Friday, 2 December 2016
Saturday, 26 November 2016
చూద్దాం ఏమి జరుగుతుందో.....
పెద్దాయన ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని పెద్దనొట్లు రద్దు చేసిపారేయ్యడంతో... ఆర్థికవ్యవస్థ ముందుకుపోతుందో, వెనక్కి పోతుందో తెలియని అయోమయ స్థితిలో పడిపోయాం.
`ఈ రోజుల్లో వందనోటుకి విలువెక్కడుంది..` అనుకొనేవాళ్ళని ఈ చిన్నినోటే తెల్లవారే సరికి తనకోసం క్యూల్లో నిలబెట్టించుకొంది.
కాలం చెల్లిన నోట్లు నిశ్సబ్ధంగా నిష్క్రమిస్తుంటే, కొత్తగా వచ్చిన రెండువేల నోట్లు `దమ్ముంటే మమ్మల్ని మార్చుకో చూద్దాం!` అంటున్నాయి. ఆచి తూచి ఖర్చుపెట్టడం అలవాటు తప్పిపోయిన వాళ్ళకి తప్పనిసరి పొదుపు తీరని తలనొప్పిలా తయారయ్యింది.
క్యూలో నుంచున్నా `ఈ కష్టానిదేముంది.. పరవాలేదులే` అనేవాళ్ళచేత `ఇదే పెద్ద కష్టం` అని నమ్మించాలని ప్రయత్నిస్తూ.. `ఇక్కడ డబ్బున్న వాడు ఒక్కడూ లేడు చూడు. వాళ్ళు ఎప్పుడో మార్చేసుకొన్నారు.` అంటున్నారు. మార్చుకొంటున్న వాడిది కష్టం... మార్చుకోలేకపోతున్న వాడిది మరీ పెద్ద కష్టం!
విపక్షం ఉక్రోషపడిపోతుంది. `చెత్తకుండీల్లో దొర్లుతున్న డబ్బు, అగ్నికి ఆహుతి అవుతున్న డబ్బు, నదుల్లో, డ్రయినేజీల్లో మునుగుతున్న డబ్బు, తనికీల్లో దొరుకుతున్న డబ్బు... ఓ లెక్కలోది కాదు. అసలు మొత్తాలన్నీ బంగారంలోకి, భూముల్లోకి, కంపెనీ పెట్టుబడుల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయినియ్యి` అనికూడా అంటుంది.
బ్లాక్ మనీ, అనెకౌంటెడ్ మనీ, లీగల్ మనీ, ఇల్లీగల్ మనీ... డబ్బుల్లో ఎన్నిరకాలో! కొత్త డబ్బుది ఏ రంగైనా, ఏ రూపామైనా.. ఇక ముందు చలామణీలో ఉండబోయేది తక్కువే. ప్రజల కొనుగోలు శక్తి సన్నిగిల్లుతుంది. వ్యాపారాలు నష్టాల్లో పడతాయి, రియల్ ఎస్టేట్ ధరలు నేలకి దిగి వస్తాయి, ఉద్యోగాలు ఊడిపోతాయి, జీడీపి తగ్గుతుంది, ఆర్థికమాధ్యం రావచ్చు,... ఇంకా ఇలాంటి చిట్టా చాలా ఉంది.
నాణానికి రెండోవైపు చూస్తే, డిమోనిటైజేషన్ వల్ల ఖజానాకు రాజమార్గంలో తిరిగి వస్తుందని భావిస్తున్న లక్షల కోట్ల రూపాయలతో దేశాన్ని రామరాజ్యంగా మార్చవచ్చట!
నాణానికి రెండోవైపు చూస్తే, డిమోనిటైజేషన్ వల్ల ఖజానాకు రాజమార్గంలో తిరిగి వస్తుందని భావిస్తున్న లక్షల కోట్ల రూపాయలతో దేశాన్ని రామరాజ్యంగా మార్చవచ్చట!
ఏదేమయినప్పటికీ...ఆట మంచి రసపట్టులో ఉంది. ప్రపంచం అంతా ఆసక్తిగా మనవైపే చూస్తుంది.గెలుస్తామో, ఓడిపోతామో... చూద్దాం ఏమి జరుగుతుందో.....
© Dantuluri Kishore Varma
Tuesday, 18 October 2016
Learn as if you were to live forever
These golden words have been selected, designed in the form of think posters, framed and hung on the walls of the school. Our students can see them and get inspired everyday. These same words might ignite new thoughts in someone somewhere. Hence I am sharing them here.
© Dantuluri Kishore Varma
Monday, 17 October 2016
Thursday, 29 September 2016
సమయం ఎంచుకొని కొట్టాలి!
కమర్షియల్ సినిమాలో క్లైమాక్స్ సీన్ జరుగుతూ ఉంటుంది...నేల ఈనినట్టు గూండాలు కథానాయకుడి మీద తెగబడుతూ ఉంటారు.
`ఒరేయ్, నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను. ఎంతమందిని పంపుతావో పంపు. కానీ, నన్ను మాత్రం బ్రతకనివ్వకు. నీకు ఇచ్చిన టైం పూర్తైన తరువాత నేను ప్రాణాలతో ఉంటే, నీ పని పులుసులోకి ముక్కల్లేకుండా అయిపోతుంది,` అంటాడు విలన్‌తో.
కుర్చీ చివరకు జరిగిపోయి, ఊపిరి బిగబట్టి చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం సొల్లు కబుర్లు చెప్పి, సవాల్ విసురుతున్న హీరోని చూసి వొళ్ళు మండిపోతుంది. `చెయ్యగలిగిన పని చేసి చూపించడం మానేసి, ఎదుటివాడితో తన్నులు తినే వరకూ ఆగడం ఎందుకు?` అని విసుక్కొంటాడు. గూండాలు ఎగిరెగిరి తన్నుతుంటే... తన్నుతన్నుకీ రక్తం కక్కుకొంటున్న హీరోని ఉత్సాహపరచడానికి ప్రేక్షకుడు పిడికిలి బిగించి `తిరిగి కొట్టు...కొట్టు` అని మౌనంగానే ఆక్రోశిస్తాడు.
