Pages

Saturday, 25 August 2012

పవర్ కట్

గవర్నమెంట్ మాంత్రికుడు(గ.మా) రక్తపిశాచి(ర.పి)ని సృష్టించాడు. అప్పటికే అక్కడ ముందు సృష్టించిన పిశాచాలు చాలా ఉన్నయి.

ర.పి: నన్నెందుకు పిలిచారు?

గ.మా: ప్రజలకి నిద్ర, సుఖం ఉండడానికి వీలులేదు. చిన్నపిల్లలు హాయిగా ఆదమరచి నిద్రిస్తున్నప్పుడు, వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు. కరెంటు కట్ చెయ్యి. దోమలతో, ఉడుకుతో, నిద్రిలేమితో ప్రజలు అష్టకష్టాలు పడాలి.

ర.పి: రోజుకి ఎంతసేపు, ఏ సమయాలలో వాళ్ళని టార్చర్ చెయ్యాలి?

గ.మా. పిశాచాలకి సమయాసమయాలు ఉండవు.

ర.పి: ఇది ప్రజాస్వామ్యం. మనం ఏమి చేస్తున్నమో ప్రజలు తెలుసుకోవచ్చు. రైట్ టు ఇంఫర్మేషన్ ఆక్ట్ ఉందికదా? ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీసుకి ఫోన్ చేసి కరెంటు ఎప్పుడు ఇస్తారని ప్రాణాలు తోడేస్తారు.

గ.మా: డోంట్ వర్రీ. `దిస్ లైన్ ఈజ్ బిజీ` అనే మెసేజ్ సెట్ చేసుకో. ఫోన్లు చేసిచేసి విసుగెత్తి పోవాలి.

ర.పి: మనల్ని బండబూతులు తిట్టుకొంటారు.

గ.మా: హ..హ..హా.. వాళ్ళ తిట్లే మనకు దీవెనలు.

ర.పి: ఇంకొక్క చివరి డౌట్. ఇంతమంది రక్త పిశాచులు ఆల్ రెడీ ఉన్నరుకదా, మళ్ళీ నేనెందుకు?

గ.మా: డొంట్ బి ఫూలిష్! ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళదే! ఇప్పటికే ఆలస్యమైంది. మన మస్కిటో ఫ్రెండ్స్ రక్త తర్పణ కోసం ఆహాకారాలు చేస్తున్నయి. గో అండ్ కట్ పవర్. హర్రీ అప్!
(ఆంధ్రాలో పవర్ కట్ ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది. సిటీ, టౌన్, విలేజ్ అనే తేడా లేకుండా రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ కరెంట్ కట్ చేస్తున్నారు. వేసవి వెళ్ళి వర్షాకాలం వచ్చినా ఈ పరిస్థితిలో మార్పు లేదు. రాత్రి, తెల్లవారుజాము పవర్ కట్స్ వల్ల పిల్లలు, ముసలివాళ్ళు దోమలతొ, నిద్రలేమితో అష్టకష్టాలు పడుతున్నరు. స్టూడెంట్స్ హోంవర్కులు చేయ్యలేక, పరీక్షలకి తయారవలేక అవస్థపడుతున్నరు. చాలా ఇండస్ట్రీలు ప్రొడక్షన్ తగ్గించుకొంటే, మరికొన్ని మూతపడుతున్నాయి. వాటర్ మోటారులమీద ఆధారపడిన వ్యవసాయ పొలాలకి నీరందడం లేదు. ఉద్యోగస్తులు ఆఫీసుల్లో ముందురాత్రి కోల్పోయిన నిద్రని భర్తీ చేసేపనిలో ఉన్నారు. కరెంట్ కట్ అంటే అందరికీ షాకే! )
© Dantuluri Kishore Varma

4 comments:

  1. వరమ గారు అదృష్టవంతులు, ఎనిమిది గంటలకే అలా అనుకుంటే పద్నాలుగు గంటలు రాత్రి పగలు తేడా లేకుండా మా పల్లెలలో పీకేస్తూ ఉంటే.....గోవిందా! గోవిందా!!గోవిందా!!!

    ReplyDelete
  2. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడయినా పరిస్థితి అలాగే ఉంది కష్టేఫలి గారు. ప్రభుత్వం, ప్రజలూ ప్రత్యామ్నాయ విద్యుత్ వుత్పత్తి మార్గాలమీద దృష్టి పెడితే బాగుంటుంది. మొన్న, అనంతపురం జిల్లాలో ఒక ఊరు పూర్తిగా సోలార్ పవర్ తో విద్యుదీకరణ చేసుకొని వార్తల్లో ప్రముఖంగా వచ్చింది. ఉపకరణాలకి అయిన ఖర్చులో 50శాతం బ్యాంకులు అప్పుగా ఇస్తే, 40శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. మిగిలిన 10సాతం లబ్దిదారులు సమకూర్చుకొని ఇప్పుడు సోలార్ బ్యాటరీలతో, ఇన్వెర్టెర్లతో 24గంటలూ నిరవదిక విద్యుత్ వెలుగులతో ఆనందిస్తున్నారట.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!