అబద్దం చెపుతున్నప్పుడు
లంచం తీసుకొంటున్నప్పుడు
లంచం ఇస్తున్నప్పుడు
మోసం చేస్తున్నప్పుడు
నిబందనలని అతిక్రమిస్తున్నప్పుడు..
వింటామేమో అని ఒకటి రెండు సార్లు
`వద్దు, వద్దు` అని
మన వెర్రి మనశ్శాక్షి హెచ్చరిస్తుంది..
వినం!
కానీ, అవినీతిరహిత సమాజం కావాలని కోరుకొంటాం
మనలాంటి మనుషులందరూ కలిస్తేనే సమాజం
అనే సంగతి విస్మరిస్తాం!
`తప్పు` అని హెచ్చరించే మనశ్శాక్షి కూడా నోరు మూసుకొంటుంది.
* * *
`బి ద చేంజ్ యూ వాంట్ టు సీ,` అని చెప్పిన మహాత్మాగాంధీ
స్వయంగా చేసి చూపించారు.
`I have nothing new to teach this world.
Truth and non violence are as old as hills,`
అని గాంధీజీనే మరొక చోట చెప్పినట్టు
మనం చేసేవాటిలో కొన్ని చెయ్యకూడని తప్పులే అని
మనకు ఎప్పటినుంచో తెలుసు
కానీ, చేస్తున్నాం కదా?
చేసే ముందు ఒక్కక్షణం ఆలోచిస్తే!?
నిద్రపోతున్న మన మసశ్శాక్షిని తట్టిలేపడానికి
అలోచింపజేసే ఇన్స్పిరేషన్ కావాలి.
అలాంటి ఇన్స్పిరేషన్ కలుగుతుందేమో.
© Dantuluri Kishore Varma
సమాజం మారాలంటాం, మనం మాత్రం మారం.
ReplyDeleteఎవరైనా మారామన్నా నమ్మడానికి సందేహిస్తాం :)
Delete