ఇచ్చిన ఐదు నిమిషాల గడువూ పూర్తయిన తరువాత పోతున్న ప్రాణాలని బలవంతంగా వెనక్కి తెచ్చుకొని, పిడికిళ్ళని ఉక్కు గదల్లా మార్చుకొని వొక్కొక్కడినీ కొడుతుంటే... ప్రేక్షకుడు రోమాంచితమైపోయి, విజిల్స్ వేస్తాడు. అది సినిమా.
అణుగుతుంది కదా అని ఇనుప స్ప్రింగు మీద కాలేసి తొక్కుతూ ఉంటే... అణిగి... అణిగి... అణిగి... ఒక్కసారే విస్పోటనం లాంటి శక్తితో తొక్కినవాడిని విసిరి కొట్టేస్తుంది. అగామంటే తిరిగి కొట్టలేక కాదు. సమయం ఎంచుకొని కొట్టాలి.ఇక్కడ స్ప్రింగ్ వ్యక్తి అయినా సరే, దేశమైనా సరే .... రిజల్ట్ సేం టు సేం!
కావాలంటే భారత్ సర్జికల్ స్ట్రైక్ చూడండి. దానికి ప్రజలనుంచి వస్తున్న స్పందనని చూడండి.
© Dantuluri Kishore Varma
Sunday, 18 September 2016
ఆకాశంలో మామిడిచెట్టు
స్కూల్ గార్డెన్ కోసం మొక్కలు కొందామని చీడిగ వెళ్ళాం. చిన్ని చిన్న గార్డెన్‌లకి మొక్కలు కావాలంటే కాకినాడవాళ్ళు కడియపులంక వరకూ పోవలసిన అవసరం లేకుండా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చీడిగలో రెండు పెద్ద నర్సరీలు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఒకటి వినాయకా నర్సరీ, రెండవది విగ్నేశ్వరా నర్సరీ! ఏ నర్సరీకి వెళదాం అని ఒక నిమిషం సందిగ్ధంలో చూస్తుంటే... అశోకచెట్లని ప్రవేశద్వారంలా పెంచిన నర్సరీ మా చూపులని ఆకర్షించింది.
అశోకచెట్లు సైప్రస్ చెట్లలాగ నిటారుగా పెరుగుతాయి. కానీ ఒక్కొక్కసారి కొమ్మలు రావచ్చు. ఈ నర్సరీలో ప్రవేశానికి అటూ ఇటూ వేసిన అశోక మొక్కల్లో ఒకదానికి ఓ కొమ్మ అడ్డంగా పెరిగి రెండవ చెట్టుకు తగిలే వరకూ వచ్చింది. చెట్టు అందం చెడకుండా ఉండడానికి సాధారణంగా అడ్డంగా పెరిగిన కొమ్మల్ని నరికేస్తుంటారు. కానీ ఇక్కడ కొమ్మని వదిలి, చెట్టుకి పైభాగాన్ని నరికేశారు. రెండవ చెట్టుని కూడా ప్రక్క చెట్టు కొమ్మ తగిలిన ప్రదేశం వరకూ ఉంచి, ఆ పై భాగాన్ని తొలగించారు. వాళ్ళ ఈ ఐడియా ఎక్కువమంది ఖాతాదారుల్ని ఆకర్షించడానికి ఉపయోగ పడుతుంది!
* * *
నర్సరీలో ఈ చివరినుంచి ఆ చివరివరకూ నాలుగైదుసార్లు తిరిగి, కావలసిన మొక్కల్ని ఎంచుకొని, వాటికి సరిపోయే కుండీలు కూడా తెప్పించి, మొక్కల్ని కుండీలలో వేసే పనిని నర్సరీ వాళ్ళకి అప్పగించాం. మాకోసం రెండు కుర్చీలు తెప్పించి అక్కడ వేసి, వాళ్ళు పనిలో పడ్డారు. సాయంత్రపు చల్లగాలి హాయిగా వీస్తుంది. అస్తమించడానికి పశ్చిమానికి ప్రయాణిస్తున్న సూర్యుడు చెట్ల కొమ్మల సందుల్లోనుంచి ఏటవాలు కిరణాలని భూమిమీద చల్లుతున్నాడు. ఆకాశంలో నీలంరంగు చిక్కబడుతుంది. తెల్లని మేఘాలు నీళ్ళు తాగడానికి కొండవాగు దగ్గరకి వెళుతున్న ఏనుగుల గుంపుల్లాగ మెల్లగా కదిలిపోతున్నాయి. మేఘమాలికలకి, అనంతమైన నీలానికి మధ్య ఉండే లోతైన(!) దూరం సాయంత్రపు ఆకాశానికి అనిర్వచనీయమైన అందాన్నిస్తుంది. మీరెప్పుడైనా గమనించారా?
`ఈ మావిడి చెట్టు చూడండి ఎంత పొడవుందో!` అంది ఆమె. నిటారుగా సుమారు ముప్పై అడుగులు పెరిగిన మానుకి చివర గొడుగులాగ విచ్చుకొన్న మావిడాకుల గుత్తులు! `ఇదేంటి ఇలా ఉంది?` అని అడిగాను నర్సరీ యజమానిని. చిన్నప్పుడు ఈ చెట్టు కొమ్మలు వేస్తుంటే విరిచేసే వాళ్ళమండి. దానితో టేకు చెట్టులాగ పెరిగిపోయింది. దీని కాయలేమీ బాగోకపోయినా, చెట్టు అందంగా ఉందని అలా ఉంచేశాం,` అన్నాడు. `పొడవుగా పెరగాల్సిన ఆశోకచెట్టు, గుబురుగా పెరగవలసిన మావిడిచెట్టూ అది-ఇది, ఇది-అదీ అయ్యాయి!
`కొన్నింటికి లాజిక్కులుండవు` అంది ఆమె.
`ఉంటాయి - ఎందుకంటే లాజిక్కుని నిర్ణయించేది సందర్భమే కానీ, జనరలైజేషన్ కాదు,` అన్నాను. నిజానికి అలాగ ఎందుకన్నానో నాకు తెలియదు. `ఎలాగ,` అని వివరణకోసం ఆమె అడగలేదు. కానీ అడిగుంటే....!?
