తూర్పుగోదావరి జిల్లా మొత్తం విస్తీర్ణంలో ముప్పై శాతానికి పైగా అడవులు ఉన్నాయి. రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి మొదలైన ప్రాంతాల్లో ఈ అడవుల్లో ఎక్కువ భాగం విస్తరించి ఉన్నాయి. దీన్ని ఏజన్సీ ప్రాంతం అంటారు. కాకినాడనుంచి వందకిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.
జలపాతాలు సమీపంలో సేదతీరడం, అడవిదారుల్లో నడక, రోడ్డు వారగా కాఫీతోటల్లో నిర్వహిస్తున్న కెఫ్టేరియాలో కాఫీ చప్పరిస్తూ పచ్చదనాన్ని అస్వాదించడం, అడుగడుగునా కనిపించే మన్యప్రజల ముఖకవళికలని గమనించడం, ఎత్తైన వందల సంవత్సరాల వయసుకలిగిన చెట్ల నడుమనుంచి ఏటవాలుగా నేలపైన వాలుతున్న సూర్యకిరణాలని ఆహ్లాదించడం, గోల్డెన్ బ్యాంబూ అనే బంగారు పసుపు వర్ణపు వెదురు మొక్కలనిగురించి ఎవరినైనా అడిగి తెలుసుకొని ఆసక్తిగా వినడం, పక్షుల కూతలు వింటూ, ఉడతల చేష్టలు గమనిస్తూ పరిసరాలను మరచిపోవడం... ఈ ట్రిప్‌లో చేయగలిగిన పనులెన్నో!
దేవీ పట్నంలో పాపికొండలను ఒరుసుకొంటూ ప్రవహిస్తున్న గోదావరి, వచ్చి పోతున్న లాంచీలు, గోదావరి గట్టుమీద కొండ, దానిపైకి మెట్లదారి, దేవాలయము, కొండమీదనుంచి కనిపించే పొలాలు, పచ్చ పచ్చని దృశ్యాలు....
రామన్న పాలెం దగ్గర వైరుతో కట్టిన రోప్ బ్రిడ్జ్
ఇంకా పురాతన మందిరాలు, గైడు ద్వారా తెలుసుకొనే అడవితల్లి విశేషాలు, ప్రయాణంలో పదనిసలు....
ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసే బ్యాంబూ చికెన్ గురించి చాలా దూరప్రదేశాలనుంచి కూడా వస్తున్నారు. మారేడుమిల్లిలో ఒక కొండమీద హిల్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ని నిర్మించారు. అక్కడ నుంచి మొత్తం గ్రామం అంతా కనిపిస్తుందని, గెస్ట్‌హౌస్‌లో విడిది చేస్తే చాలా బాగుంటుందని గైడ్ చెప్పాడు. కానీ, అక్కడికి వెళ్ళి చూడలేక పోయాం. కారణం, సమయాభావం. టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు, అటవీశాఖ వాళ్ళూ కొన్ని పార్కులు, వన సంరక్షణా ప్రదేశాలు అభివృద్ది చేస్తూ ఉన్నారు.
మధన కుంజ్, నందన వనం, వాలీసుగ్రీవ వనం, కార్తీక వనం లాంటి వనాలని, జంగిల్ స్టార్ లాంటి కేంప్ సైట్లని ఒక రెండు సంవత్సరాలక్రితం మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు చూసాం.
జ్ఞాపకాలని అన్నింటినీ వర్ణించడం సాధ్యంకాదు. కాబట్టి ఫోటోలే చూపించడం జరిగింది. ఇవి బ్లాగ్ కోసం తీసినవి కాదు కనుక వీటిల్లో మేమందరం ఉన్నాం.
