వారం రోజుల క్రితం ద్వారపూడి దేవాలయాలను చూడటానికి వెళ్ళాను. కాకినాడకి 32 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రీ వైపు వెళ్ళే కెనాల్ రోడ్డు ప్రక్కన ద్వారపూడి ఉంది. ఇక్కడ ఒకే ప్రాంగణంలో సుమారు పది పెద్ద దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి శ్రీ అనంతపద్మనాభ స్వామిది. నిజానికి ఇది ఒక ప్రత్యేకమైన గుడికాదు. శిరిడీ సాయిబాబా ఆలయంలో సాయినాధుని విగ్రహానికి వెనుకవైపు ఒక గర్భ గుడిలాంటి చాంబర్లో పవళించి ఉన్న మూర్తి. సుమారు రెండు సంవత్సరాలకు ముందు కుడా ఒకసారి ఇక్కడికి వెళ్ళాను. అప్పుడు ఈ పద్మనాభుడిని చూసిన జ్ఞాపకం లేదు. దానికి కారణం అప్పడు దీనిని నేను దర్శించి ఉండకపోవచ్చు, లేదా అనంతపద్మనాభుడు అంటే ఎవరో సరి అయిన అవగాహన లేక చూసిన విషయం నాకు గుర్తుండలేదో!
అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఈ దేవుడి ప్రస్తావన పురాణాలలో ఉంది. కేరళ రాష్ట్రంలో విల్వమంగలత్తు స్వామియార్ (ఈయననే దివాకర ముని అనికూడా అంటారు) విష్ణుమూర్తి దర్శనం గురించి ప్రార్ధిస్తుండగా, ఆయన ఒక అల్లరి బాలుడి రూపంలో అక్కడికి వస్తాడట. పూజలో ఉంచిన సాలగ్రామ శిలని తీసుకొని నోటిలో పెట్టుకోవడంతో విల్వమంగలుడికి కోపం వచ్చి ఆ బాలుడిని పట్టుకోవడానికి అతని వెంటపడతాడు. కొంతదూరం పోయిన తరువాత ఆబాలుడు ఒక వృక్షంలోనికి చొచ్చుకొనిపోవడం కనిపిస్తుంది. అప్పుడు ఆ వృక్షం క్రిందపడి శేషసయనంగా మారుతుంది. విష్ణువు అత్యంత పొడవైన మూర్తిగా దానిమీద దర్శనం ఇస్తాడు. అంత పొడవైన రూపాన్ని ఒకేసారి చూడగలగడం అసాద్యమౌతుందని విల్వమంగలుడు ప్రార్ధించగా, భగవంతుడు తన పొడవుని తగ్గించుకొంటాడట. అప్పుడు కొన్నిచెట్లు అడ్డు రాగా వాటి వెనుకనుంచి విల్వమంగలుడు, విష్ణుమూర్తిని మూడు భాగాలుగా చూస్తాడు. ఇప్పటికీ తిరువనంతపురం దేవాలయంలో మనం అనంత పద్మనాభుడిని ఆవిధంగానే మూడు ద్వారాలద్వారా మూడుభాగాలుగా దర్శించుకోగలం. విల్వమంగలుత్తు స్వామియార్ నిర్దేశించిన ప్రకారంగానే సాంప్రదాయబద్దంగా ఇప్పటికీ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు.
పద్నాలుగు, పదిహేను శతాబ్ధాలకాలంలో యూరోపియన్ దేశాలు, మన దేశంతొ సుగందద్రవ్యాల వ్యాపారం చేసేటప్పుడు, మలాబార్ తీరంలో ఉన్న ఈ ప్రాంతానికి అనంతంగా సంపద వచ్చిచేరిందని చెబుతారు. దానితో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విజయనగరరాజులు, చేరరాజులు, పురప్రముఖులు, సాధారణ ప్రజలు.ఇబ్బిడి ముబ్బిడిగా పద్మనాభుడికి కానుకలు సమర్పించి ఉండవచ్చు. తరువాతి కాలంలో డచ్చివారినుంచి, బ్రిటిష్ వారినుంచి, పొరుగు రాజయిన టిప్పు సుల్తాన్ నుంచి ఈ రాజ్యానికి ముప్పుపొంచి ఉండడంతో 18 శతాబ్ధంలో ఈ గుడిని పునర్నిర్మించినప్పుడు సంపదనంతా నేలమాళిగలలో బద్రపరిచారు. అదే ఇప్పుడు బయటపడిన బంగారు గని.
ప్రపంచం అంతా లక్షల కోట్ల సంపద గురించి అబ్బురపడుతుంటే, ఈ గుడి యొక్క అనువంశిక ధర్మకర్త, ప్రస్తుత రాజు తిరుణాల్ మార్తాండ వర్మ, తాను కేవలం ఆ స్వామికి దాసుడిని మాత్రమే అనీ, ఆ సంపద అంతా కేవలం దేవుడికే చెందుతుందని చెబుతారు. ఇంత సంపద దేవాలయ నేళమాలిగల్లో ఉందని వాటిని తెరవక ముందే వీళ్ళకి తెలుసు. దేవాలయం నుంచి వెళ్ళేటప్పుడు కాలికి అంటుకొన్న ఇసుకరేణువులనికూడా శుబ్రంచేసుకొని అడుగు బయటకు వేస్తారట. దేవుడికి చెందిన ఇసుకరేణువు కూడా తీసుకోరాదనే నియమమే దీనికి కారణం. ఆయన మాటలలో దేవుడి పట్ల అచంచల విశ్వాసం కనిపిస్తుంది. 90 సంవత్సరాల వయసులో ప్రతిరోజూ దేవాలయానికి వెళతారు. ఏదయినా కారణంతో ఒకరోజు వెళ్ళలేక పోతే అది ఒక శిక్షగా భావించి, 166 రూపాయల 35 పైసలు పెనాల్టీగా దేవాలయానికి చెల్లిస్తారు. ఇది ఒక సాంప్రదాయం. ఈ రాజ వంశంలో మాత్రుస్వామ్య వ్యవస్థ నడుస్తుందట; ఈయన తరువాత మేనగోడలు వారసురాలిగా రాణీ అవుతుంది. రాజ్యాంగ పరంగా మిగిలిన పౌరులు లాంటి వాళ్ళే అయినా, ప్రజలు మాత్రం ఈయనని మహారాజు లానే వ్యవహరిస్తారట. కొంతకాలం క్రితం ద హిందూస్తాన్ టైంస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్తాండ్ వర్మ ఈ విశేషాలు చెప్పారు. ధనం కోసం, అధికారం కోసం గడ్డి కరుస్తున్న నాయకులున్న ప్రస్తుత సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉండడం ముదావహం.
-అందుకే ఈ పోస్టు.
కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి అనంతసంపద గురించిన వీడియోలు ఇక్కడ చూడండి.
1. Seven Wonders of India: Sri Anantha Padmanabha Swamy:
2. తిరుమల వేకటేశ్వరుని కంటే అనంతపద్మనాభుడే ధనవంతుడయిన దేవుడు:
6. దేవాలయ చరిత్ర ఫార్ట్ -3:
ద్వారపూడి అనంతపద్మనాభుడు
ప్రస్తుత పోస్టు యొక్క ఉద్దేశ్యం ద్వారపూడి దేవాలయాల గురించి తెలియజేయడం కాదు - ఈ గుడిలో ఉన్న అద్బుతమైన అనంతపద్మనాభుని విగ్రహం ఈ పోస్టు వ్రాయడానికి ఒక ప్రేరణ మాత్రమే.