* * *
ఒక కథ....
ఒక స్వామీజీ తన భక్తులనందరినీ ఒక మావిడి చెట్టుక్రింద కూర్చో బెట్టుకొని ఉపన్యాసం చెపుతూ ఉన్నారు. అందరూ మంచి భక్తి పారవశ్యంలో ఉండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద రాయి వచ్చి స్వామీజీ నడి నెత్తిమీద పడింది. భక్తులు హడావుడిగా నాలుగు వైపులకీ పరిగెత్తుకు వెళ్ళి, రాయి విసిరిన వాడిని పట్టుకొని స్వామీజీ ముందు నిలబెట్టారు.
నెత్తిమీద కట్టిన బొప్పి నొప్పిని కలిగిస్తున్నా, మొహమ్మీద చిరునవ్వును పోనివ్వకుండా ప్రయత్నిస్తూ, `రాయి ఎందుకు విసిరావు నాయనా?` అని స్వామీజీ సహనంతో అడిగారు వాడిని.
`రెండు రోజుల నుంచి ఎక్కడా పని దొరకలేదండి. తిండి లేక ఆకలితో ఉన్నాను. దారి ప్రక్కన మావిడి చెట్టుకి కాసిన పళ్ళను చూసి వాటితో కడుపు నింపుకొందామని చెట్టుపైకి రాయి విసిరాను. మీరు ఇటువైపు ఉన్నారని నేను చూసుకోలేదు. నాకు రెండు పళ్ళు దొరికాయి. కానీ మీకే దెబ్బ తగిలింది. నన్ను క్షమించండి,` అన్నాడు.
భక్తులంతా కోపంతో ఊగిపోతున్నారు. `వీడిని ఏమి చెయ్యమంటారో చెప్పండి స్వామీజీ?` నరికి పోగులు పెట్టమంటారా, లేకపోతే కాలూ, చెయ్యి విరిచెయ్యమంటారా?` అని ఉద్రేకపడిపోతున్నారు.
`వద్దు నాయనలారా. వాడి తిండికి లోటులేకుండా ఉండేలాంటి సంపాదనని ఇచ్చే పని ఇప్పించండి` అన్నారు స్వామీజీ.
* * *
రెండవ కథ...
దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి పరమేశ్వరుని భార్య. ఒకసారి దక్షుడు యజ్ఞం చేస్తూ ఈశ్వరుడికి ఆహ్వానం పంపడు. సతీదేవి తండ్రి చేస్తున్న యాగమే కనుక ఆహ్వానం లేకపోయినా వాత్సల్యంతో అక్కడికి వెళ్ళి అవమానింప బడుతుంది. అవమానభారంతో ఆమె అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. శివుడు తపస్సుకోసం హిమాలయాలకు వెళ్ళిపోతాడు. సంవత్సరాలు గడచిపోతాయి... సతిదేవి తిరిగి పార్వతిగా జన్మిస్తుంది. తారకేశ్వరుడనే రాక్షసుడిని సంహరించే లోక కళ్యాణ కారణం శివపార్వతుల వివాహంతో ముడిపడి ఉంది. వాళ్ళకి జన్మించే పుత్రుడే ఆ కార్యాన్ని పూర్తిచెయ్యగలడు. ధ్యానంతో సమాధిస్థితికి చేరుకొని ఉన్న శివుడిని మేల్కొలిపి పార్వతితో సమాగమం చేయ్యగల చమత్కారం మన్మధుని బాణాలకే ఉంది. అందుకే, దేవతలందరూ అతనికి ఈ బాధ్యత అప్పగిస్తారు. ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరుని ముందు పార్వతి నాట్యం చేస్తుంటుంది, కామదేవుడు తన పుష్ప బాణాలు సంధిస్తాడు. శివుడికి తపోభంగం అవుతుంది. అతని ఆగ్రహజ్వాలలకి మన్మదుడు దహింపబడతాడు. కానీ మన్మద బాణాల ప్రభావంతో శివపార్వతులు ఏకమౌతారు.
* * *
మొదటి కథలో... కొట్టినవాడిని తిరిగి కొట్టడమో, లేకపోతే క్షమించి విడిచి పెట్టడమో చెయ్యాలి కానీ.. పని ఇప్పించడం ఏమిటి? రెండవ కథలో... మన్మథుడికి గొప్ప ఉపకారం జరగాలి. నిజానికి జరిగిందేమిటి?
`అందరూ సాధారణంగా చేసే పనే మనం కూడా చెయ్యడం లాజిక్ అనుకొంటాం. కానీ సందర్భానికి అనుగుణంగా చేసేదే నిజమైన లాజికల్ పని, రాయిదెబ్బ తిన్న మావిడి చెట్టు ఆలోచన లేనిదైనా, కొట్టిన వాడికి రెండు పళ్ళు ఇచ్చింది. ఆలోచన ఉన్న మనం చెట్టు ఇచ్చిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఇవ్వడమే అసలైన లాజిక్ కదా?`
ఇక ఒక గొప్ప అవసరం కోసం పూలబాణంతో కొట్టి శివ తపోభంగం చేసిన మన్మథుడికి కాలి బూడిదవ్వడం మనలాజిక్కులకి అందని లాజిక్. దానిలో ఆంతర్యం ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
© Dantuluri Kishore Varma
Thursday, 19 May 2016
గమనం
రోనూ తుఫాను తీవ్రరూపం దాల్చబోతుందని హెచ్చరికలు జారీ అవుతున్నప్పుడు
కాకినాడ వర్షంలో తడిసి ముద్దవుతున్నప్పుడు
ఘాటీ సెంటర్ మారుతీషోరూంకి సమీపంలో ఉన్న
మా క్షేత్ర స్కూల్ దగ్గర తీసిన ఫోటోలు ఇవి.
ఈ ఫోటోలకి మంచి కేప్షన్స్ ఇవ్వండి చూద్దాం!