కాంక్రీట్ జంగిల్‌లోంచి తప్పించుకొని, వనవిహారం చెయ్యడానికి ఓ రెండు మూడు గంటల ప్రయాణం పెద్ద ప్రయాశ కాకూడదు. అందుకే పిల్లలు చిన్నవాళ్ళయినా వీలు చూసుకొని బయలుదేరాం. ఇది ఓ పది సంవత్సరాల క్రిందటి మాట. రంపచోడవరంలో ఓ అంకుల్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంటులో పనిచేస్తూ ఉండేవారు. వాళ్ళని విజిట్ చెయ్యవలసిని ఆబ్లిగేషన్ కూడా ఉండడంతో, వాళ్ళింటి దగ్గర రెండురోజులు స్టే చేసి, చుట్టుప్రక్కల ప్రదేశాలు చూడాలని నిర్ణయించుకొన్నాం. డిజిటల్ కెమేరాల హవా మొదలవ్వలేదు కనుక ఒక నాలుగు కలర్ ఫిలిం రీళ్ళు కొనుక్కొని, ఒక చిన్న కెమేరా వెంటపెట్టుకొని వెళ్ళాం. ఈ పోస్టులో కనిపించే ఫొటోలన్నీ అప్పుడు తీసినవే. క్లారిటి అంత బాగా ఉండదు. కొండదారుల్లో, జలపాతాలదగ్గర వాలు రోడ్లలో బాగుంటుందని ఒక మహీంద్రా జీప్ మాట్లాడుకొన్నాం. అదృష్టవశాత్తూ జీప్ డ్రైవర్ అదే ప్రాంతానికి చెందిన ట్రైబల్ అవడంతో గైడ్‌లా కూడా ఉపయోగపడ్డాడు. అతను చెప్పిన విషయాలలో ముఖ్యమైంది తూర్పు గోదావరి ఏజన్సీలో పుట్టిన కొమ్ముడోళ్ళు అనే సాంస్కృతిక నృత్యం గురించి. ఎద్దు కొమ్ములు, నెమలి ఈ కలతో చేసిన టోపీ ధరించి, పెద్ద డోలు మెడలో వేసుకొని దరువు వేస్తూ, నృత్యం చేస్తారు. మహిళలు చేయీ, చేయీ పెనవేసి అర్థ చంద్రాకారంలో ఏర్పడి లయబద్దాంగా కాళ్ళు ముందుకీ, వెనుకకీ కదిలిస్తూ, పాటపాడుతూ నృత్యం చేస్తారు.
ముఖ్యమైన ప్రదేశం మారేడుమిల్లి. సముద్రమట్టానికి 2000 అడుగుల ఎత్తులో ఉంటుంది. దట్టమైన అడవులు, చల్లని వాతావరణంతో, కాఫీతోటలు, తోటల్లో ఎత్తైన వృక్షాల మొదళ్ళనుంచు పైదాకా ఎగబ్రాకిన మిరియాల పాదులతో మనోహరంగా ఉంటుంది. దీనిని ఆంధ్రా ఊటీ అని కూడా పిలుస్తారు.
కొండల నడుమనుంచి, అడవిలో పాములా మెలికలు తిరుగుతూ గలగల శబ్ధాలతో ఉదృతంగా ప్రవహించే ఏరు, పాములేరు. తూర్పు కనుమలలో ఎక్కడో పుట్టి, ప్రకృతి ప్రేమికులకు మనోల్లాసం కలిగిస్తూ, జంతు, వృక్ష జాలాలకి నీటి అవసరాల తీరుస్తూ తూర్పుగోదావరి, ఖమ్మం జిల్లాల సరిహద్దులో గోదావరిలో కలుస్తున్న పాములేరు పిక్నిక్ స్పాట్‌గా చాలా ప్రాధాన్యత సంతరించుకొంది.
జలపాతాలు సమీపంలో సేదతీరడం, అడవిదారుల్లో నడక, రోడ్డు వారగా కాఫీతోటల్లో నిర్వహిస్తున్న కెఫ్టేరియాలో కాఫీ చప్పరిస్తూ పచ్చదనాన్ని అస్వాదించడం, అడుగడుగునా కనిపించే మన్యప్రజల ముఖకవళికలని గమనించడం, ఎత్తైన వందల సంవత్సరాల వయసుకలిగిన చెట్ల నడుమనుంచి ఏటవాలుగా నేలపైన వాలుతున్న సూర్యకిరణాలని ఆహ్లాదించడం, గోల్డెన్ బ్యాంబూ అనే బంగారు పసుపు వర్ణపు వెదురు మొక్కలనిగురించి ఎవరినైనా అడిగి తెలుసుకొని ఆసక్తిగా వినడం, పక్షుల కూతలు వింటూ, ఉడతల చేష్టలు గమనిస్తూ పరిసరాలను మరచిపోవడం... ఈ ట్రిప్‌లో చేయగలిగిన పనులెన్నో!
