Pages

Thursday 5 November 2020

మీరందరూ బాగున్నారని భావిస్తున్నాను.

చాలాకాలం తరువాత బ్లాగ్‌లోకి వస్తున్నాను. నేనే మరచిపోయిన నా బ్లాగ్ మరెవరికైనా జ్ఞాపకం ఉంటుందని అనుకోను. 2020 ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేసింది. నేను, నా భార్యాకూడా కోవిడ్ బారినపడి, ఓ నలభై రోజులు సఫరై, అదృష్టవశాత్తూ సేఫ్‌గా బయటపడ్డాం.

లాక్‌డౌన్ రోజుల్లో సోషలైజింగ్ పూర్తిగా తగ్గిపోయింది. వర్చువల్ ప్రపంచంలో ఆరునెలలకుపైగా నలిగిపోయాం. పార్కులు, పబ్లిక్ ప్లేసులూ షట్‌డౌన్ అయిపోయాయి కనుక టెర్రస్‌పైన నడక తప్పించి, కనీసం పార్కైనా చూడక మొహంవాచిపోయాం. 

అన్లాక్ మొదలైంది కనుక, కొరోనా కూడా సెకండ్ వేవ్ అని మీద పడకపోతే, 2021 కయినా మామూలు రోజులు చూడగలం.

సగం, సగం తెరచిన పార్కులోకి చొరబడి, నడుస్తూ ఈ వీడియో తీసాను. ఈ లింక్ క్లిక్ చేసి చూడండి. మీకు నచ్చుతుంది.

మీరందరూ బాగున్నారని భావిస్తున్నాను. 

10 comments:

  1. ఎవరు మర్చిపోలేదు సర్ . కాకినాడ గురించి ఉన్న బ్లాగ్ మీదే.
    ఆ దేవుడి దయ వలన కరోనా నుండి బయటపడ్డందుకు మీకు అభినందనలు . చాల సంతోషం కూడా .
    తరుచుగా పలకరిస్తారని ఆశిస్తూ ..

    ReplyDelete
  2. Not forgotten at all. Waiting for you to get back to normal and to take virtually on beautiful village trips.
    May you have good health.

    ReplyDelete
  3. ధన్యవాదాలండి Aruna Garu -^-

    ReplyDelete
  4. కరోనా నుంచిబయటపడ్డారు అదే పదివేలు.

    ReplyDelete
    Replies
    1. మీవంటి పెద్దల ఆశీస్సులు శర్మగారు. ధన్యవాదాలు. -^-

      Delete
  5. ఆరోగ్యాభినందనలు. వీడియో ఇంకా ఎడిట్ చేయవచ్చు. వాకింగ్ ట్రాక్ బాగుంది. ప్రక్కన ఉన్నది చెరువా ? ఇన్ని వరదల్లో కూడా నీరు లేదేమిటండీ ?
    తరుచుగా వ్రాయకపోతే ఎలా పలకరించాలండీ ?

    ReplyDelete
    Replies
    1. అవునండి, వీడియో నిడివి ఇంకా రెండునిమిషాలు తగ్గివుంటే బావుండేది.

      ధన్యవాదాలు నిహారికగారు -^-

      Delete
  6. మా కాకినాడ రాజు గారినీ, వారి బ్లాగునీ ఎలా మరచిపోతామండీ? ప్రశ్నే లేదు. వర్మ గారు ఈ మధ్యేమీ వ్రాయడం లేదే అని నేను అప్పుడప్పుడు తలుచుకుంటూనే ఉంటాను. స్కూలు వ్యవహారాలు, ఆన్-లైన్ పాఠాల తోటీ బిజీగా ఉండుంటారులే అనీ అనుకున్నాను గానీ “కరోనా” బాధితులయ్యారని ఇప్పుడు ఇక్కడ చదివి దిగ్భ్రాంతి కలిగింది. పూర్తిగా కోలుకున్నారని, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారనీ తలుస్తాను.

    పార్క్ విడియో బాగా వచ్చిందండి, పార్కూ బాగుంది👌. విడియో చివరిలో కనిపించిన మిమ్మల్ని చూస్తే బాగా నీరసపడ్డట్లు అనిపించారు. ఆరోగ్యం జాగ్రత్తండి.

    ReplyDelete
    Replies
    1. వీడియో పాఠాలు తయారుచెయ్యడంలో కొంత బిజీ ఐన మాట వాస్తమేనండి. దేవుడి దయ వల్ల, మీవంటి పెద్దల ఆశీస్సులవల్లా కోలుకొన్నాం.

      ధన్యవాదాలు నరసింహారావు గారు -^-

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!