యాదవ రాజ్యానికి ముఖ్యపట్టణం మధురానగరం. కాకినాడలో ఉన్నమధురానగర్ అన్న ప్రాంతంలోనే కృష్ణుని ఆలయం `గోకులాన్ని` నిర్మించడం విశేషం.
2 ఎకరాల విశాలమైన స్థలం
పచ్చని చేట్లు మరియు లాన్లు
దశావతారాలు, అష్టలక్ష్ములు
శ్రీకృష్ణ లీలలు, ధ్యాన మందిరం
సభావేదిక, చుట్టూ వాకింగ్ ట్రాక్
శ్రీకృష్ణ బృందావనం – మధురానగర్ లో గోకులం.
చిన్నికృష్ణుడు ఎన్నో చిలిపిపనులు చేసేవాడు. ఊరిలోఉన్న అందరి ఇంటికీ దొంగచాటుగావెళ్ళి ఉట్టిమీద ఉన్న పాలకుండలలోని వెన్న తాను తిని, తనమిత్రులకి కూడా పంచి వెళ్ళేముందు కాస్త వెన్నని నిద్రపోతున్న ఆ ఇంటి కోడళ్ళ మూతులకు రాసేవాడు. దానితో అత్తా కోడళ్ళ గొడవలు డైలీ సీరియళ్ళ స్థాయిలో జరిగేవి.కృష్ణుడు వెన్న దొంగ.
శ్రీకృష్ణుడ్ని వేణుగానలోలుడు అని పిలుస్తారు. అతని వేణుగానానికి పులకించనిది ఏదీ లేదు. ప్రకృతి, పశువులు, మనుష్యులు అనే భేదం లేకుండా ఆ సంగీతానికి మంత్రముగ్ధులు కావలసిందే. గోపకాంతలయితే తమ పనులను, సర్వస్వాన్నీ వదిలేసి ఆ మురళీ లోలునితో బృందావనంలో రాసలీలలలో తేలిపోయేవారు.
బృందావనంలో కాళింది అనే మడుగు ఉంది. అందులో కాళీయుడు అనే రాక్షస సర్పం ఉండేది. దానివలన మడుగులో నీరు అంతా విషపూరితం అవడంతో కృష్ణుడు ఆ సర్పం పడగలమీద మర్దనం(నృత్యం) చేసి దానిని తరిమికొడతాడు.
ముగ్ధ మనోహరమైన పాలరాతి కృష్ణుని ప్రతిమ - దర్శనం చేసుకొని, పచ్చని పరిసరాలని చూస్తూ కొంతసేపు వాకింగ్ ట్రాక్ లో నడచి, అక్కడ ఉన్న బెంచీలమీద కాలక్షేపం చేస్తే ఒక అందమైన సాయంత్రం ఆహ్లాదకరంగా గడుస్తుంది.
ఆదిలక్ష్మి అష్టలక్ష్ములలో మొదటిది.ఈమెనే వరలక్ష్మి అనికూడా పిలుస్తారు. ప్రాణాన్నీ ప్రసాదించేది ఆదిలక్ష్మే. ఆ ప్రాణాన్ని నిలుపుకోవడానికి కావలసిన అహారం ఇచ్చేది ధాన్యలక్ష్మి. ధైర్యాన్ని ధైర్యలక్ష్మీ, సౌభగ్యాన్ని గజలక్ష్మీ, సుభజాతకులగు సంతానాన్ని సంతానలక్ష్మీ, విజయాన్ని విజయలక్ష్మీ,విద్యను విద్యాలక్ష్మీ, సంపదని ధనలక్ష్మీ ప్రసాదిస్తారు.
Ashta Lakshmis - Statues of Ashta Lakshmi along the side of the walking track
Dasavatarams - Lord Vishnu`s ten incarnations
పండుగరోజులలో ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు.ముగ్గుల పోటీలు, పురాణ శ్రవణాలు, పిల్లలకీ పెద్దలకీ రకరకాల పోటీలు, పూజలు.. మొదలైనవి చాలా సందడి వాతావరణంలో జరుగుతాయి
Illuminated temple
© Dantuluri Kishore Varma
మంచి ఫోటోలతో పోస్ట్ పెట్టి ఎప్పుడెప్పుడు చూస్తామా అనేలా చేసారు:-)
ReplyDeleteమీకు నచ్చి నందుకు ధన్యవాదాలు పద్మార్పితగారు.
ReplyDeleteమీ రాతల్లో కాకినాడ మరింత అందంగా కనిపిస్తూంది.
ReplyDeleteరాతల్లోనే కాదు, బయటకూడా గోకులం అందంగానే ఉంటుంది శిశిరగారు :)
ReplyDelete