దేవీ పట్నంలో పాపికొండలను ఒరుసుకొంటూ ప్రవహిస్తున్న గోదావరి, వచ్చి పోతున్న లాంచీలు, గోదావరి గట్టుమీద కొండ, దానిపైకి మెట్లదారి, దేవాలయము, కొండమీదనుంచి కనిపించే పొలాలు, పచ్చ పచ్చని దృశ్యాలు....
రామన్న పాలెం దగ్గర వైరుతో కట్టిన రోప్ బ్రిడ్జ్
ఇంకా పురాతన మందిరాలు, గైడు ద్వారా తెలుసుకొనే అడవితల్లి విశేషాలు, ప్రయాణంలో పదనిసలు....
ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసే బ్యాంబూ చికెన్ గురించి చాలా దూరప్రదేశాలనుంచి కూడా వస్తున్నారు. మారేడుమిల్లిలో ఒక కొండమీద హిల్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ని నిర్మించారు. అక్కడ నుంచి మొత్తం గ్రామం అంతా కనిపిస్తుందని, గెస్ట్‌హౌస్‌లో విడిది చేస్తే చాలా బాగుంటుందని గైడ్ చెప్పాడు. కానీ, అక్కడికి వెళ్ళి చూడలేక పోయాం. కారణం, సమయాభావం. టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు, అటవీశాఖ వాళ్ళూ కొన్ని పార్కులు, వన సంరక్షణా ప్రదేశాలు అభివృద్ది చేస్తూ ఉన్నారు.
మధన కుంజ్, నందన వనం, వాలీసుగ్రీవ వనం, కార్తీక వనం లాంటి వనాలని, జంగిల్ స్టార్ లాంటి కేంప్ సైట్లని ఒక రెండు సంవత్సరాలక్రితం మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు చూసాం.
జ్ఞాపకాలని అన్నింటినీ వర్ణించడం సాధ్యంకాదు. కాబట్టి ఫోటోలే చూపించడం జరిగింది. ఇవి బ్లాగ్ కోసం తీసినవి కాదు కనుక వీటిల్లో మేమందరం ఉన్నాం.
© Dantuluri Kishore Varma
మంచి ప్రయాణం చేశారు,మమ్మల్నీ మీతో తీసుకెళ్ళిపోయారు.
ReplyDeleteok sir, chala bagundi. nenu aa agency pranta maina donkarayilo telugu pandit gaa pani chesanu sumaru 15 samvatsaraalu .aa pranta mantaa chala saarlu tirigina vaanne .ok bye
ReplyDeleteఫోటోలు చాలా అద్భుతంగా వున్నాయి...మీరు మీ శ్రీమతి,మీ పాపతో వున్న ఫోటోల్లోని వెనుక చెట్లు..ప్రకృతి దృశ్యాలు రవి వర్మ వేసిన ఫేయింటింగ్ ల్లా వున్నాయి..ఇంతమంచి పోస్ట్ ని ఇంగ్లీష్ లోకి ఎందుకు అనువదించి ఇంకా ఎక్కువమందికి చేరువ చేయకూడదు..? Anyway came back with startling nostalgia.....Cheers...!
ReplyDeleteబాగుందండి .చాలా బాగున్నాయి ఫోటోలు
ReplyDeleteశర్మగారు, సుబ్బారావుగారు, మూర్తిగారు, రాధిక గారు - టపాని మెచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
ReplyDeleteమారేదుమిల్లి గురించి చదువుతుంటే నా బాల్యం ఙ్ఞాపకం వస్తూంది. నేను పుట్టి పెరిగింది గిరిజన ప్రాంతంలోనే.గిరిజనప్రాంతం లో చూడదగిన విశేషాల గురించి నా బ్లాగ్లో త్వరలో వ్రాస్తా. .
ReplyDeleteమీ టపా చూసాను మానసవీణగారు. గిరిజనుల అప్పటి ఆహారపు అలవాట్లు గురించి తెలుసుకొంటే ఆశ్చర్యంగా ఉంది.
ReplyDelete