© Dantuluri Kishore Varma
Monday, 16 May 2016
మావిడి రసాల తీపి కబుర్లు
కాకినాడనుంచి పిఠాపురం వెళ్ళేదారిలో తిమ్మాపురం దాటిన తరువాత కుడిచేతివైపు రోడ్డుప్రక్కగా పే..ద్ద చెరువు ఉంటుంది. దానిని పండూరు చెరువు అంటారు. ఆ వెంటనే పండూరు ఊరిలోకి దారి. అలా లోపలికి వెళ్ళిపోతే ఊరి మొదటిలో రోడ్డుకి రెండువైపులా మావిడితాండ్ర తయారీ కేంద్రాలు కనిపిస్తాయి. విశాలమైన మైదానం లాంటి చోటుల్లో నేలకి రెండు మూడు అడుగుల ఎత్తులో సిమ్మెంటు స్థంబాల మీద మంచెల్లా కట్టి ఉంటాయి. వాటిమీద మావిడితాండ్ర చాపలు పరచి ఉంటాయి. తీపి మావిడి పండ్ల వాసన ఆ ప్రాంతం అంతా వ్యాపించి ఉంటుంది. ఎండ నిప్పులు చెరుగుతూ ఉంటుంది. మావిడి తాండ్ర చాపల పైన పనివాళ్ళు మావిడి గుజ్జుని పొరలుగా పూస్తూ ఉంటారు.
మావిడి తాండ్రని తయారీ విధానం ఏమిటో తెలుసుకోవాలని ఉందా?
ఇక్కడ తాండ్ర తయారీకి కలెక్టర్ రకం మావిడి కాయలను ఉపయోగిస్తున్నారు. పళ్ళని శుబ్రంగా కడిగి, గుజ్జు తీసే యంత్రంలో వేస్తారు. టెంకా, తొక్కా బయటకు పడిపోయి, గుజ్జు ఒక పెద్ద పాత్రలోనికి వచ్చేస్తుంది. ఈ మావిడి గుజ్జుకి చక్కెరా, బెల్లం తగినంత మోతాదులో కలుపుతారు. తీపి సరిపోయిందని నిర్ణయించుకొన్నాకా, మావిడి పళ్ళ గుజ్జుని తాటి చాపలమీద పరచి మంచెల మీద ఎండబెడతారు. ఒకరోజు పూర్తిగా ఎండలో ఉండేసరికి మావిడి గుజ్జు ఉల్లిపొర మందమైన పొరలా తయారవుతుంది. వరుసగా నెలరోజులపాటు పొరమీద పొర వేసుకొంటూ వెళతారు.
తాండ్ర తయారీకి కణకణ మండే ఎండల కాలమే అనుకూలమైనది. నెలరోజులపాటు తాండ్రని పొరలు పొరలుగా పోసి ఎండబెట్టిన తరువాత, చాపల మీదనుంచి వేరుచేసి కేజీ, అరకేజీ ముక్కలుగా కోసి, ప్యాక్ ఛేసి సుమారు కేజీ తొంభై రూపాయల రిటెయిల్ ధర(హోల్‌సేల్‌గా అయితే ఇంకా తక్కువ ఉంటుంది) చొప్పున వర్తకులకి అమ్మేస్తారు. కొంత తాండ్ర వేరే దూర ప్రాంతాలకి ఎగుమతి ఐతే, మరికొంత లోకల్ మార్కెట్‌లో అమ్ముడుపోతుంది.
మావిడి తాండ్ర గురించి చిన్న మాటా, మంతీ ఇక్కడ చూడండి.
మూడు నెలల విరామం తరువాత మళ్ళీ ఈ రోజే బ్లాగ్ ముఖం చూస్తున్నాను. ఇలా మావిడి రసాల తీపి కబుర్లు మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.
© Dantuluri Kishore Varma
Sunday, 24 January 2016
Deadlines
It was indeed unfair on the part of my car to breakdown suddenly on the highway. I was going to my native village to invite my relatives for a family function that was going to be held soon. The previous night itself I had wiped it clean and got it ready for the journey. It took me an hour or so to do it. `This wretched car does not seem to have any gratitude!` I said to myself. I had a hundred tasks to finish before sunset. `Being stuck there in the most unwelcome situation how will I be able to finish off all of them!`
It was still 8 o'clock in the morning. Lorries and fast cars were buzzing past me. Autos, though their horse power was not half as much as that of the fast cars, were making vain efforts to overtake them. Now and then some over crowded public transport buses were lumbering along. Bikers and cyclists were also on the move. Everyone seemed to be going somewhere. No village or habitation seemed to be nearby. The highway, my car and I were immobile. How pity being in such situation was!
I had to somehow set my car moving. I made a phone call to my mechanic whose workshop was some sixty kilometres away from the place. It might take him at least two hours to find me on the road side.
At around nine o'clock a middle aged papaya seller arrived there by his bicycle. He spread an empty rice bag under a tree nearby and put ripe papayas on it. He then took out a fruit and started peeling it with a sharp knife at a slow pace. I doubted if he would have a chance to sell at least one fruit in such a place. He cut the fruit in long slices and put them in a carry bag and hung it on the handlebar of the bicycle. Then he took up one more fruit to repeat with it also what he had done with the previous one. I found to my surprise that before he finished with the second one, a cyclist came from somewhere and bought the first bag of papaya slices.
The man continued with his work at a regular pace and there were never two bags hung on the handlebar at any time! A biker or a cyclist always came and found only a bag waiting for him. I asked him how it was possible. He showed his hands towards the sky as if saying it was God's magic. Being aware of law of probability I reasoned with myself that this fruit seller who had been having his makeshift shop there for a long time must have known the frequency of highway users at that place and regulated his speed of peeling to match the demand. This was a simple rule. If there had been much traffic, he would have kept more papaya slices ready.
Fortunately the mechanic arrived and took away the car to the city. I borrowed his bike and resumed my journey towards my destination. Though I was already three hours behind my schedule, I could finish all my tasks before evening as had been planned. How was it possible!? I don`t show my hands towards the sky as was done by the fruit seller. I know, you know and everyone knows that it is volume of work and urgency that decide the speed of an individual.
