Pages

Saturday, 3 March 2018

బంగారుశిఖరాల బహుబ్రహ్మమయము...

భావములోనా - బాహ్యమునందును
గోవింద గోవిందయని - కొలవవో మనసా...
హరి యవతారములే - అఖిలదేవతలు
హరిలోనివే బ్రహ్మాండంబులు...
హరి నామములే - అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా...
విష్ణువు మహిమలే - విహిత కర్మములు
విష్ణుని పొగడెడి - వేదంబులు...
విష్ణుడొక్కడే - విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని - వెదకవో మనసా...
అచ్యుతుడితడే - ఆదియునంతయము
అచ్యుతుడే - యసురాంతకుడు... 
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదే 
అచ్యుత యచ్యుత శరణనవో మనసా...
అదివో అల్లదివో హరివాసము
పదివేలుశేషుల పదగలమయము...
అదె వేంకటాచల మఖిలవున్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము...
అదివో నిత్యనివాస మఖిలమునులకు
న దె చూడు డ దె మొక్కు డానందమయము...
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము...
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారుశిఖరాల బహుబ్రహ్మమయము...
కైవల్యపదము వేంకటనగ మదివో
శ్రీవేంకటపతికి సిరులైనది...
భావింప సకల సంపదరూప మదివో
పావనములకెల్ల పావనమయము.
(Photos taken in Tirupati and Tirumala. Text: Annamayya Keerthanas) 

                                    © Dantuluri Kishore Varma

3 comments:

  1. ఫొటోలలోని దృశ్యాలు చాలా అందంగా ఉన్నాయి వర్మ గారూ 👌. ఫొటోగ్రఫీ మీ హాబీ అనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. హాబీ అంటూ ఏమీ కాదు సర్. కానీ, వీలు దొరికినప్పుడు ఏదో అలా చెయ్యిచేసుకోవడం...

      Delete
    2. // “చెయ్యిచేసుకోవడం” //
      🙂🙂

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!