* * *
గత సంవత్సరం తిరువనంతపురం ఆలయంలో నేల మాళిగలలోనుంచి బయటపడిన బంగారు నాణాలు, నగలు, విగ్రహాలు, వజ్రవైఢూర్యాలు మొదలనవాటి విలువ లక్ష కోట్ల రూపాయలని (వాటి ప్రాచీన విలువని -antique value- మదింపు చేస్తే దీనికి పదిరెట్లు ఉంటుందని అంచనా) ప్రపంచవ్యాప్తంగా మీడియాలో వార్తలు రావడంతో మన అందరి దృష్ఠీ ఈ పురాతన దేవాలయం మీదకి మళ్ళింది. ఇప్పుడు ప్రపంచంలో ది రిచ్చెస్ట్ గాడ్ ఈయనే. వంద అడుగుల ఎత్తయిన గోపురం, 18 అడుగుల పొడవైన పవళించి ఉన్న స్వామి విగ్రహం, 108 పవిత్ర విష్ణు నివాసాలలో ఇది ఒకటి అనే ప్రఖ్యాతి...అన్నీ కలిపి ఎవరికయినా ఒక్కసారి తిరువనంతపురం అనంతపద్మనాభుడిని దర్శించుకోవాలనే కోరికని కలిగిస్తాయి.
క్షీరసాగరం అనబడే పాల సముద్రంలో అనంతుడు అనే శేషతల్పంపై యోగనిద్రలో శయనించి ఉండే విష్ణువే అనంత పద్మనాభుడు. వేంకటేశ్వర స్వామికి చాలా దేవాలయాలు ఉన్నా, తిరుమలకి గొప్ప ప్రత్యేకత ఉన్నట్లే; అనంతపద్మనాభ స్వామికి కూడా, కేరళలో తిరువనంతపురంలోది ప్రసిద్ద దేవాలయం.
ఈ దేవాలయం 1000 సంవత్సరాల పూర్వం కట్టబడిందట. తరువాత 18వ శతాబ్దంలో ట్రావెంకోర్ చేర రాజ వంశానికి చెందిన మార్తాండ వర్మ తనను తాను పద్మనాభ దాసునిగా ప్రకటించుకొని, ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. అప్పటినుంచీ ఇప్పటి వరకూ అతని వంశంవారే దేవాలయ బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది.
Tiruvanamtapuram temple
ఆ విషయాలు ప్రక్కనపెడితే, అసలు ఈ దేవాలయ నేల మాళిగలలో నికి లక్ష కోట్ల రూపాయల సంపద ఎలా వచ్చింది?పద్నాలుగు, పదిహేను శతాబ్ధాలకాలంలో యూరోపియన్ దేశాలు, మన దేశంతొ సుగందద్రవ్యాల వ్యాపారం చేసేటప్పుడు, మలాబార్ తీరంలో ఉన్న ఈ ప్రాంతానికి అనంతంగా సంపద వచ్చిచేరిందని చెబుతారు. దానితో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విజయనగరరాజులు, చేరరాజులు, పురప్రముఖులు, సాధారణ ప్రజలు.ఇబ్బిడి ముబ్బిడిగా పద్మనాభుడికి కానుకలు సమర్పించి ఉండవచ్చు. తరువాతి కాలంలో డచ్చివారినుంచి, బ్రిటిష్ వారినుంచి, పొరుగు రాజయిన టిప్పు సుల్తాన్ నుంచి ఈ రాజ్యానికి ముప్పుపొంచి ఉండడంతో 18 శతాబ్ధంలో ఈ గుడిని పునర్నిర్మించినప్పుడు సంపదనంతా నేలమాళిగలలో బద్రపరిచారు. అదే ఇప్పుడు బయటపడిన బంగారు గని.
ట్రావెంకోర్ వంశీయుల రాజభవనం. ఫోటో సోర్స్: ద హిందూ న్యూస్ పేపర్
ప్రస్తుత మహారాజా ఆఫ్ ట్రావెంకోర్: Thirunal Marthanda Varma
-అందుకే ఈ పోస్టు.
కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి అనంతసంపద గురించిన వీడియోలు ఇక్కడ చూడండి.
1. Seven Wonders of India: Sri Anantha Padmanabha Swamy:
© Dantuluri Kishore Varma