రోజూ...
ఈదవలసిన సముద్రాలు
ఎక్కవలసిన కొండలు
గెలవవలసిన యుద్దాలు
నెరవేర్చవలసిన ప్రమాణాలు...
ఎన్నెన్ని ఉంటాయి!
కాలంతో పరుగులుపెట్టి పోతున్నప్పుడు
వ్యామోహాలలో పడిపోయి ఊపిరిసలపనప్పుడు
`అడ్డదారిలోపడి వెనక్కి నడిచేవాళ్ళని అదిలించి ముందుకు నడిపేవాడిని నేను,` అని అన్నమాచార్యుడికి వేంకటేశ్వరుడు చెప్పినట్టు మనకి ఎవరుంటారు చెప్పండి?
కానీ, ఏదో ఓ శనివారం సాయంత్రం...
దారితప్పో, తెలిసో దేవాలయం మెట్లెక్కితే...
భజనమండపంలోనుంచి వినిపించే కీర్తనలలో లయ
ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గాలిలో తేలివచ్చే వెలిగించిన కర్పూరపు వాసన
అలంకరించిన స్వామి చిరునవ్వులో సౌందర్యం
పూజారి ఇచ్చిన కొబ్బరిచిప్పని గుడిచప్టామీద పగలగొడుతున్నప్పుడు మనసులో పరచుకొని ఉండే శాంతి...
ముందుకుపోయే దారి ఇదే అని చెపుతాయి.
వచ్చిన చిక్కల్లా ఏమిటంటే?
బయటకి వస్తూ గుడిమెట్లముందు వదిలిపెట్టిన చెప్పులతోపాటూ ప్రపంచాన్ని కూడా తొడుక్కొని అలవాటైన దారిలో అడుగుపెడతాం.
ప్రొద్దున్న లేస్తే మళ్ళీ మనం మనమే!
(మొదటి మూడు ఫోటోలూ జగన్నధపురం వేంకటేశ్వరస్వామి గుడి దగ్గర తీసినవి. నాలుగవ పోటో గూగుల్ నుంచి తీసుకొన్నది).
© Dantuluri Kishore Varma
బహుకాల దర్శనం వర్మ గారూ, వెల్కం బాక్. మీ బ్లాగ్ టపాలు చదవడం ఎప్పుడూ ఆనందదాయకమే.
ReplyDeleteనాలుగో ఫొటోలో కనిపిస్తున్నట్లు అడ్డగోలుగా పెరిగిపోయిన వాహనాలతో కిక్కిరిసిపోయిన ప్రతి రోడ్డూ, మనమూనూ - "ప్రొద్దున్న లేస్తే మళ్ళీ మనం మనమే!" అవునండి బాగా చెప్పారు.
ధన్యవాదాలు సర్!
Delete
ReplyDeleteకొబ్బరి చిప్ప పగులుళ్ళో
మనసులోని శాంతి!
అద్భుతః !
జిలేబు
:)
Deleteకొబ్బరికాయ కొట్టడం అంటే అహాన్ని బ్రద్దలుకొట్టడం అంటారు కదండీ - అహం పోయినచోట శాంతి ఉండే అవకాశం ఉందికదా, అందుకే అలా వ్రాసానన్న మాట!
Deleteకొబ్బరి చిప్ప పగుళ్ళ
న్నబ్బుర ముగ శాంతి గాంచి నాను మదిలో
తబ్బిబ్బులున్నహంబుల్
తప్పగ హృదిగాంచెను నిరతంబగు కాంతిన్ !
జిలేబి