బ్లాగ్‌లో వ్రాయడం బాగా తగ్గించేశాను. కనుక గూగుల్ సెర్చ్‌లో దొరికితే తప్పించి, నేరుగా బ్లాగ్‌కి వచ్చి చదివేసే పాఠకులు ఎవరూ ఉండరు. పేజ్‌వ్యూస్ రోజుకి మహా ఉంటే పదుల సంఖ్యలో ఉండాలి. కానీ గత కొన్ని రోజులుగా కొంచం అటూ ఇటూగా రోజుకి వెయ్యి ఉంటున్నాయి. సింగపూర్ నుంచి, యూఎస్ నుంచి, యూకేనుంచి వందలకొద్దీ వచ్చేసి చదువేటంత సెన్సేషన్ ఏముంది కనుక ఇక్కడ? ఐ థింక్ దేర్ మస్ట్ బి సంథింగ్ అన్‌కామన్ బీయింగ్ కుక్డ్ అప్ హియర్! ఎవరో సరిగా గుర్తులేదు కానీ ఓ బ్లాగర్ మిత్రుడు ఇటువంటి విషయాన్నే ప్రస్తావించారు. ఎవరైనా ఏమిజరుగుతూ ఉండవచ్చో చెప్పగలరా?
May be Google Search Algorithm is being updated and Google Bot is trying to crawl your blog pages.
ReplyDeleteఅంత టెక్నికల్ తెలియదు. కానీ గూగుల్ సెర్చ్ చేస్తే - చాలా మంది వాళ్ళ సైట్లలో గూగుల్ బాట్ క్రాల్ చెయ్యడం గురించి ఆత్రుతగా ప్రశ్నించడం కనిపించింది. ఈస్ దిస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద బ్లాగ్, బాబు గారు?
Delete
ReplyDeleteజిలేబీ మాయ అయ్యుండొచ్చు
వామ్మో ఈ బుచికి ఎవరు బాబో. అచ్చు నా ప్రొఫైల్ బొమ్మతో మరో ఐడీ సృష్టించారు. - original buchiki nene.
Deleteనేనే original బుచికిని.నువ్వెవరివో నకిలి
Deleteఈ బుచికి పంచాయతీ ఏమిటండి, మధ్యలో?
Deleteపైన మీరు అడిగినది నాకు తెలియదు (సాంకేతికంగా) కానీ
ReplyDeleteకాకినాడ ప్రియులందరూ ఈ Kakinada profile చదివి ఆనందించండి👇.
------–-------
దీని మీద నా అభిప్రాయాలు:-
(1). No.2 is a myth.
(2). I don't agree with No.14 which attributes the Circar Express train to the Nizam.
(3). No.22 is news to me.
(4). No.29 refers to the temple in Sarpavaram village (near Kakinada) and not Samarlakota.
(5). కాకినాడకు స్వంతమైన సినిమా స్ట్రీట్, టెంపుల్ స్ట్రీట్ గురించి చెప్పలేదు.
----------------------
Msg rec'd as a forward in WhatsApp ��
-----------------------
Msg starts
-----------------------
"Forwarded
కాకినాడ విశిష్టతలు :
1) న్యూయార్క్ నగరము మాదిరిగా వీధులు రూళ్ళకర్రతో గీసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత.
2) ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ.
3) ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ మద్రాసుగానూ,
4) చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ ముంబయిగానూ,
5) ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్ గానూ,
6) భారతీయ ప్రామాణిక కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 82.5 ఉత్తర రేఖాంశం కాకినాడ మీదుగా పోతుంది.
7 ) సగటున కాకినాడ ఊరంతా సముద్రమట్టానికి 2 మీటర్లు ఎత్తులో ఉన్నప్పటికీ, పట్టణంలోని చాలా ప్రాంతాలు సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నాయి. సముద్రతీరానికి సమాంతరంగా, ఉత్తరం నుండి దక్షిణంగా ఒక దీర్ఘచతురస్రం మాదిరిగా నగరం ఉంటుంది.
8) వస్త్ర వాణిజ్యం ఎక్కువగా జరిగిన ఈ ప్రాంతంలో డచ్చివారి కోట కూడా ఉండేది.
