మడ అడవులు కాకినాడకి సమీపంలో కోరింగ వద్ద ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద మడ అడవులు కొరింగ మాంగ్రూవ్ ఫారెస్ట్. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నయి. దీనిని అభయారణ్యం గా గుర్తించారు.
నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో మడ అడవులు పెరుగుతాయి. సముద్రతీర ప్రాంతాలలో భూభాగం క్రమంగా సముద్రంలో కలసిపోవడం(సాయిల్ ఎరోజన్), గ్లోబల్ వామింగ్ ప్రభావం వలన సముద్రమట్టం పెరిగి తీరప్రాంతాలు మునిగిపోవడం వంటి ప్రమాదాలనుంచి మడ అడవులు కవచంగా ఉండి తీరానికి రక్షణ కల్పిస్తాయి. సముద్రానికి, తీరానికి మధ్య ఇవి షాక్ అబ్జాబర్లలాగ ఉపయోగపడతాయి. తీర ప్రాంతానికి ఏ విధమైన మానవ నిర్మిత కట్టడాలు ఇవ్వలేని రక్షణని మడ అడవులు ఇస్తాయి.
జీవన వైవిధ్యం(బయోడైవర్సిటీ)ఈ అడవులవల్ల బాగా సంరక్షించడానికి అవకాశం వుంటుంది. ముఖ్యంగా సముద్రజలాలలో పెరిగే రొయ్యలు, చేపలు, మిగిలిన జీవజాలం అభివృద్ధి చెందుతుంది. సీ ఆటర్స్ (otter) అనబడే నీటి జంతువులు ఇక్కడ పెద్దసంఖ్యలొ కనిపిస్తాయి.
తెల్ల కొంగలు, అరుదుగా వలస పక్షులు (migratory birds) కనిపిస్తాయి.
Photo: The hindu business line
సుమారు ఒక కిలోమీటరు పొడవయిన చెక్కల వంతెన ఇక్కడి ప్రత్యేకత. చిత్తడినేలలొ పెరిగే చెట్లయొక్క వేర్ల వ్యవస్త భిన్నంగా ఉంటుంది. భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్ తీసుకొనే అవకాసం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి. అందుకే ఇక్కడి చెట్లు ఊడలని పోలిన వేర్లను కలిగి ఉంటాయి. కోరంగి అడవిలో నిర్మించిన చెక్కల వంతెనవల్ల ఈ విషయాలను గమనించడానికి అవకాశం ఉంటుంది.
వర్షాకాలం వెళ్ళిన తరువాత అక్టోబర్ నుంచి మే వరకు కోరింగ అభయారణ్యాన్ని సందర్సించడానికి అనువయిన సమయం. బోట్లమీద మడ అడవుల గుండా సముద్రం వరకూ సుమారు 30 నిమిషాల సేపు ప్రయాణించగలిగే సౌకర్యం కూడా ఇక్కడ ఉంది.
బయోడైవర్సిటీని ప్రత్యక్షంగా చూపడానికి, విజ్ఞానాన్నీ, వినోదాన్నీ ఒకే చోట పొందడానికి ఎకో టూరిజం - మడ అడవుల సందర్శన.
కలర్ ఫుల్ బోట్లు, చిత్తడినేలలు, సముద్రపుగాలి...You can have great time!
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment