ఈ భూమండలం మీద భక్తులకి మోక్షాన్ని ప్రసాదించే ఏడు ప్రాంతాలు ఉన్నాయి. వాటిని సప్తపురాలు అంటారు. అవి అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, ఉజ్జయిని, ద్వారకలు.
ఈ సప్తపురాల్లో ఒకటైన కాశీకి వెళ్ళాను. అక్కడ మూడు రోజులు ఉన్నాను. వాసవీ గంగా గోదావరి సేవా సంస్థలో స్టే చేశాను.
గంగా స్నానం చేసి, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాధ మందిరం, అన్నపూర్ణా మాత, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన విశాలాక్షి అమ్మవార్ని.. దర్శించుకొన్నాను.
ముఖ్యమైన దేవాలయాలు..
సంకట్ మోచన్ హనుమాన్
మృత్యుంజయ్ మహాదేవ్
కాలభైరవ
తులసీ మానస్ మందిర్
న్యూ విశ్వనాధ మందిర్
కౌడి మాత
గౌరీ కేదారేశ్వర్
వ్యాస కాశీ...లను దర్శనం చేసుకొన్నాను.
దశాశ్వమేధ్ ఘాట్ దగ్గర గంగా హారతి చూశాను.
గంగానదిలో బోటు మీద వెళ్ళి ముఖ్యమైన ఘాట్లను చూశాను. కొత్తగా కట్టిన విశ్వనాధ కారిడార్లో విద్యుత్ దీపాల వెలుగుల మధ్య కొంత సమయం గడిపాను. అక్కడి నుంచే మణికర్నికా ఘాట్‌లో జరుగుతున్న శవ దహనాలను కూడా చూశాను.
కాశీ ఇరుకు గల్లీల్లో ఉదయం, మద్యాహ్నం, రాత్రి తిరిగాను. లోకల్ షాపింగ్ - బెనారసి సిల్క్ - చేసాను.
నేను చూసినవి వీలైనంతమటుకు వీడియోలుగా చేశాను. నా యూట్యూబ్ చానల్లో కాశీ దర్శన్ (Click this link to watch those videos) పేరుతో ప్లే లిస్ట్‌లో పెట్టాను. ఆ వీడియోలు కాశీ వెళ్ళాలని అనుకొనేవారికి మార్గదర్శకంగా ఉంటాయని అనుకొంటున్నాను.
హరహర మహాదేవ శంభో శంకర!