9) ఈ ప్రాంతంలో ఉన్న మడ అడవులు, భారతదేశంలో అతి పెద్ద మడ అడవులలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.
10) కోరంగి అభయారణ్యానికి నెలవు. గోదావరికి పాయలలో ఒకటైన 'గౌతమి', కాకినాడకి దక్షిణంగా బంగళాఖాతంలో కలుస్తోంది.
11) కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ (హోప్ ద్వీపం) చేత పరిరక్షింపబడుతున్నది.
12 ) రెండు శతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ నాయకర్ అనే ఆసామీ ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయన వారసులు మల్లాది సత్యలింగ నాయకర్ ఛారిటీస్ (MSN Charities) అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారు.
13) ఇక్కడి జె ఎన్ టి యు కళాశాల భారదేశంలోని అతి పురాతనమైన, అత్యుత్తమమైన ఏలెక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ శాఖలను కలిగి ఉంది.
14 ) నిజాం కాలంనాటి ప్రధాన రైలు, “సర్కార్ ఎక్స్ ప్రెస్” ఇప్పటికీ, కాకినాడ – చెన్నై ల మధ్య నడుస్తోంది.
15 ) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్ వైమానిక దళం, కాకినాడ మీద 1942 ఏప్రిల్ 6న దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఓడలు పూర్తిగా ధ్వంసం కాగా, ఒకరు మృతి చెందారు.
(contd..)
నరసింహారావు గారూ, నమస్కారం. ఈ 'కాకినాడ పేత్యేకతలూ పోస్టు వాట్సప్‌లో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. కొన్ని ప్రత్యేకతల గురించి ఈ బ్లాగ్‌లో వివిడిగా టపాలు వ్రాయడం జరిగింది. సినిమావీధి, దేవాలయం వీధుల గురించి కూడా వ్రాశాను. కానీ...
Deleteడచ్చివారి కోట ఎక్కడుండేదో, దాని అవశేషాలు ఇప్పుడు ఏమైనా ఉన్నాయో లేదో తెలియదు.
వర్మ గారు,
Deleteడచ్చి వారి కోట (trading post) కాకినాడ జగన్నాయకపురంలో ఉండేదట. ఈ క్రింది లింకులో History సెక్షన్ చూడండి. శిధిలాలేమన్నా ఉన్నాయేమో తెలియదు, నేనూ ఎప్పుడూ చూడలేదు.
కాకినాడలో డచ్చి కోటి
అవునండీ, కాకినాడ విశేషాలు విడివిడిగా మీరు టపాలు పెట్టారు, నేను చదివాను.
https://en.m.wikipedia.org/wiki/Kakinada
Kakinada profile (contd..)
ReplyDelete----------------------------
Msg rec'd as a forward in WhatsApp👇
----------------------------
Msg contd..
-----------------------
"Forwarded"
16 ) నాగార్జున ఎరువుల కర్మాగారం (కోస్తా ఆంధ్రలో అత్యధికంగా యూరియా ఉత్పత్తి చేసే కేంద్రం) ,కో రమాండల్ ఎరువుల కర్మాగారం (డై అమ్మోనియం హైడ్రోజన్ ఫాస్పేట్ ఉత్పత్తి జరుగుతోంది అందుకే కాకినాడని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు "ఎరువుల నగరం (Fertilizer City)"గా కూడా పిలుస్తారు
17 ) కాకినాడ పరిసర ప్రాంతాల నుండి, కొబ్బరికాయలను ఎగుమతి చేసే సంస్థలు చాలా ఉన్నాయి.
18 ) మురుగప్ప గ్రూపువారి ఈద్ పారీ (ఇండియా) మరియు కేర్గిల్ ఇంటర్నేషనల సంస్థల ఉమ్మడి పంచదార కర్మాగారం అయిన సిల్క్ రోడ్ సుగర్స్, 600,000 టన్నుల సామర్థ్యం కలది. ఇది, ప్రధానంగా ఎగుమతి ఆధార పరిశ్రమ(Export Oriented Unit)
19 ) 2002 సంవత్సరంలో, కాకినాడ పరిసరాల్లో అనేక వంటనూనె కర్మాగారాలు స్థాపించబడ్డాయి. అదానీ విల్మార్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, నిఖిల్ రిఫైనరీ, భగవతి రిఫైనరీ, మొదలైనవి రోజుకి 3000 టన్నులకి పైగా వంటనూనెలను ఉత్పత్తి చేయగలవు. ఈ కర్మాగారాలకి అవసరమైన ముడి పామాయిల్, సోయాబీన్ నూనె, ఓడరేవునుండి దిగుమతి అవుతున్నాయి
20 ) నాణ్యమైన జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు వాడే ఈ జత్రోఫా పంటని సాగుచేసేందుకు, కాకినాడ పరిసరాల్లో 200 ఎకరాలను కంపెనీ సేకరించింది.
