Wednesday, 18 June 2014

నాతో దేవాలయం వీధిలో నడచి వస్తే...

దేవాలయం వీధిలో నడిపిస్తూ తీసుకొని పోయి అక్కడక్కడా కొన్ని విశేషాలని చూపిద్దాం అనుకోంటున్నాను. నాతో పాటూ నడుస్తారా? అయితే పదండి. మొట్టమొదటిగా ఓం నమశివాయ: అనుకొని పెద్ద శివాలయాన్ని చూడండి. తిలక్ వీధికి ఎదురుగా ఉంటుంది ఇది. తిలక్ వీధి గురించి తెలుసా మీకు? శేట్‌ల షాపులు ఉంటాయి ఈ వీధిలో. రెడీమేడ్ బట్టలు, పెర్‌ఫ్యూంలు, సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్ముతారు. `నచ్చితే తీసుకో, ధరమాత్రం తగ్గించేది లేదు,` అని వాళ్ళు చెపితే  చచ్చినట్టు కొనుక్కోవలసిందే. మరొక చోటుకు వెళ్ళి కొనుక్కొందాం అంటే, మరెక్కడా దొరకవు అలాంటి వస్తువులే! 
చూశారా, మాటల్లో పడి ఆంజనేయస్వామి ఆలయం దాటేశాం. అయినా మరేమీ పరవాలేదులెండి గుడికి వెనుక నుంచయినా ఒక స్నాప్ లాగుదాం.  
ఫుడ్ ఎసెన్స్, ఐస్క్రీం పౌడర్, టేస్టింగ్‌సాల్ట్, ఫుడ్‌ప్రిజర్వేటివ్స్ లాంటివి అమ్మే బాదం వాళ్ళ షాపులు దేవాలయం వీధిలోనే ఉన్నాయి.  వీధిలో ఈమధ్యన వరుసగా జ్యుయలరీ షాపులు ఓపెన్ చేశారు. అన్నట్టు గీతా మందిరం కూడా ఇక్కడే ఉంది. అవన్నీ దాటిన తరువాత వేణుగోపాలస్వామి గుడి, టీటీడీ కళ్యాణ మండపం ఉన్నాయి. వాటి సంగతి మరొక సారి చెపుతాను కానీ, ఇదిగో ఇలా చూడండి బాలాజీ చెరువుకు వచ్చేశాం.   
సామర్లకోట వైపు నుంచి వచ్చే బస్సులు, ఆటోలు ఇక్కడ ఆగుతాయి. కాకినాడ మెయిన్‌రోడ్డుకి వెళ్ళాలంటే ఇక్కడే దిగాలి. భానుగుడి జంక్షన్ లాగే బాలాజీ చెరువు కూడా ముఖ్యమైన జంక్షన్. ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎడమచేతి వైపుకు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ వైపుకు కాకుండా, కుడి చేతివైపుకి తీసుకొని వెళతాను. ప్రైవేట్ నర్సింగ్‌హోంలు, ఫైరాఫీసు, పెట్రోలు బంకులూ దాటి పిండాల చెరువు దగ్గరకి వచ్చాం. ఇదిగో ఈ మధ్యనే నిలబెట్టిన ఘంటశాల వెంకటేశ్వర రావు గారి విగ్రహం. 
పిండాల చెరువు ఎప్పుడూ గుర్రపు డెక్కతో నిండి ఉండేది. దాన్ని తొలగించి చుట్టు ఫెన్సింగ్ కట్టి, మధ్యలో ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరుడ్ని పెట్టేసరికి ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన అందం వచ్చింది. వెనుక త్రిపురసుందరి గుడి ఉంది. అమ్మవారికి పూలతో చేసే అలంకారం చూసి తీరవలసిందే.
పిండాల చెరువుకి ప్రక్కనే శ్రీరామచంద్రమూర్తి వారి గుడి ఉంది. 
నడచి, నడచి ఆయాసం వస్తుందా? అదిగో బాపూజీ ఆ వయసులో కూడా ఎంత వేగంగా నడచి వెళుతున్నారో చూడండి. రాజా పార్కులో విగ్రహం ఇది.
నూకాలమ్మ గుడి. ప్రతీ సంవత్సరం జాతర భలేగా జరుగుతుంది. మనఊళ్ళో మరొక ముఖ్య కూడలి. ఇంకొకసారి దీనిగురించి చెప్పుకొందాం. ఈ ట్రాఫిక్ లైట్ దగ్గర నుండి కుడి చేతి వైపుకి తిరిగి కొంచెం ముందుకు వెళదాం. టూటౌన్ జంక్షన్ వస్తుంది. ఇక్కడి నుంచి ఎడమకు తిరిగితే ఓవర్ బ్రిడ్జ్, కుడికి తిరిగితే మెయిన్‌రోడ్. 
బ్రిడ్జ్ ఎక్కుతూ ప్రక్కనే ఉన్న విష్ణాలయాన్ని కూడా చూసేయండి. 
ఇదేనండి ఓవర్బ్రిడ్జ్. దాటితే భానుగుడి జంక్షన్‌కి వెళతాం. దానిగురించి నిన్న చెప్పాను కదా? అయినా ముందుకి వెళదామా! వద్దులెండి. వెనక్కే వెళ్ళిపోదాం. ఏమంటారు?

© Dantuluri Kishore Varma 

14 comments:

 1. really... i felt that i am walking on the kakinada roads...really awesome..

  ReplyDelete
  Replies
  1. వసుధగారు ధన్యవాదాలు.

   Delete
 2. mi vivaranathmakamaina visleshana chala bhavundhi, పిండాల చెరువు abhivrudhilo nenu palupanchukunnaduku chandra babu naidu ki danyavadalu endukante ayana hayam lone memu e gudi sramadhanam chesam ma college tarupuna (pr college) i am recollecting those sweet memories ...thanks for your post....

  ReplyDelete
  Replies
  1. శ్రమదానం చేసి, పిండాలచెరువుని ఈ రకంగా అభివృద్ది చేసిన వాలంటీర్లలో మీరు కూడా ఉండడం అభినందనీయం. :)

   Delete
 3. మన కాకినాడని కళ్ళకి కట్టినట్టు చూపించారు.

  నిజం గా మన ఊరికి మనం రుణం తీర్చుకోలేం.

  ReplyDelete
  Replies
  1. నిజమే అనంత్‌గారు స్వంతఊరి ఋణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. మీ కామెంట్‌కి ధన్యవాదాలు.

   Delete
 4. mari sai baba gudi marchipoyaru

  ReplyDelete
  Replies
  1. అవునండి. సాయిబాబా గుడి ప్రస్తావన మిస్సయ్యింది.

   Delete
 5. Replies
  1. నాతో నడచి వచ్చినందుకు ధన్యవాదాలు రావు గారు. :)

   Delete
 6. మన కాకినాడని కళ్ళకి కట్టినట్టు చూపించారు.

  నిజం గా మన ఊరికి మనం రుణం తీర్చుకోలేం.

  ReplyDelete
  Replies
  1. అందుకే కదండి అన్నారు.. `ఈ నేలా.. ఈ నీరు` అని. మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 7. శ్రీ దంతులూరి కిషొర్ వర్మ గారికి నమస్కారములు. మీరు కాకినాడ గురించిన అన్ని విషయములు ఎంతో విపులంగా తెలుపుతున్నందులకు మీకు నా ధన్యవాదములు తెలుపుతున్నానండీ!

  ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!