ఒక్కో ఫోటోని క్లిక్ చేస్తే తిరుమలకి సంబంధించిన ఒక్కో పోస్ట్ వస్తుంది.
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు
కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు
శోభారాజు ఆలపించిన అద్భుతమైన అన్నమయ్యకీర్తన ఇదిగో..
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
© Dantuluri Kishore Varma
kishore gaaru,
ReplyDeletemee tirumala yaatra chusi ento anandam gaa undi. aa bhagyam naakeppudaa ani manasu asaga eduru chustondi.
కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
Deleteకరుణించి తనయెడకు రప్పించిన వాడు -
అన్నాడు కదా అన్నమయ్య.
తప్పనిసరిగా మీకు కూడా తొందరలోనే శ్రీనివాసుని దర్శనం అవుతుంది.