పూలమొక్కలు; లాండ్ స్కేప్ డిజైనింగ్ కోసం ఉద్యానవనాలలో ఉపయోగించే ఆర్నమెంటల్స్ అనబడే మొక్కలు; పార్కుల్లో, బంగళాల్లో, ఫాక్టరీలలో, స్టార్ హోటళ్ళలో రహదారికి ఇరువైపులా ఒకే సరళరేఖలో పెంచే ఎవెన్యూ ప్లాంట్స్; ఆకారంలో కొబ్బరి మొక్కలను పోలి ఉండే పాం(palm) జాతి మొక్కలు; మన డ్రాయింగ్ రూములలో పెంచుకొనే ఇండోర్ ప్లాంట్స్; అలంకరణ మొక్కలు; ఎప్పుడూ పచ్చదనంతో ఉండి వేగంగా పెరిగే ఫికస్ జాతి మొక్కలు; పండ్లమొక్కలు; బోనసాయి వృక్షాలు; విదేశాలలో మాత్రమే కనిపించే అరుదైన పూల రకాలని దేశీయ వాతావరణ పరిస్థితులలో కూడా పెరిగేలా సంకర పరచిన మొక్కలు...అన్నీ దొరికేవి మన తూర్పుగోదావరిజిల్లా కడియపులంక మరియూ పరిసర ప్రాంతాలలో మాత్రమే!
కాకినాడనుంచి 45 కిలోమీటర్లదూరంలో కడియపులంక ఉంది. పేరుకి కడియం నర్సరీలు అని వ్యవహరిస్తున్నా, కేవలం కడియంలోనే కాకుండా ఆ పరిసరాలలో ఉన్న వెంకయ్యమ్మపేట, పొట్టిలంక, కడియపుసావారం, వీరవరం, దామిరెడ్డిపల్లి, వేమగిరి మొదలైన ఊళ్ళల్లో వేలకొలదీ ఎకరాలలో వందలకోద్దీ నర్సరీలు ఉన్నాయి. సారవంతమైన భూమి, గోదావరికి దగ్గరగా ఉండడంవల్ల పుష్కలమైన నీటిపారుదల వ్యవస్థ కడియం పరిసర ప్రాంతాలని పూలసజ్జగా మార్చింది. ఇటువంటి భౌగోళిక పరిస్థితులు చాలా చోట్ల ఉన్నా, ఇక్కడి నర్సరీ నిర్వాహకులు ఈ ప్రాంతానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ని తీసుకు రాగలిగారు. ఇది కేవలం రైతులకో లేక కేవలం వ్యాపారవేత్తలకో సాధ్యం కాదు. వీళ్ళు వ్యాపారరైతులు, రైతువ్యాపారస్తులు.
తక్కువఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి సాధించడం, కొత్త వెరైటీలని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకొని అభివృద్ది పరచడం, పనివాళ్ళ సంక్షేమం, వినియోగదారుల సంతృప్తి, మార్కెటింగ్ మొదలైన అంశాలు ప్రధానమైనవని పల్లా వెంకన్న నర్సరీ యజమానులలో ఒకరైన శ్రీ సత్యన్నారయణ మూర్తి నాతో అన్నారు. నేను నర్సరీని సందర్శిస్తున్న సమయంలో చెన్నై నుంచి వచ్చిన ఒక కస్టమర్ పెద్ద ఎత్తున మొక్కలని కొంటున్నారు. నాణ్యమైన మొక్కల ఉత్పత్తిలో దేశంలోనే ఈ నర్సరీలకి మంచి పేరు ఉందట. ఈ మధ్య ఒమన్, జోర్డాన్, మస్కట్ దేశాలకికూడా పూల, పండ్ల మొక్కలని ఎగుమతిచేశారు.

చాలా రేర్ స్పీషిస్ అన్నీ దొరుకుతాయండీ, అక్కడ పని చేసే వాళ్ళు ఏమీ చదువుకోకపోయినా, లాటిన్ పేర్లతో, కుటుంబాలతో సహా మొక్కల వివరాలు చెప్పటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ReplyDeleteఈ విషయం గురించి నేను పోస్టులో వ్రాయవలసింది. అయినా, బాధపడవలసిన అవసరం లేకుండా మీ కామెంట్, నా పోస్టుకి కాంప్లిమెంటరీ(complementary) అయ్యింది. థాంక్యూ రసజ్ఞగారు.
ReplyDeleteమంచి విషయాలు తెలియజేస్తున్నారు. అభినందనలు. ముఖ్యంగా చంద్రశేఖర్ గారి గురించి చదివినపుడు చాలా ఇన్ స్పైరింగ్ గా అనిపించింది.
ReplyDeleteధన్యవాదాలు తేజస్విగారు.
ReplyDeleteకడియం నర్సరీల నుండి మా ఊరికి కూడా మొక్కలూ తెచ్చి అమ్ముతుంటారు.బాగుంది మీ పొస్ట్
ReplyDeleteనాబ్లాగుకి స్వాగతం రాధికగారు. మీకు ఈ పోస్టు నచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDelete>>>>కడియం పరిసర ప్రాంతాలని పూలసజ్జగా మార్చింది.
ReplyDeleteఈ పోలిక నచ్చింది. :)
ఉద్యానవనాలు ఉన్న ప్రాంతాలని పూలసజ్జ అని వ్యవహరించడం వాడుకలో ఉన్నదేనండి, నా స్వంతంకాదు. సందర్బానుసారంగా ఆ పోలిక ఈ టపాలోకి జొరబడిపోయిందని అనుకొంటున్నాను.
ReplyDelete