Pages

Monday 3 September 2012

సేవే మార్గం - సంకురాత్రి చంద్రశేఖర్

ఒకసారి ఒక మహిళ దు:ఖిస్తూ గౌతమ బుధ్ధుడి దగ్గరకి వచ్చి, మరణించిన తన కొడుకుని బ్రతికించమని వేడుకొందట.అప్పుడు బుద్దుడు ఆమెని ఆవూరిలో మరణం సంభవించని ఏదైనా ఇంటినుంచి ఒక గుప్పెడు నువ్వులు తీసుకొనివస్తే ఆ కుర్రవాడిని బ్రతికిస్తానని వాగ్దానం చేస్తాడు. ఆమె రోజంతా ఇంటింటికీ తిరిగి సాయంత్రానికి ఒట్టి చేతులతో తిరిగివస్తుంది. మరణంలేని ఇల్లులేదు. పునరపి జననం, పునరపి మరణం అంటారు- పుట్టినవారు గిట్టక తప్పదు; ఆప్తులకి విషాదమూ తప్పదు.  

కానీ, జ్ఞాపకాల స్పూర్తినుంచి సామ్రాజ్యాలు నిర్మించగలగడం కేవలం డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ లాంటి అరుదైన స్థిత ప్రజ్ఞులకిమాత్రమే సాధ్యం అవుతుంది. 



ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎస్.సి. జుయాలజీ పూర్తిచేసి, కెనడాలో పి.హెచ్.డి.చేసి, అక్కడే శాస్త్రవేత్తగా పనిచేస్తున్న చంద్రశేఖర్ గారు కాకినాడ అమ్మాయి  మంజరిని వివాహం చేసుకొన్నారు. వారికి ఇద్దరు సంతానం - శ్రీకిరణ్, శారద. జీవితం కమ్మగా సాగే పాటే కానీ...


1985లో కెనడా నుంచి ఇండియా వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కనిష్క ఖలిస్తాన్ తీవ్రవాదుల విద్రోహచర్య కారణంగా అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయింది. దానిలో ప్రయాణిస్తున్న 329 మంది ప్రయాణికుల్లో దురదృష్టవశాత్తూ శ్రీమతి మంజరీ, శ్రీకిరణ్ మరియూ శారదా కూడాఉన్నారు. అఖాతంలాంటి విషాదం. విధి కుట్రచేసి తనని ఈ ప్రపంచంలో ఒంటరిని చేసిందేమో! 
'పేదరికంలేని, ఆరోగ్యవంతమైన విద్యావంతుల సమాజం ఉంటే ఎంతబాగుంటుంది!' అనే శ్రీమతి మంజరి కల నిజంచేయడానికి మంజరి సంకురాత్రి మెమోరియల్ ఫౌండేషన్ స్థాపించి ఒక నిస్వార్ధ సేవా సామ్రాజ్యాన్ని కాకినాడకి దగ్గరలో అచ్చంపేటలో నిర్వహిస్తున్నారు డాక్టర్ చంద్రశేఖర్. కుమారుడు శ్రీకిరణ్ జనావళి కంటి కిరణంకావాలి; కుమార్తె శారద చిట్టి చెళ్ళెళ్ళ, చిన్ని తమ్ముళ్ళ నాలుకల మీద బీజాక్షరం కావాలి. అందుకే - అత్యాధునికమైన శ్రీకిరణ్ కంటి ఆసుపత్రీ, నిబద్దత అడుగడుగునా కనిపించే చదువులమ్మ బడి శారదావిద్యాలయమూ.  
శ్రీ కిరణ్ కంటి హాస్పిటల్ ద్వారా 1,53,000 కంటి ఆపరేషన్లు చేశారు. వీటిలో సుమారు తొంబై శాతం ఉచితం. గ్రామీణప్రాంతాలలో, పట్టణాలలో తమవద్దకు రాలేని అభాగ్యులకు `ఔట్ రీచ్` కార్యక్రమం ద్వారా కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరం అయినవారిని గుర్తించి, ఫౌండేషన్ బస్సులలో హాస్పిటల్కి తరలించి, ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నరు. మందులు, కళ్ళజోళ్ళు కూడా ఉచితం. అత్యుత్తమమైన డాక్టర్లు, ఆధునికమైన పరికరాలు, పరిశుబ్రమైన చక్కటి గదులు, సేవాభావం అణువణువునా నింపుకొన్న సిబ్బంది.
 తూర్పుగోదావరిలో ఇప్పటివరకు నిర్వహించిన ఐ క్యాంపులు
ఇక శారదా విద్యాలయం విషయానికి వస్తే; దీనిని 1992లో ప్రారంభించారు. చదువు`కొన`లేని నిరుపేదలకి ఉచితవిద్య అందించడమే లక్ష్యం. యూనీఫాం, బుక్స్, ట్రాన్సుపోర్ట్ సౌకర్యాలు కలుగజేసి ఆశ్రమంలాంటి పరిసరాలలో విద్యాబుద్దులు నేర్పిస్తున్నారు.
సాయంత్రం నాలుగు గంటలసమయంలో కూడా పరిశుబ్రమైన స్కూల్ డ్రేస్సులో మెడిటేషన్ చేస్తూనో, డ్రిల్ చేస్తూనో, క్రాఫ్ట్ క్లాసులో చక్కనిబొమ్మ తయారుచేస్తూనో, ముత్యాల్లాంటి చేతివ్రాతతో నోట్ బుక్కులో ఏదో వ్రాస్తూనో విద్యార్దులు చక్కటి క్రమశిక్షణకి మారుపేరుగా కనిపిస్తారు.క్లాసురూంకి పది నుంచి పదిహేనుకి మించని విద్యార్ధులు. లైబ్రరీ, సైన్సు లేబ్, కంప్యూటర్ లేబ్, క్రాఫ్ట్ రూం, ఫైన్ ఆర్ట్ రూం, ప్లే గ్రౌండ్. ఇక్కడి చదువు ఒక యోగం.శారదా విద్యాలయంలో పదవతరగతి పూర్తిచేసుకొన్న తరువాత విద్యార్ధులు ఒకేషనల్ ట్రయినింగ్ కూడా పొందవచ్చు.
"సార్ (డాక్టర్ చంద్ర) ప్రతిరోజూ ఒకక్లాస్ చెబుతారు. హేండ్ రైటింగ్ నేర్పించేటప్పుడు తనే స్వయంగా విద్యార్ధుల పుస్తకాలలో గీతలు గీస్తారు. మేము చేస్తామన్నా ఆయన ఒప్పుకోరు," అని ఒక టీచర ఆయన గురించి చెబుతున్నప్పుడు లీడర్ అంటే ఏమిటో మనకి అర్ధం అవుతుంది.  

ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆపన్నులను ఆదుకోవడానికి స్పందన అనే సేవాకార్యక్రమం కూడా సంకురాత్రీ ఫౌండేషన్ నిర్వహిస్తుంది.విశ్వవ్యాప్తమైన ప్రేమ, నిస్వార్దమైన సేవలకు మారుపేరు డాక్టర్ చంద్రశేఖర్. రిలయన్స్ రియల్ హీరోస్ ఆఫ్ ఇండియా లాంటి అవార్డులెన్నో ఆయనని వెతుక్కోంటూ వచ్చాయి.
సంకురాత్రీ ఫౌండేషన్ ద్వారా అన్నో మంచి పనులు జరుగుతున్నాయి. వాలంటిరుగా మనమూ వాటిలో పాలుపంచుకోవచ్చు; డొనేషన్ల రుపంలో `నేనుసైతం` అని ఆపన్నులకు అభయహస్తం అందించవచ్చు. లేదా సేవే శాశ్వత సత్యం అని మార్గనిర్దేశం చేస్తున్న మహానీయులనుంచి స్పూర్తి పొందవచ్చు. 
 డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ గారితో నేను. 
 © Dantuluri Kishore Varma

17 comments:

  1. ఒక కఠినమైన విషాదం నుండి కోలుకొన్న ఒక మహా మనిషిని పరిచయం చెసినందుకు చాలా సంతోషం.
    రామకృష్ణ.

    ReplyDelete
  2. ఇది నిజంగా ఇన్స్పయరింగ్ స్టొరీ.మీకు నచ్చినందుకు థాంక్స్ రామకృష్ణగారు.

    ReplyDelete
  3. What ever comes in your way, you have to continue the Journey. But it's only possible for few persons like Chandraseskhar garu.
    Thanks for this wonderful post Kishore garu.

    ReplyDelete
  4. మీకు నచ్చినందుకు థాంక్సండీ. మీ పేరు ఏమిటో తెలిస్తే బాగుండేది.

    ReplyDelete
  5. చాలా వివరంగా పరిచయం చాశారండీ వీరి గురించి. మీకభ్యంతరం లేకపోతే నా టపాలో మీ ఈ టపా లింక్ కూడా ఇస్తాను. మీ బ్లాగు మొత్తం వీలు చూసుకుని చదువుతాను.

    ReplyDelete
  6. శిశిరగారు తప్పనిసరిగా మీ పోస్టులో లింక్ ఇవ్వండి. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా థాంక్స్.

    ReplyDelete
  7. An Inspiring story of a great man !!!! If everyone contributes atleast a single digit % of their income for development of their villages, our country will become super power.....The happiness or satisfaction you got in social responsible activities is unmeasurable..........

    ReplyDelete
  8. Hundred percent true. I could not agree with you more, Mr. Kiran.

    ReplyDelete
  9. Thanks for the inspiring introduction of a great human being Kishore Varma garu. I linked your story in my blog post on Dr. Chandra Sekhar garu. Please let me know if that's okay with you.

    ReplyDelete
    Replies
    1. Please carry on Jyothi garu. Thanks a lot indeed for liking this post about Chandrasekhar garu and letting others know about him through your blog also.

      Delete
  10. కొందరు మహానుభావుల జీవితం లో విషాదమే గొప్పకార్యాలకు పునాదివేస్తుందేమో ! అనిపిస్తుంది కొన్నిజీవితాలను పరిశీలిస్తుంటే. నిజంగా వారి స్థితప్రజ్జ్ఞ.సేవానిరతి అనుపమానం. వీలైతే వారికి నానమస్కారములు తెలియజేయండి

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజమే దుర్గేశ్వర గారూ, చంద్రశేఖర్‌గారు స్థితప్రజ్ఞులు. ప్రస్తుతానికి మీ నమస్కారాలని ఆయనకి బ్లాగ్‌ద్వారానే తెలియజెయ్యగలను. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  11. ప్రతి సంఘటనా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. కొందరే ఇలా స్పూర్తివంతంగా మహనీయులుగా మారగలుగుతారు. మంచి ఇన్స్పిరేషన్ కలిగించే ఆర్టికల్ కిశోర్ గారు. మీకు అభినందనలు. కదంబం బ్లాగు ద్వారా ఈ ఆర్టికల్ చదివే అవకాశం కలిగింది.

    ReplyDelete
  12. Inspiring,
    Thank you Varma garu for this post!

    ReplyDelete
    Replies
    1. Thanks a lot for having stopped by. It is indeed my pleasure to have been able to write about him.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!