తిరుమలలో వేంకటేశ్వరస్వామి ఆలయంలోనికి తీసుకొని వెళ్ళేది మహాద్వార గోపురం. దానికి అభిముఖంగా ఉన్న వీధిని సన్నిదివీధి అంటారు. భక్తులని స్వామి సన్నిదిలోనికి తీసుకొని వెళుతుంది కనుక దానికి ఆ పేరు. సన్నిది వీధికి ఆ చివర బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. మహాద్వారం వైపు తిరిగి ముకుళించిన హస్తాలతో ఉన్న ఆంజనేయుని ముర్తి ఉంటుంది ఈ ఆలయంలో. ఆంజనేయుని తల్లి అంజనీదేవి కుమారుడి ఆగడాలను ఆపడానికి బేడీలు వేసి స్వామికి ఎదురుగా నిలబెట్టిందని, అందుకే ఆయనకి బేడి ఆంజనేయుడని పేరు వచ్చిందని కొందరు అంటారు. ఇంకొక కథను అనుసరించి `బేడు` అనేది కన్నడ మాట అని; మన తెలుగులో దేవుడిని కొలవమనడానికి `వేడు(కో)` అనే మాటను ఎలా ఉపయోగిస్తామో కన్నడంలో `బేడు` ను అలా ఉపయోగిస్తారని; ఆంజనేయుడు తన ముకుళించిన హస్తాలను భక్తులకు ఉదాహరణగా చూపిస్తూ అట్లానే స్వామిని వేడుకో మంటున్నాడని; అందుకే ఆయనకి బేడి ఆంజనేయుడని పేరు వచ్చిందని అంటారు. కథమాట ఎలా ఉన్నా శివుని ఆలయానికి అభిముఖంగా నంది ఉన్నట్టే, విష్ణుమూర్తి ఆలయానికి అభిముఖంగా గరుడుడు కానీ, ఆంజనేయుడు కానీ ఉండాలి. అందుకే ఇక్కడ బేడి ఆంజనేయుడు ఉన్నాడు. కొండపైకి వచ్చిన భక్తులు హనుమంతునికి హారతులు ఇచ్చి, కొబ్బరి కాయలు కొడతారు.
|
బేడి ఆంజనేయ స్వామి ఆలయం |
|
హారతులు ఇచ్చి, కొబ్బరి కాయలు కొడతారు. |
|
ఎదురుగా కనపడే మహాద్వారం |
|
దూరం నుంచి |
|
షాపింగ్ సెంటర్ గుడికి చేర్చి ఉంది |
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment