Pages

Monday 11 January 2016

స్పూర్తి

స్వామీ వివేకానంద జన్మదినం జనవరి 12.

1985 నుంచీ మన దేశంలో ప్రతీసంవత్సరం ఈ తారీఖును జాతీయ యువజన దినోత్సవం (నేషనల్ యూత్ డే)గా అధికారికంగా జరుపుకొంటున్నాం. స్వామీ వివేకానంద ఉపన్యాసాలు, గీతోపాఖ్యానం, రచనలు, లేఖలు... వాటిలో స్పూర్తిని నింపే మాటలు యువతని వెన్నుతట్టి ముందుకు నడిపిస్తాయి. 


1. రోజుకి ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. 
2. మిమ్మల్ని బలవంతుల్ని చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనుల్ని చేసే ప్రతి ఆలోచననీ తిరస్కరించండి.
3. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి. దాన్నే ధ్యానించండి. దాన్నే కలగనండి. దాన్నే శ్వాసించండి. అదే విజయానికి మార్గం. 
4. లక్ష్యంలో ఉన్నంత శ్రద్దాసక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి, విజయ రహస్యం అంతా అదే.
5. నిరంతరం వెలిగే సూర్యుడ్ని చూసి చీకటి భయపెడుతుంది. అలాగే నిరంతరం శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది.
6. పరాజయాల్ని పట్టించుకోకండి. అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమిలేని జీవితం ఉంటుందా?
7. ప్రేమా, నిజాయితీ, పవిత్రతా కలిగి ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఓడించలేదు.
8. చావు బ్రతుకులు ఎక్కడో లేవు, మన ఆలోచనల్లోనే ఉన్నాయి. ధైర్యంలోనే బ్రతుకు ఉంది. భయంలోనే చావు ఉంది.
9. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు. కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.
10. విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే నిజమైన సవాల్.

వివేకానంద గురించి మనకాకికాడలో బ్లాగ్‌లో ఇంతకు ముందు రాసిన విషయాలని ఇక్కడ చదవండి.  
  1. స్వామీ వివేకానంద
  2. హిందూమతం గురించి చదివిన పత్రం
  3. సమాన(వ)త్వం
  4. ఉత్సాహం లేని చదువు, ఏకాగ్రత లేని పని, లక్ష్యం లేని ప్రయాణం ఏ ఫలితాన్నీ ఇవ్వవు.
  5. వివేకానందా రాక్ మెమోరియల్
  6. స్వామీ వివేకానంద స్వార్ధం

© Dantuluri Kishore Varma

2 comments:

  1. "ఉజ్వల నేత్రా-చారు శరీరా, దీన దయళో-వీర నరేంద్ర" అని ఓ గీతాన్ని భజనాంజలి అనే ఆల్బం లో వివేకానందుని గూర్చి విన్నాను.మళ్ళీ ఆ గీతం గుర్తుకు వచ్చింది మీ పోస్ట్ ద్వారా..!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మూర్తిగారు. మీరు వ్రాసే ప్రతీమాటిలో వివేకానందుడి మీద మీకున్న అభిమానం కనిపిస్తుంది.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!