తొలి తిరుపతి అని పిలిచే వేంకటేశ్వరస్వామి గుడికి ఎలా వెళ్ళాలో దారి తెలియదు. `పలానా కిర్లంపూడి దాటిన తరువాత దివిలికి దగ్గరగా ఉంటుంది. చాలా పురాతనమైన గుడి. ఎవరిని అడిగినా దారి చూపిస్తారు,` అని చెప్పారు ఎవరో. కిర్లంపూడి ఊరు తగిలిన దగ్గరనుంచి అక్కడక్కడా జనాలని `వెంకన్నబాబు గుడికి దారెటు?` అని అడుగుతూ, వాళ్ళు చూపించిన వైపుకి పోయాం. కొంతసేపటికి రంగులు వెయ్యని పాతగా కనిపిస్తున్న ఓ గుడిని చేరుకొన్నాం. నిజానికి అది మేం వెతుకుతున్న తొలితిరుపతి కాదని తెలియదు. తూర్పుగోదావరిజిల్లా కిర్లంపూడి మండలంలో చిల్లంగి అనే ఊరు. దేవాలయం ప్రశాంతంగా ఉంది. గుడిమీద బొమ్మలు కళాత్మకంగా, నాజూకుగా ఉన్నాయి. గుడిప్రక్కనే ఉన్న ఇంటిలోనుంచి పూజారిగారు వచ్చి, గర్భగుడి తలుపులు తీశారు. మంచి దర్శనం అయ్యింది. ఇక్కడి నుంచి వివరం తెలుసుకొని తొలి తిరుపతికి కూడా వెళ్ళామనుకోండి(ఆ పోస్టు ఇదిగో ఇక్కడ చదవండి).
చిల్లంగి గుడి ఫోటోలు చూడండి.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment