Pages

Friday 14 November 2014

ఎంత ఎదిగినా మనలో చిన్నప్పటి మనం అలాగే ఉంటాం!

నిశ్చల తటాకంలో ప్రతిబింబించేలాంటి ముచ్చటైన జ్ఞాపకాలు 
జీవనదిలో అలల్లా తరంగితమయ్యే ఆహ్లాదకర జ్ఞాపకాలు
సముద్రంలో కెరటాల్లా విరిగిపడే ఉద్వేగపు జ్ఞాపకాలు
జలపాతంలో ఉరికురికిదూకే ధారల్లాంటి ఉన్మత్త జ్ఞాపకాలు... 
మీకున్నాయా?
నాకున్న కొన్ని జ్ఞాపకాలు, మీ జ్ఞాపకాల్లాంటివే అయ్యి వుండవచ్చు!  

  

 చిన్నప్పటి తీపిజ్ఞాపకాలు 
మన మదిలో మాటి మాటికీ మెదులుతూనే ఉంటాయి.
అవంటే మనందరికీ చెప్పలేనంత ఇష్టం
`నా చిన్నప్పుడేం జరిగిందో తెలుసా?` అని ఎవరైన చెప్పడం మొదలుపెడితే
చెవులప్పగించి వినని వాళ్ళు అరుదుగా ఉంటారు. 
`నాకూ ఇలాగే జరిగింది సుమా!` అని ఆశ్చర్యపోవడం కూడా సహజమే.
చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ రోజు వాళ్ళ, వాళ్ళ చిన్ననాటి ఫోటోలు 
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పెట్టి చాలా మంది మురిసి పోయారు.
కొంతమంది ప్రత్యేకంగా వీడియోలు తీసి అప్‌లోడ్ చేశారు. 
ఎంత ఎదిగినా మనలో చిన్నప్పటి మనం  అలాగే ఉంటాం!

Dantuluri Kishore Varma

2 comments:

  1. మీరు మన జిల్లాగురించి,కాకినాడ గురించి చాలా చక్కగా రాస్తున్నారు.త్వరలో మిమ్మల్ని తప్పక కలుస్తాను సర్!

    ReplyDelete
    Replies
    1. చౌదరిగారూ, చాలా సంతోషం. తప్పని సరిగా కలుద్దాం!

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!