Pages

Sunday, 1 December 2019

సౌందర్యపిపాస

నలుగురూ వెళ్ళే దారిలో గడ్డివామూ, దానిని ఆనుకొని ఓ గుడిసే.. గడ్డివాము పైనుంచి తాటాకు కప్పు మీదకు ప్రాకిన బూడిద గుమ్మడి పాదూ.. పాదుకి పూసిన పసుపు పువ్వూ.. అది అందంగా తలవూపుతూ, నవ్వుతూ ఉంటుంది. నలుగురితో పాటూ మనమూ ఆ దారివెంట పోతూ ఉంటాం. చదువో, ఉద్యోగమో, ఆరోగ్యమో, ప్రేమ వ్యవహారమో, వ్యాపారంలో నష్టమో, గొడవలో, ఇంకా ఏవైనా సమస్యలో అందరిలాగే ఒకటో, ఎన్నో మనకీ ఉండవచ్చు. కానీ పువ్వుని చూసి తిరిగి నవ్విన వాడికి సమస్యల బరువు సగం తగ్గుతుందట.   

చుట్టూ ఉన్న చెట్టూ - కొండా, వాగూ - వంకా,  పిట్టా - పువ్వూ, మంచూ - ఎండా, అస్తమిస్తున్న సూర్యుడు - విరబూసిన వెన్నెల, కురుస్తున్న వర్షం - తడూస్తున్న ప్రపంచం.. అన్నీ అందమైన వైనా, వాటిని అస్వాదించగల సౌందర్యపిపాస అందరిలోనూ ఉండదా?

చైనాలో ఒక సామెత ఉందట 'నీ దగ్గర రెండు రొట్టెలు ఉంటే ఒక రొట్టె అమ్మి ఒక పువ్వుని కొనుక్కో' అని. మనిషి ఆనందంగా ఉండడానికి కడుపు నిండడం ఎంత అవసరమో, మనసు నిండడం కూడా అంతే అవసరం. కాకపోతే రొట్టెల సంపాదనలో పడిపోయి మనసు ఆకలి తీర్చుకోవడం మరచిపోతున్నాం అంతే.
  
బైదవ్.. ఇవన్నీ నేను కొనుక్కొచ్చినవి కావు, సెల్ కెమేరాతో తీసుకొచ్చినవి.  హేవ్ ఎ హేపియర్ డే!  

3 comments:

  1. పువ్వుల సౌందర్య లహరి👌. చాలా బాగుంది.

    ReplyDelete
  2. మీ పోస్ట్ చాల బావుంది మీ కు తెలుగు సాహిత్యం లిరిక్స్ కావాలంటే Telugu Lyrics ఈ వెబ్సైటు ను ఒక సారి చూడండి Visit Aarde Lyrics

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!