21 ) కాకినాడ పరిసర ప్రాంతాలలో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు చాలా ఉన్నాయి. ఉప్పాడ బీచ్ రోడ్డునందు, స్పెక్ట్రం పవర్ జనరేషన్ సంస్థకి 208 మెగావాట్ల కేంద్రం ఉన్నది.
22 ) ఆంధ్రప్రదేశ్ ఐ.టీ పరిశ్రమలో కాకినాడ ద్వితీయ శ్రేణి నగరంగా పరిగణింపబడుతోంది.
23 ) ఉభయ గోదావరి జిల్లాల్లోని ఐ.టీ కంపెనీల సంఘం అయిన "గోదావరి ఐ.టీ అసోసియేషన్" (GITA), కాకినాడ కేంద్రంగా పనిచేస్తోంది
24 ) 2012-13 సంవత్సరంలో కాకినాడ నుండి రూ 35 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరిగాయి. ఈ ఎగుమతులలో హైదరాబాదు, విశాఖపట్నం తర్వాత కాకినాడది మూడో స్థానం
25 ) కాకినాడలో ఉన్న ఆంధ్రా ఎలక్ట్రానిక్స్ లి. సంస్థ, 1977 నుండి ఎలక్ఱ్రానిక్ వస్తువులను తయారుచేస్తోంది.
26 ) ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరింగు కళాశాల. జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇంజనీరింగు కళాశాల (JNTU Engineering College).
27 ) కాకినాడలో వున్న ప్రఖ్యాత మెక్లారెన్ స్కూలు వంద సంవత్సరాల చరిత్ర గలది.
28 ) ఆసియా లో మొదటి బయో డీజల్ తయారి ఇక్కడ కలదు.
29 ) కాకినాడ పరిసరాల్లోని సామర్లకోట గ్రామంలో ఉత్తరాయణం - దక్షిణాయనం మధ్య కాలంలో శ్రీభవన్నారాయణస్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు.
30 ) పావులూరి మల్లన - 11వ శతాబ్దానికి చెందిన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. గణితసార సంగ్రహము అనె గణితగ్రంధాన్ని వ్రాశాడు. దీనికే పావులూరి గణితము అని పేరు.
మల్లాది సత్యలింగం నాయకర్- 19వ శతాబ్దానికి చెందిన వాణిజ్యవేత్త, సంఘసేవకుడు.
31 ) కాకినాడ ఊరు పేరు చెప్పగానే నోరూరే విషయాలు రెండు. ఒకటి కోటయ్య కాజాలు. ఇవి తాపేశ్వరం మడత కాజాల వంటి కాజాలు కావు. సన్నంగా, కోలగా దొండకాయలాగా ఉంటాయి. , కొరగ్గానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తుంది. వీటిని గొట్టం కాజాలని కూడా అంటారు. తరువాత చెప్పుకోవలసినది నూర్జహాన్ కిళ్ళీ. ఇది తుని తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళీ. అలాగే కాకినాడలోని సుబ్బయ్య హోటలు. సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే ఇక్కడి అద్భుతమయిన భోజనానికి చాల ప్రశస్తి ఉంది.
32 ) డీప్ వాటర్ పోర్ట్ నిర్మించక ముందు నుండీ ఉన్న కాకినాడ లంగరు రేవు, భారతదేశంలోని 40 చిన్న ఓడరేవులలో అతిపెద్దది."
-----------------------
Msg ends
-----------------------
సిల్క్ రోడ్ షుగర్స్ ఎక్కడిదండీ - సామర్లకోట షుగర్ ఫాక్టరీనా?
Deleteఆంధ్రా ఎలక్త్రికల్స్ లి. గురించి మీకు ఏమైనా వివరాలు తెలిస్తే షేర్ చెయ్యండి.
Deleteసామర్లకోట కాదు రాజు గారూ. అది నవభారత్ వారిది కదా. ఈ "సిల్క్ రోడ్ షుగర్స్" కాకినాడలో వాకలపూడి దగ్గర ఉంది అని ఆన్లైన్ లో తెలుస్తోంది. EID Parry (మురుగప్ప గ్రూప్) వారిదట. నాకూ ఇంతకు ముందు తెలియదు.
DeleteSilk Road Sugar Pvt Ltd
DeleteSilkroad Sugar Pvt Ltd Vakalapudi Kakinada
No9. ఇంకా అవి ఉన్నాయంటారా?
ReplyDeleteXtra point. ఆంధ్రాలో సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉన్నా, కాకినాడ ఆంధ్రా పాలిటెక్నీక్ నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్తే కావలసినంత మద్యం దొరుకును!
సూర్య గారు,
DeleteNo.9. ఆహా, ఉన్నాయి.
"Xtra point":- మరీ ఒక కిలోమీటర్ లోనే కాదు లెండి. మరో 20 కి.మీ.వెడితే యానాం వస్తుంది, అక్కడ పుష్కలంగా దొరుకుతుంది.
వర్మ గారు, పైన నేను చెప్పినది కరెక్టేనా?
ఆ యానాం బోర్డర్ నాకు తెలిసి ఆంధ్రా పాలిటెక్నీక్ దగ్గరే అనుకుంటా. అప్పట్లో వెల్కం టూ యానాం అని బోర్డు చూసినట్లు గుర్తు.
Deleteసూర్య గారూ, మడ అడవులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని చూడడానికి అనువుగా టూరిజం వాళ్ళు చాలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ బ్లాగ్‌లో 'మన కాకినాడలో' అనే శీర్షుకతో ఉన్న టపాలలో మడ అడవుల గురించి మూడు టపాలు ఉంటాయి. ఫోటోలతో సహా వివరాలు ఇచ్చాను.
Deleteనరసింహారావు గారూ కరక్టేనండి.
ReplyDeleteవర్మగారు,
ReplyDeleteఇది టెకీలు విప్పవలసిన ముడి. చెబుతారేమో చూదాం..........
నరసింహారావుగారు.
డచ్చి కోట అని గోడలు కందకాలు ఎప్పుడూ లేవనుకుంటానండి. జగన్నాధ పురం పాత బ్రిడ్జి దిగిన వెంటనే ఎడమవైపు పల్లం లో కొద్ది దూరంలో ఒక పెద్ద బిల్డింగ్ ఉండేది, ఇది ఏభై ఏళ్ళకితం మాట. దానికి ఎదురుగా ఇవతలగట్టున ఒక పెద్ద బిల్డింగ్, ఇదీ డచ్చి వాళ్ళు కట్టిందే, ఇప్పటికి ఉంది. ఇందులో టెలిపోన్ ఎక్స్ఛేంజ్ ఉండేది, ఆ తరవాత కాలంలో అది ఇప్పుడున్న చోటికి తరలించబడింది.
అలాగే ఉప్పుటేరు వెంట పైకి వెళితే ప్రస్థుత కోర్ట్ కాంప్లెక్స్ లో జిల్లా రిజిస్టార్ ఆఫీస్ ఉండేది. అక్కడికి ఎక్కి చూస్తే సముద్రంలో ఓడలు కనపడేవి. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ లు అడ్డం ఉన్నాయేమో చెప్పలేను. అలాగే వెనక ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ లో తిరుగుడు మెట్లున్నాయి. దానికి పక్కనే ఒక పెద్ద నేలమాళిగా ఉంది. ఈ బిల్డింగ్ కి ఎదురుగానే కలక్టరేట్, పత్తిపాడు రాయితో కట్టినది.
శర్మగారూ నమస్కారం. జగన్నాథపురంలో ఏటిమొగ వెళ్ళే దారిలో కాలువ ప్రక్కన రంగూన్ మేడ ఇప్పటికీ ఉంది. చెక్కుడు ఆర్చీలతో దూరంనుంచి చూడడానికి చాలా బాగుంటుంది. మీరు చెప్పిన బిల్డింగ్ అదే అయి ఉంటుంది. ఇక దానికి ఎదురుగా కాకినాడ వైపు ఉన్న పాత బిల్డింగులో ఏదో షిప్పింగ్ కంపెనీ ఆఫీసు ఉన్నట్టు గుర్తు.
Deleteరిజిస్టార్ ఆఫీస్ అక్కడే ఉంది. నేలమాళిగలు... వాటి గురించి వింటుంటే ఆసక్తికరంగా ఉంది.
కాకినాడ గురించిన మాట గనక, టపాకి సంబంధించకపోయినా!
Deleteమీరు చెప్పిన రంగూన్ మేడ అదే. డచ్ వాళ్ళ ఆనవాళ్ళు తక్కువే. నేను చెప్పిన రెండు బిల్డింగులూ వాళ్ళు కట్టినవే! సత్యలింగ నాయకర్ రంగూన్ వ్యాపారం చేసిన ప్రముఖులు, డచ్ వాళ్ళనుంచిగాని ఆయన తీసుకున్నారేమో! అందుకే రంగూన్ మేడ అంటారనుకుంటున్నా!
పోర్ట్ స్టేషనుకి ఇవతలగా పొడుగ్గా ఒక బిల్డింగ్ ఉంటుంది. U shaped building. ఒకప్పుడు హెడ్ పోస్టాఫీస్ ఇక్కడ ఉండేది, ఆ తరవాత ఇప్పుడున్న చోటకి మార్చారు.. పోస్టాఫీస్ మార్చాక అది టెలికం కి వచ్చింది. అందులో టెలికం ట్రైనింగ్ సెంటర్ ఉండేది, ఇప్పుడు ఉందో లేదో, ఆ బిల్డింగ్ మీద కట్టిన సంవత్సరం ఉన్నది.
కాకినాడ గురించి గూగుల్ కంటే మీ ఇద్దరి దగ్గరే ఎక్కువ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుందండి. :) ధన్యవాదాలు
DeleteThanks Sarma గారు.
ReplyDeleteఅయితే ... కోటంటే కోటా కాదు ... అంటారా 🙂? మీ డిపార్ట్మెంట్ దాంట్లోనే ఉండేదన్నారుగా, మా కన్నా మీకే బాగా తెలిసుంటుంది 🙏.
ఊరి విశేషాల గురించి ఆసక్తికరమైన సంభాషణకి తెరతీసిన విన్నకోట వారికి ధన్యవాదాలు.
Deleteవర్మ గారు,
ReplyDeleteఇదేముంది, "కష్టేఫలి" శర్మ గారు తన బ్లాగులో ఇవాళ మరెన్నో ఎన్నో కాకినాడ విశేషాలు వ్రాశారు. అమ్మో, అమ్మో, అదేం మెమరీ పవరండీ బాబూ? అద్భుతం.
ఆ టపా ఈ క్రింది లింకులో చదవచ్చు.
శర్మ గారి కాకినాడ విశేషాలు
Deleteతాతగారు దీర్ఘదర్శి :)
జిలేబి
శర్మగారి జ్ఞపకాలలో 50 సంవత్సరాల క్రితం కాకినాడ ఎలా ఉండేదో, కొద్ది మార్పులతో ఇప్పుడూ అలాగే ఉంది నరసింహారావు గారూ.కాకపోతే ఆక్టోపస్‌లా అన్నివైపులా కొంత విస్తరించింది.
Deleteశర్మాగారి బ్లాగ్‌లో కామెంట్లకి అవకాశం లేనట్లుంది. అందుకే ఇక్కడే ఆయనకి రెండు మాటలు...
శర్మగారూ మీ టపా చాలా బాగుంది. ఇక్కడ మీరు ఎంత వ్రాసినా అది కబ్జా కాదు సర్ - ప్రివిలెజ్!
// "శర్మ గారూ ...... ఇక్కడ మీరు ఎంత వ్రాసినా అది కబ్జా కాదు సార్ - ప్రివిలెజ్" //
ReplyDeleteWell said వర్మ గారు 👌.
చదువు గురించి చెప్పాలంటే గుంటూరు, కాకినాడ మొదటి రెండు స్థానాలకి పోటీ పడుతుంటాయి, అన్ని రంగాలలోనున్నూ. కోరంగి మడ అడవులు బాగా సంరక్షింపబడుతున్నాయి, ఒకప్పుడు కోరంగి ఓడ రేవు.. కొన్ని మొక్కలనికొత్తగా గుర్తించడమూ జరిగింది, కొత్తరకం వరిని కూడా గుర్తించడమూ జరిగింది. It is a botanical paradise. ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల గురించి అందరికి తెలుసు కనక చెప్పలేదు. అందరికి తెలిసిన విషయాలను ఎక్కువగా ప్రస్థావించలేదు.
ReplyDeleteనదీ సంగమం చొల్లంగి, లొల్లంగి అమావాస్యకు సముద్ర స్నానం, చొల్లంగిలో చెప్పుకోదగ్గదే.
సినిమా రోడ్ ని పూర్తిగా వదిలేశాననుకోవద్దు. ఎంతో మంది నటీ నటులను ఇచ్చినది కాకినాడ, నాటక సంస్థ.సినిమా రోడ్ లోనే అన్నదాన సమాజం. ఇలా ఎన్నో!
నాటి రోజుల్లో రవాణా కోసం బస్సుల్ని నడిపిన ఏకైక సంస్థ శ్రీరామదాసు మోటర్ సర్విస్. తూగోజిలో అన్ని అన్ని బస్సులు ఈ సంస్థవే. మొదటి సారిగా పార్సెల్ సర్వీస్ ప్రారంభించినదీ ఇక్కడే! ఒకప్పుడు ఈ సంస్థలో గుమాస్తా ఉద్యోగానికి ప్రయత్నం చేసినవాడిని, చదువుకోడానికి డబ్బులు లేక కాలేజి మెట్లు ఎక్కనివాడినీ :)
విద్యాదాత సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాత సూర్యారావు బహద్దరు వారి విగ్రహం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఠీవిగా నిలబడి ఉంటుంది.
మీ బ్లాగును కబ్జా చేయడం కాదన్న మీ మాట అభిమానమే, మరేం కాదు :)
శర్మ గారు,
Deleteపైన మీరు వివరించిన మరిన్ని కాకినాడ విశేషాల బట్టి తెలుస్తున్నదేమిటంటే .. మీరొక గని అని, తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత అనీ 🙏.
మీ జీవితచరిత్ర వ్రాయండి సర్ ఇటువంటి వివరాలన్నిటినీ కూడా పొందుపర్చి, భావితరాలకు ఉపయోగిస్తుంది 🙏.
👌
Delete
Deleteఆ మధ్య యెవరో తాతగారి మొత్తం టపాల్ని
మూట గట్టేసుకుని హడ్తాలు చేసేరట టపాలను పబ్లిక్ చేస్తారా లేక మీ టపాల్ని పునః ప్రకటించ మంటారా అని. వారెవరో అట్లా మళ్ళీ హడ్తాలు చేయాలనుకుంటున్నారట తాతగారి జీవిత సంగ్రహము కొరకు. విన్నకోట వారి విన్నపాలు వారి హడ్తాలు ఫలితం ఇస్తాయంటారా కష్టే ఫలి వారు ?
జిలేబి
1960 నాటికి కాకినాడలో ఉన్న ఫోన్ ల సంఖ్య మూడు వందలు లోపు. స్వాతాంత్ర్యానికి ముందు టెలికం వ్యవస్థ గురించి 60 నాటికి రిటయిర్ ఐన మా సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ చెప్పిన మాట ఇది.
ReplyDelete’ నేనెరిగి కాకినాడలో నాలుగు టెలిపోన్ కనక్షన్లు ఉండేవి. అవి కలక్టర్, ఎస్పి, పబ్లిక్ కాల్ ఆఫీస్, దంటు సూర్యారావు అండ్ కో షిప్పింగ్ కంపెనీ. మొదటి టెలిపోన్ ఎక్స్ఛేంజి జిల్లాలో కాకినాడ మొదటిది, రాజమంద్రి కాకినాడ ఎక్స్ఛేంజికి లాంగ్ డిస్టెన్స్ పబ్లిక్ టెలిఫోన్ గా ఉండేది. ఆ నాటికి బయటి ప్రపంచంతో ఉన్న ఏకైక లైన్ కాకినాడ-మద్రాసు."
కలకత్తా నుంచి మద్రాస్ కి ట్రంక్ రోడ్. ఈ ట్రంక్ రోడ్ వెంట టెలిఫోన్ స్థంభాలుండేవి గుర్తుందా? కోఏక్సియల్, ఆప్టిక్ ఫైబర్ వచ్చాకా కనపడటం లేదీ లైన్. ఈ లైన్ ను రెండవ ప్రపంచ యుద్ధం తరవాత ఇటాలియన్ యుద్ధ ఖైదీల చేత నిర్మింపబడింది.
MLA (దంటు భాస్కర రావు గారే కదా అప్పట్లో?) గారింట్లో కూడా ఫోన్ ఉండుంటుందేమో కదా (MLA కాబట్టి)?
ReplyDeleteసరే MLA గారి ఫోన్ సంగతి వదిలెయ్యండి గానీ, ఇక
లాభం లేదండీ మీరు జీవితచరిత్ర వ్రాయడం మాత్రం వెంటనే మొదలుపెట్టాలని ప్రజల కోరిక, శర్మ గారూ. లేకపోతే ఇటువంటి చరిత్ర విశేషాలు క్రమేణా మరుగున పడిపోతాయి. కాబట్టి శ్రీకారం చుట్టండి మరి 🙏.
విన్నకోటవారు,
ReplyDeleteఆయన చెప్పినది ఒకటే తీగ మీద ఫోన్ లు పని చేసినకాలంనాటిమాట, పేరు నేను పొరబడిఉండచ్చు.
వర్మగారు,
అసలు టపాకి, మీ అనుమానానికి జవాబిస్తా కొద్ది టైమ్ పడుతుంది.
స్వాతంత్రం వచ్చిన మొదటి దశాబ్దం నాటికి కూడా తూగోజిలో లారీల సంఖ్య తక్కువే. అప్పటికున్న లారీలు డాడ్జి కంపెనీవి. అప్పుడప్పుడే తాతా బెంజ్ ఛాస్ లు వస్తున్నకాలం, ఇది స్వదేశీ సంస్థ. లారీ బాగా పని చేసేది, పేరొచ్చింది కూడా. బెజవాడపోయి ఛాస్ కొనుక్కుని బాడీ కట్టించుకోవల్సివచ్చేది. ఐతే మొదటిగా తూగోజిలో తాతా బెంజ్ షో రూమ్ బాడీ బిల్డింగ్ మొదలు పెట్టిన సంస్థ ఎస్ఆ.ర్.ఎం.టి. ఆ రోజులనాటికి లారీ రోడ్ మీదకి రావడానికయ్యే ఖర్చు ముఫై వేలు. ఇలా కొత్త ఉద్యోగాలూ పుట్టుకొచ్చాయి.
పదివేలు చేతిలో ఉంటే లారీ కొనేవారు. ఇరవై వేలు ఫైనాన్స్, అలా ఫైనాన్స్ కంపెనీలూ పుట్టుకొచ్చాయి.
ఇక పారిశ్రామికంగా ఇంజన్ లో గడ్జన్ పిన్ అదే కింగ్ పిన్ ముఖ్యం. దానిని కాకైనాడ లో తయారు చేసిన సంస్థా ఎస్.ఆర్.ఎం.టి యే
ఇక కాకినాడ కబుర్లు ఇందుతో ముగిస్తా. నమస్కారం
సారీ శర్మ గారు. కాకినాడలో అలనాడున్న ఫోన్ల సంఖ్య గురించిన ఆ మాటలు మీవేననుకున్నాను, మీ లైన్ ఇన్స్పెక్టర్ చెప్పినవి అని నేను సరిగ్గా అర్ధం చేసుకోలేదు. కొటేషన్ మార్కులను గమనించలేదు.
ReplyDeleteప్రమాదో ధీమతా మపి
Delete_/\_