాయి. వాటిమీద మావిడితాండ్ర చాపలు పరచి ఉంటాయి. తీపి మావిడి పండ్ల వాసన ఆ ప్రాంతం అంతా వ్యాపించి ఉంటుంది. ఎండ నిప్పులు చెరుగుతూ ఉంటుంది. మావిడి తాండ్ర చాపల పైన పనివాళ్ళు మావిడి గుజ్జుని పొరలుగా పూస్తూ ఉంటారు.
మావిడి తాండ్రని తయారీ విధానం ఏమిటో తెలుసుకోవాలని ఉందా?
ఇక్కడ తాండ్ర తయారీకి కలెక్టర్ రకం మావిడి కాయలను ఉపయోగిస్తున్నారు. పళ్ళని శుబ్రంగా కడిగి, గుజ్జు తీసే యంత్రంలో వేస్తారు. టెంకా, తొక్కా బయటకు పడిపోయి, గుజ్జు ఒక పెద్ద పాత్రలోనికి వచ్చేస్తుంది. ఈ మావిడి గుజ్జుకి చక్కెరా, బెల్లం తగినంత మోతాదులో కలుపుతారు. తీపి సరిపోయిందని నిర్ణయించుకొన్నాకా, మావిడి పళ్ళ గుజ్జుని తాటి చాపలమీద పరచి మంచెల మీద ఎండబెడతారు. ఒకరోజు పూర్తిగా ఎండలో ఉండేసరికి మావిడి గుజ్జు ఉల్లిపొర మందమైన పొరలా తయారవుతుంది. వరుసగా నెలరోజులపాటు పొరమీద పొర వేసుకొంటూ వెళతారు.
తాండ్ర తయారీకి కణకణ మండే ఎండల కాలమే అనుకూలమైనది. నెలరోజులపాటు తాండ్రని పొరలు పొరలుగా పోసి ఎండబెట్టిన తరువాత, చాపల మీదనుంచి వేరుచేసి కేజీ, అరకేజీ ముక్కలుగా కోసి, ప్యాక్ ఛేసి సుమారు కేజీ తొంభై రూపాయల రిటెయిల్ ధర(హోల్‌సేల్‌గా అయితే ఇంకా తక్కువ ఉంటుంది) చొప్పున వర్తకులకి అమ్మేస్తారు. కొంత తాండ్ర వేరే దూర ప్రాంతాలకి ఎగుమతి ఐతే, మరికొంత లోకల్ మార్కెట్‌లో అమ్ముడుపోతుంది.
మావిడి తాండ్ర గురించి చిన్న మాటా, మంతీ ఇక్కడ చూడండి.
మూడు నెలల విరామం తరువాత మళ్ళీ ఈ రోజే బ్లాగ్ ముఖం చూస్తున్నాను. ఇలా మావిడి రసాల తీపి కబుర్లు మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.
© Dantuluri Kishore Varma
మామిడి తాండ్రాయణం బాగున్నది. నోరూరించింది.
ReplyDeleteThank you Sir :)
DeleteAfter a long Gap, i am able to see UR Post., ThnQ Andee.
ReplyDelete:) :)
Deletevery good article sir
ReplyDeleteThank you :)
DeleteInteresting...
ReplyDeleteThank you... :)
Deletenamaskaram
ReplyDeletememm ippudu kakinada lo unnam. ikkadiki velte ippudu untaya Sir ivi?
pls let me know. I am here for 2 more days with my Son. I am your blog's follower, sridevi.
Thank you!
sreedhawala@gmail.com