గాంధీగారు కాకినాడ వచ్చిన సందర్భానికి గుర్తుగా 1950 లో గాంధీ మందిరం నిర్మించారు, తరువాత పాత భవనం స్థానంలో 2008లో ప్రస్తుతం ఉన్న భవనాన్ని నిర్మించారు.సాంబమూర్తి నగర్ ఓవర్ బ్రిడ్జికి దగ్గర, మునిసిపల్ ఆఫీస్ వెనుకవైపు `గాంధీ మందిరం` ఉంది.
మొదటిలో ప్రపంచం నిన్ను గుర్తించదు, తరువాత నిన్ను చూసినవ్వుతుంది, నీమీద యుద్దంచేస్తుంది. కానీ చివరికి నువ్వే గెలుస్తావు అంటాడు గాంధీజీ.
ప్రతీ అడుగులోనూ గాంధీగారు చెప్పిన సక్సెస్ మంత్రాన్ని జ్ఞాపకం చేసుకొందాం. మన పనికి గుర్తింపులేదని నిరుత్సాహపడినా, నవ్వారని చిన్నబుచ్చుకొన్నా, ప్రతికూల పరిస్థితులని సృస్టించారని పారిపోయినా పరాజితులమౌతాం. ఏపనిచేస్తూఉన్నా గెలుపుమీద దృష్టినిలిపి, గాంధీజీ మాటలని జ్ఞాపకం ఉంచుకొని, ముందుకు సాగితే ధృఢనిశ్చయం కలుగుతుంది. విజయం మన సొంతమౌతుంది.
నూలుఒడుకుతున్న గాంధీగారి కాంస్య విగ్రహం, ఆయన జీవితంలో ముఖ్యమైన సంఘటనల్ని తెలియజేసే ఫొటోగ్రాఫులు, పోట్రైట్లు ఉంచారు.
మహాత్ముని ఆటోబయోగ్రఫీ `స్టోరీ ఆఫ్ మై ఎక్ష్పెరిమెంట్స్ విత్ ట్రూత్` చదువుతున్నప్పుడు, ఆపుస్తకంలో మనం చూడని ఫోటో లు మనకి ఇక్కడ కనిపిస్తాయి.
పచ్చని లాన్తో, గార్డెన్తో జనసమ్మర్ధం ఎక్కువగా ఉండని గాంధీ మందిరం దగ్గర కొంతసేపు మహాత్ముని ఆదర్శాలని, సత్యనిష్ఠని జ్ఞాపకం చేసుకొంటే బాగుంటుంది.
100 మందీ, 200 మందీ పట్టే రెండు మీటింగ్ హాల్స్ ఉన్నాయి. పెళ్ళిల్ల లాంటివి కాకుండా మిగిలిన గెట్ టుగేదర్లకి ఈ మీటింగ్ హాళ్ళని నామమాత్రపు అద్దెకి ఇస్తున్నారు. లైబ్రరీ కూడా ఉంది.
ప్రతీరోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 6 గంటలవరకూ మందిరం మరియూ లైబ్రరీలు తెరుస్తారు. శుక్రవారాలు శెలవు.
రఘుపతి రాఘవ రాజారాం
పతీత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరోనాం
సబ్ కో సన్మతి దే భగవాన్
మహాత్మా గాంధీ జీవితచరిత్ర అయిదు గంటల నిడివి గల డాక్యుమెంటరీ ఇక్కడ చూడండి
© Dantuluri Kishore Varma
very happy to see photos of Gandhi mandir in kkd and i really impressed for the rare pic of Gandhi(1913) and on chanting Gandhi's favourite song my heart really filled with happiness and more
ReplyDeletethankyou sir........