మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా కురియన్‌తో ఇందిరాగాంధీ ఒక మాట అన్నారట. `మా ఫాంలో ఆవు పాలు అమ్మితే చాలా తక్కువ ధర, అవే ఢిల్లీలో కొందామంటే మూడురెట్లు ఎక్కువ. ఎందుకు?` అని. ఇప్పటికీ పరిస్థితి మారలేదు. పైపెచ్చు మరింత అధ్వాన్నంగా తయారయ్యింది. పాలే కాదు, వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా అలానే ఉన్నాయి. ధరలలో ఈ తేడా ఎవరి జేబుల్లోనికి వెళుతుంది? పండించిన వ్యవసాయదారుడు అమ్ముదామంటే అడివి, మధ్యతరగతి వాడు కాయగూరల కొందామని మార్కెట్టుకి వెళితే కొరివి. రైతు దగ్గర కొని మార్కెట్‌లో అమ్మే మధ్యదళారీలు బాగుపడుతున్నారు.
వినియోగదారులు తోటల దగ్గరకి వెళ్ళి నేరుగా రైతుల దగ్గరనుంచి కావలసిన కాయగూరలు కొనుక్కోవాలి. లేదంటే రైతులే వాళ్ళ పంటని వినియోగదారుల దగ్గరకి తీసుకొని రావాలి. అప్పుడు ఈ రెండువర్గాల వాళ్ళూ లాభపడతారు. కానీ అలా జరిగే అవకాశం ఉందా?
కాకినాడ నుంచి పిఠాపురం మీదుగా కత్తిపూడి వెళ్ళే దారిలో గొల్లప్రోలు దాటిన తరువాత ఎడమచేతి వైపు తాటిపర్తి వెళ్ళే రోడ్డు తగులుతుంది. అది ధర్మవరం దగ్గర ఐదవనంబరు జాతీయ రహదారిని కలుస్తుంది. ఈ మార్గంలో రోడ్డుకి ఇరువైపులా సారవంతమైన భూముల్లో చాలా మంది రకరకాల కాయగూరలని పండిస్తున్నారు. కాకినాడ నుంచి మా స్వంత ఊరు రాచపల్లికి ఈ మార్గంలోనే వెళుతుంటాం అప్పుడప్పుడూ. ఊరినుంచి తిరిగి వచ్చేటప్పుడు రోడ్డుకి ప్రక్కన గోనెపట్టాలు పరిచి వాటిపైన తాజా కాయగూరలని పేర్చి అమ్ముతూ కనిపిస్తూ ఉంటారు రైతులు. టొమాటాలు, బెండకాయలు, గోంగూర లాంటివి నవనవలాడుతూ ఉంటాయి. ధరలు భహు తక్కువ. రైతు బజారులో పాతికరూపాయలు అమ్మే బీరకాయలు ఇక్కడ పదిరూపాయలకే దొరుకుతూ ఉంటే ఆశ్చర్యపోతాం. పల్లెలకి దూరంగా ఉండి ఎంత నష్టపోతున్నామో తెలిసి వస్తుంది. కానీ ఏం చేస్తాం? ప్రతీరోజూ ఇంత దూరం వచ్చి కొనుక్కోలేం కదా?
ఈ రోజు న్యూస్‌పేపర్లలో అంతగా ప్రాముఖ్యత లేని మూలలో ఒక చిన్న వార్త ప్రచురితమైంది. పై ఊళ్ళల్లో కాయగూరల రైతులు హార్టీకల్చర్ డిపార్ట్‌మెంటు నుంచి కొంత సబ్సిడీ తీసుకొని ఓ ఐదు లక్షల విలువైన వేన్ కొనుగోలు చేసుకొన్నారు. దానికి గ్రీన్‌వేన్ అని నామకరణం చేశారు. వాళ్ళ పొలాల్లో పండిన కాయగూరలని వేన్‌లో వేసుకొని దగ్గరలో ఉన్న పిఠాపురానికీ, గొల్లప్రోలుకీ తీసుకొని పోతున్నారు. క్రమంగా కొంచం పెద్ద పట్టణాలకి కూడా విస్తరిస్తారు. మార్కెట్ ధరల కంటే తక్కువకి తాజా కాయగూరలు గ్రీన్ వేన్‌లో వచ్చి ఇంటి ముందు నిలబడితే కొనుక్కోకుండా ఉంటామా? మనకి లాభమే కదా? అమ్మే రైతులకీ లాభమే.
వాహ్వా, ఏమి ఐడియా!
Photo: The Hindu |
© Dantuluri Kishore Varma
Graet Idea..!
ReplyDeleteWonderful way to help the formers and the consumers. If they start going too far, adding trasportation costs and bring in lesser quality of the goods then..might turn in to mainstream business hwo it is now.
If the vans do not travel too far from the forms, it can be very successful.
Sreedevi
I too agree to your point Sridevi garu. Let us hope that it turns out to be a win - win situation for the farmers and consumers. Thanks for your opinion.
Deleteఐడియా బాగుంది.
ReplyDeleteనగరాలలోని ఒకో పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ వాళ్ళు, లేదా ఒకో కాలనీ వాళ్ళు ఒకో పల్లెను దత్తత తీసుకుని అక్కడనుండే కూరగాయలను కొంటే ఇంకా ఉపయోగకరం.
అయినా రైతు బజార్లు పెట్టింది ఇందుకే కదండి.
మీరు చెప్పిన పాయింట్ బాగుంది బోనగిరిగారు. పెళ్ళిళ్ళకీ, ఫంక్షన్లకీ కూడా టోకున వీళ్ళ దగ్గరనుంచి తెప్పించుకోవచ్చు.
Deleteరైతు బజారులో సరుకు ధర నిర్ణయించే అధికారం రైతులకు లేదు. కానీ ఈ గ్రీన్ వేన్ వాళ్ళకి ఉంది.
baavundanDi ..Radhika (nani)
ReplyDeleteథాంక్స్ రాధిక గారు.
Delete