I realized that day the reason behind setting deadlines for the employees in corporate companies. It was a fantastico revelation for me.
This blog post is inspired by the blogging marathon hosted on IndiBlogger for the launch of the #Fantastico Zica from Tata Motors. You can apply for a test drive of the hatchback Zica today.
© Dantuluri Kishore Varma
Abhay`s Story
"Srila Bhaktisiddhanta`s explanation of the independence movement as a temporary, incomplete cause had made a deep IMPACT on Abhay. "
On seeing the excerpt above many curious doubts such as who Srila Bhaktisiddhanta and Abhay are, why the former branded the independence movement as being temporary and incomplete cause pop up in the minds of inquisitive observers. If you are really one of such people, I don't mind telling the inspiring story of Abhay to subside your curiosity.
When Abhay was born in Calcutta in 1896 the family astrologer predicted that he would start 108 temples across the countries. The father of the boy Gour Mohan De, who was a staunch Vaishnavite was very delighted on hearing the prediction.
Gour Mohan used to offer prayers to Radha - Govinda and would tell Abhay how Lord Chaitanya had sung and danced in the procession of Rath Yatra in Jagannath Puri some four hundred years before. In fact Gour Mohan wanted his son to become a preacher of Bhagavatam. He got playing of the mrudamgam drum taught to his son so that he could sing beautiful songs of Lord Sri Krishna and play the musical instrument along.
Abhay was one year junior to Subhas Chandra Bose in college. As in the case of everyone else of his age he was also influenced both by Bose and Gandhi. He used to wear khadi. One day a friend of his took him to a sadhu by name Srila Bhaktisiddhanta who at once asked Abhay and his friend to preach Lord Chaitanya`s message to the whole world since they were educated and ware capable of doing it. He was delighted with the proposal but he had some doubts as to why that was so important when the country was struggling under the British Rule. When he expressed his doubts the sadhu explained that the real self was the soul and the eternal reality was Krishna consciousness.
Though he was very much influenced by the words of the spiritual man, he could not be fully devoted to spreading Krishna consciousness. He had family and a business. For thirty years or more since then he encountered many hardships. Great famine hit Bengal. Thousands died. People starved. Children craved for food and fought with dogs near dust bins for a morsel. All these left a powerful impression on Abhay. He wanted people in India and the west to become god conscious. This was his goal in life. With little savings he had from his work, he started a magazine `Back to Godhead`. In a dramatic twist of fate he lost his business and forsook his family. He literally became mendicant. He got through winters without a coat and got sunstroke during summers. However, he continued publishing his magazine with meagre donations he managed to get and sold the copies at railway stations and public places. At fifty five years of age it would be difficult for anyone to bear such troubles.
He took sanyasa and became Bhaktivedanta Swamy. To fulfil his life`s goal he wanted to translate Srimad-Bhagavatam into English. Srimad-Bhagavatam had eighteen thousand verses in it. Bhaktivedanta calculated that he would have to write around sixty volumes to fully translate the Bhagavatam. At his age one would think of retiring from active work. But this man began his life`s mission. Isn`t it something wonderful?
By sixty nine he managed to get three volumes of his work published and got favourable responses. But his main aim of going west and preaching Krishna Consciousness there remained unfulfilled. With great difficulty he could get a sponsor in the USA. He got all the mandatory sanctions from the government and set out for the west by a ship - the Jaladoota. He finally reached America. He lived for 12 years after that. During this time he did very commendable work. He founded ISKCON - International Society for Krishna Consciousness in New York, authored eighty books, went round the globe for fourteen times to preach his message. As the astrologer predicted ISKCON grew into a confederation of 108 temples during his life time.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare
This is the inspiring story of Abhay who is popularly known as Prabhupada or Bhaktivedanta Swamy. A father`s wish and the impact of a guru`s words made a man a mission.
This blog post is inspired by the blogging marathon hosted on IndiBlogger for the launch of the #Fantastico Zica from Tata Motors. You can apply for a test drive of the hatchback Zica today.
© Dantuluri Kishore Varma
Wednesday, 13 January 2016
ఆముక్తమాల్యద
శ్రీకృష్ణదేవరాయల్ని సాహితీ సమరాంగణ సార్వభౌముడు అంటారు. క్రీస్తుశకం పదిహేను - పదహారు శతాబ్ధాల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినప్పుడు రాజ్యవిస్తరణ కోసం ఒక ప్రక్క దండయాత్రలు చేస్తూనే మరొక ప్రక్క తీర్థయాత్రలు కూడా చేసేవాడట. వెంట పట్టపురాణి తిరుమలదేవి, చిన్నరాణి చిన్నమదేవి ఉండేవారు. అష్టదిగ్గజకవులు కూడా వెంట వెళ్ళవలసిందే. తాను సహజంగానే కవి కనుక, మిగిలిన కవులు కూర్చిన కృతులను ఆస్వాదించడం, చక్కనైన సాహితీ చర్చలు నెరపడం, తాను స్వయంగా వ్రాసిన కావ్యాలను వారికి వినిపించడం చేసేవాడు. అందుకే ఆయనని కవిరాజు, రాజకవి అని అంటారు. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో మదాలస చరిత్ర, సత్యవధూప్రీణనము, సకలకథాసార సంగ్రహము, జ్ఞాన చింతామణి, రసమంజరి అనే కావ్యాలు రాశాడట. కానీ దురదృష్టవశాత్తూ అవేవి ఇప్పుడు లభ్యం అవడంలేదు. తెలుగులో రచించిన ఆముక్తమాల్యద మాత్రం సాహిత్య ప్రియుల్ని ఇప్పటికీ అలరిస్తుంది. పద్యాలను చదివి, కావ్యమాధుర్యాలని పూర్తిగా ఆస్వాదించలేని వాళ్ళకోసం వాటిని వచన రూపంలో ముద్రిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదని వచనరూపంలోనే చదివాను. జయంతి పబ్లికేషన్స్ విజయవాడ వాళ్ళు చాలా కాలం క్రితం ప్రచురించిన పుస్తకం అది.
ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళంలో ఉన్న ఆంధ్రమహా విష్ణువుని దర్శించిన తరువాత, ఆయన మహారాజుకి కలలో కనిపించి ఆముక్తమాల్యదని తెలుగులో వ్రాయమని ఆదేశించాడట. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ప్రాచీన వైష్ణవ గురుచరిత్ర నుంచి గోదాదేవి వృత్తాంతాన్నీ; విష్ణుపురాణం, వరహాపురాణం మొదలైనవాటినుంచి కొందరు విష్ణు భక్తుల కథల్నీ కలిపి ఆముక్త మాల్యదని రచించాడు. మూల కథలకు మార్పులూ చేర్పులూ చేసి, అద్భుతమైన వర్ణనలను జోడించి ఈ ప్రబంధకావ్యాన్ని అనన్యసామాన్యంగా రచించాడు. ఈ కావ్యరచనకి నాలుగు సంవత్సరాల సమయం పట్టిందట.
శ్రీ విలుబుత్తూరు అనే నగరంలో విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుడికి తులసివనంలో దొరికిన గోదాదేవి, విష్ణువునే ప్రేమిస్తూ పెరిగి పెద్దదయి శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాదుడిని వివాహం చేసుకోవడం ఆముక్తమాల్యదలో ప్రధామైన కథ. విష్ణుచిత్తుడు ప్రతీరోజూ సువాసనలు ఇచ్చే తులసిదళాలలో మాలలు కట్టి దేవాలయంలోని మన్ననారు స్వామికి సమర్పిస్తూ ఉంటాడు. కానీ, మాలలు కట్టిన తరువాత, దేవుడికి అలంకరించడానికి ముందే గోదాదేవి తండ్రికి తెలియకుండా వాటిని తన తలలో ధరించి, బావి నీటిలో తన ప్రతిబింబం చూసుకొని ముచ్చటపడిపోయి, తులసి మాలల్ని యదాస్థానంలో ఉంచేది. ధరించిన పూలని దేవుడికి ఇచ్చేది కనుక ఆమె ఆముక్తమాల్యద అయ్యింది.
మధురాపురాన్ని పరిపాలించే మహారాజు మత్స్యద్వజుడు ఓ రాత్రిపూట పరివారాన్ని వెంటబెట్టుకొని తన వేశ్యఐన భోగిని వద్దకు వెళుతూ ఉండగా, మధురాపురంలో కొండమీద ఉన్న దేవుడికి జరిగే తెప్పతిరునాళ్ళ ఉత్సవం చూడడానికి వచ్చిన ఒక బ్రాహ్మణుడు ఊరిలోనే బసచేసి, తనకు ఆతిద్యం ఇచ్చిన గృహస్తుకి చెపుతున్న సూక్తులు ఆయన(మహారాజు) చెవిన పడ్డాయి. `వర్షాకాలంలో లభ్యమవని వాటిని అంతకు ముందు ఎనిమిది నెలలపాటూ సేకరించుకొని నిలువచేసుకోవాలనీ.. అలాగే, రాత్రి అవసరాలకు పగలు, వృద్దాప్యంలో అవసరాలకు యవ్వనంలో, పరలోకంలో సౌక్యాలకు ఈ లోకంలో సమీకరించుకోవాలని` ఆ మాటల అర్థం. ఆ మాటలు విన్నవెంటనే రాజుకి మోక్షం పొందాలన్న చింత మొదలయ్యింది. మోక్షాన్ని ప్రసాదించే దేవుడు ఎవరో చెప్పినవాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తానని ప్రకటించాడు. ఎంతోమంది విజ్ఞులు రాజ సభకు వచ్చి రకరకాల దేవుళ్ళ గురించి చెప్పారు - కానీ అవేవీ రాజుని సంతృప్తిపరచలేకపోయాయి. చివరకి శ్రీ విలుబుత్తూరులో మన్ననారుస్వామి విష్ణుచిత్తునితో స్వయంగా మాట్లాడి - మధురాపురం వెళ్ళి మత్స్యద్వజుడినికి విష్ణువు గొప్పతనాన్ని చెప్పి, ఆతనిని వైష్ణవుడిగా మార్చమని ఆజ్ఞాపిస్తాడు. విష్ణుచిత్తుడు పెద్ద పండితుడు కాకపోయినా, రాజ సభకు వెళ్ళి, తర్కంలో అందరినీ ఓడించి, విష్ణువే ఆదిదేవుడని చాందోగ్యోపనిషత్తునీ, శ్రుతులనీ ఉదహరిస్తూ నిరూపిస్తాడు. ఆ సందర్భంలోనే ఖాండిక్య, కేశిధ్వజుల కథని చెపుతాడు.
మధురాపురాన్ని పరిపాలించే మహారాజు మత్స్యద్వజుడు ఓ రాత్రిపూట పరివారాన్ని వెంటబెట్టుకొని తన వేశ్యఐన భోగిని వద్దకు వెళుతూ ఉండగా, మధురాపురంలో కొండమీద ఉన్న దేవుడికి జరిగే తెప్పతిరునాళ్ళ ఉత్సవం చూడడానికి వచ్చిన ఒక బ్రాహ్మణుడు ఊరిలోనే బసచేసి, తనకు ఆతిద్యం ఇచ్చిన గృహస్తుకి చెపుతున్న సూక్తులు ఆయన(మహారాజు) చెవిన పడ్డాయి. `వర్షాకాలంలో లభ్యమవని వాటిని అంతకు ముందు ఎనిమిది నెలలపాటూ సేకరించుకొని నిలువచేసుకోవాలనీ.. అలాగే, రాత్రి అవసరాలకు పగలు, వృద్దాప్యంలో అవసరాలకు యవ్వనంలో, పరలోకంలో సౌక్యాలకు ఈ లోకంలో సమీకరించుకోవాలని` ఆ మాటల అర్థం. ఆ మాటలు విన్నవెంటనే రాజుకి మోక్షం పొందాలన్న చింత మొదలయ్యింది. మోక్షాన్ని ప్రసాదించే దేవుడు ఎవరో చెప్పినవాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తానని ప్రకటించాడు. ఎంతోమంది విజ్ఞులు రాజ సభకు వచ్చి రకరకాల దేవుళ్ళ గురించి చెప్పారు - కానీ అవేవీ రాజుని సంతృప్తిపరచలేకపోయాయి. చివరకి శ్రీ విలుబుత్తూరులో మన్ననారుస్వామి విష్ణుచిత్తునితో స్వయంగా మాట్లాడి - మధురాపురం వెళ్ళి మత్స్యద్వజుడినికి విష్ణువు గొప్పతనాన్ని చెప్పి, ఆతనిని వైష్ణవుడిగా మార్చమని ఆజ్ఞాపిస్తాడు. విష్ణుచిత్తుడు పెద్ద పండితుడు కాకపోయినా, రాజ సభకు వెళ్ళి, తర్కంలో అందరినీ ఓడించి, విష్ణువే ఆదిదేవుడని చాందోగ్యోపనిషత్తునీ, శ్రుతులనీ ఉదహరిస్తూ నిరూపిస్తాడు. ఆ సందర్భంలోనే ఖాండిక్య, కేశిధ్వజుల కథని చెపుతాడు.
విష్ణుచిత్తుడు మధురాపుర రాజు మత్స్యద్వజుడికి ఏవిధంగా విష్ణుమూర్తి గొప్పతనాన్ని తెలియజేశాడో, అదేవిధంగా యామునాచార్యుడు అనే ఒక బ్రాహ్మణుడు మత్స్యద్వజుని పూర్వికుడైన మరొక పాండ్యరాజుని వైష్ణవునిగా మారుస్తాడు. ఈ యామునాచార్యుని కథని స్వయంగా విష్ణుమూర్తే, లక్ష్మీదేవికి చెప్పినట్టుగా శ్రీకృష్ణదేవరాయలు కవితా కల్పన చేశాడు.
శ్రీరంగనాధుని మీద పిచ్చి ప్రేమతో, విరహంతో రోజురోజుకీ చిక్కిశల్యమౌతున్న కూతురి అవస్థచూసి, విష్ణుచిత్తుడు మన్ననారుస్వామికి మొరపెట్టుకొంటాడు. `మాకు పూలను మాలగా గుచ్చి నీకు సమర్పించడమే తెలుసు, ఆమె వాటిని పక్కగా చేసుకొని పడుకొంటుంది. మేము నీ పాదతీర్థాన్ని పుచ్చుకొని దాహంతీర్చుకొంటాం, ఆమె ఆనీటిని వొళ్ళంతా పూసుకొంటుంది. మేము యోగాభ్యాసం చేస్తూ నిన్ను స్మరిస్తాము, ఆమె మరీబారంగా - దీర్ఘంగా ఊపిరితీసి వొదులుతుంది. ఈ అతి తపస్సు ఏమిటో నువ్వే తెలుసుకొని మాకు చెప్పాలని` కోరతాడు. అప్పుడు మన్ననారుస్వామి భక్తునితో మాట్లాడుతూ మాలదాసరి అనే ఒక విష్ణుభక్తుని కథను చెపుతాడు. నిరంతరం విష్ణు సంకీర్తన చేసే మాలదాసరి తాను పాడిన ఒక కీర్తనలో చివరిచరణం ద్వారా వచ్చే పుణ్యాన్ని ఒక రాక్షసుడికి దారబోయడంద్వారా అతనికి శాపవిమోచనం కలిగిస్తాడు. `ఈ కథలు తెలిసిన భూదేవి నాలో చేరాలనే కోరికతో నీ కూతురిగా పెరుగుతూ, నన్నే ప్రేమించి విరహతాపం పొందుతుంది. అదే ఆమె చేసే తపస్సు` అంటాడు.
ఆముక్తమాల్యదలో ఉపకథల్ని ప్రథాన కథలో అనుసంధానించడం, కథని నడిపే తీరు అమోఘం. కావ్యం విష్ణు భక్తుల కథల సమహారం కనుక, దేవదేవుని వర్ణనలు కూడా ఆద్యంతమూ ఉంటాయి. వీటికి తోడు భక్తి, వేదాంత చర్చలు, తత్వబోధలు ఉంటాయి. ఖాండిక్యుడు, కేశిధ్వజుడు అనే అన్నదమ్ముల మధ్య సంవాదంలో భగవధ్గీత సారాన్ని, ముఖ్యంగా జ్ఞానయోగాన్ని సరళంగా చెప్పిన విధానం బాగుంటుంది. అలాగే యామునా చార్యుడనే రాజు తన కుమారుడికి రాజ్యపట్టాభిషేకం చేసి, రాజనీతి బోదిస్తాడు. ఆ రాజనీతి ఇప్పటికీ ఆచరణయొగ్యంగానే ఉందని అనిపిస్తుంది. ప్రతీ వ్యక్తీ యామునాచార్యుడి రాజనీతిసూత్రాలని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకొంటే మంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చు.
నగరాల్ని, నగరాల్లో ఉండే ఉద్యానవనాల్ని, కోటల్ని, కొలనుల్ని, నగర స్త్రీలనీ, పువ్వులను సేకరించి మాలలు కట్టి అమ్మే పుష్పలావికల్నీ, పువ్వులు కొనడానికి వచ్చే వ్యక్తులతో వాళ్ళు జరిపే సరస చమత్కార సంభాషణల్నీ, వేశ్యలనీ చక్కగా వర్ణిస్తాడు కవి. ముఖ్యంగా ఋతువుల వర్ణన అమోఘం. గ్రీష్మ, వర్ష, శరత్, వసంత ఋతువుల్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. వర్ణనల్ని చదువుతూ ఉపమానాల వెల్లువలో ఆనందంగా కొట్టుకొనిపొతాం. పనుల వొత్తిడిలో పడి ప్రకృతిలో వచ్చే మార్పుల్ని గమనించడం మానేసాం. వర్షాన్ని, వెన్నెలని, సూరోదయాల్ని, మంచుని, చలిని, గ్రీష్మంలో వచ్చే మావిడిపళ్ళ మాధుర్యాల్ని, పూచే పువ్వుల్ని, వీచే గాలుల్ని, పక్షుల కూతల్ని మనసుపెట్టి ఆస్వాదించం. కానీ, ఈ కావ్యం చదివితే ఆ స్పృహ కొంచెమైనా తిరిగి వస్తుందేమో!
ఆముక్తమాల్యద గురించి ఒక్కమాటలో చెప్పాలంటే భక్తి, శృంగారం, భావుకత్వం, వ్యవహారదక్షత, విజ్ఞానం, ఆనందం... ఆన్నీ ఉన్నాయి ఈ పుస్తకంలో.
శ్రీకృష్ణుని కోసం గోపికలు చేసినటువంటి వ్రతాన్ని గోదాదేవి కూడా ముప్పైరోజులు ఆచరించి శ్రీరంగనాధుడిని పొందింది. శ్రీరంగనాధుడు ఆమెను స్వీకరించిన రోజే `భోగి` - అందుకే ఈ రోజు ప్రత్యేకంగా ఆముక్తమాల్యద గురించి ఈ వ్యాసం.
శ్రీకృష్ణుని కోసం గోపికలు చేసినటువంటి వ్రతాన్ని గోదాదేవి కూడా ముప్పైరోజులు ఆచరించి శ్రీరంగనాధుడిని పొందింది. శ్రీరంగనాధుడు ఆమెను స్వీకరించిన రోజే `భోగి` - అందుకే ఈ రోజు ప్రత్యేకంగా ఆముక్తమాల్యద గురించి ఈ వ్యాసం.
© Dantuluri Kishore Varma
Monday, 11 January 2016
స్పూర్తి
స్వామీ వివేకానంద జన్మదినం జనవరి 12.
1985 నుంచీ మన దేశంలో ప్రతీసంవత్సరం ఈ తారీఖును జాతీయ యువజన దినోత్సవం (నేషనల్ యూత్ డే)గా అధికారికంగా జరుపుకొంటున్నాం. స్వామీ వివేకానంద ఉపన్యాసాలు, గీతోపాఖ్యానం, రచనలు, లేఖలు... వాటిలో స్పూర్తిని నింపే మాటలు యువతని వెన్నుతట్టి ముందుకు నడిపిస్తాయి.
1985 నుంచీ మన దేశంలో ప్రతీసంవత్సరం ఈ తారీఖును జాతీయ యువజన దినోత్సవం (నేషనల్ యూత్ డే)గా అధికారికంగా జరుపుకొంటున్నాం. స్వామీ వివేకానంద ఉపన్యాసాలు, గీతోపాఖ్యానం, రచనలు, లేఖలు... వాటిలో స్పూర్తిని నింపే మాటలు యువతని వెన్నుతట్టి ముందుకు నడిపిస్తాయి.
1. రోజుకి ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు.
2. మిమ్మల్ని బలవంతుల్ని చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనుల్ని చేసే ప్రతి ఆలోచననీ తిరస్కరించండి.
3. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి. దాన్నే ధ్యానించండి. దాన్నే కలగనండి. దాన్నే శ్వాసించండి. అదే విజయానికి మార్గం.
4. లక్ష్యంలో ఉన్నంత శ్రద్దాసక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి, విజయ రహస్యం అంతా అదే.
5. నిరంతరం వెలిగే సూర్యుడ్ని చూసి చీకటి భయపెడుతుంది. అలాగే నిరంతరం శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది.
6. పరాజయాల్ని పట్టించుకోకండి. అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమిలేని జీవితం ఉంటుందా?
7. ప్రేమా, నిజాయితీ, పవిత్రతా కలిగి ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఓడించలేదు.
8. చావు బ్రతుకులు ఎక్కడో లేవు, మన ఆలోచనల్లోనే ఉన్నాయి. ధైర్యంలోనే బ్రతుకు ఉంది. భయంలోనే చావు ఉంది.
9. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు. కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.
10. విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే నిజమైన సవాల్.
వివేకానంద గురించి మనకాకికాడలో బ్లాగ్‌లో ఇంతకు ముందు రాసిన విషయాలని ఇక్కడ చదవండి.
- స్వామీ వివేకానంద
- హిందూమతం గురించి చదివిన పత్రం
- సమాన(వ)త్వం
- ఉత్సాహం లేని చదువు, ఏకాగ్రత లేని పని, లక్ష్యం లేని ప్రయాణం ఏ ఫలితాన్నీ ఇవ్వవు.
- వివేకానందా రాక్ మెమోరియల్
- స్వామీ వివేకానంద స్వార్ధం
© Dantuluri Kishore Varma
కెరటం
ప్రారంభించిన పని విజయవంతం కాకపోతే,
ఆశించిన ఫలితం చేతికందకపోతే
వచ్చే ప్రతికెరటం తీరాన్ని చేరదనీ...
లేచే ప్రతికెరటం ఆకాశాన్ని అంటదనీ...
కెరటం కొందరికి తాత్వికత నేర్పుతుంది
విజయలక్ష్మి వెక్కిరించిందని నిస్పృహతో చేతులు ముడుచుకొని కూర్చుంటే
బలాన్ని కూడదీసుకొని ముందడుగు వెయ్యకపోతే
విశ్వమంతా వెతికిచూసినా ఒక్క విజేతా కనిపించడు
`గొప్పతనం ఎగిసి పడడంలో కాదు, పడిన ప్రతిసారీ లేవడంలో ఉంది!` అని వివేకానందుడు చెప్పినట్టు
కెరటం కొంతమందికి స్పూర్తినిస్తుంది
సీతారాములు సినిమాలో దాసరి నారాయణరావు వ్రాసిన ఈ పాట (See the link here) వివేకానందా రాక్ మెమోరియల్ దగ్గర చిత్రీకరించినట్టు అనిపిస్తుంది. సముద్రం మధ్యలో శిలమీద కట్టడం వివేకానందా రాక్ మెమోరియల్ దగ్గర కన్యాకుమారి మండపంలా ఉంది. అవునో, కాదో ఈ పాట చిత్రీకరణ విశేషాలు గురించి తెలిసున్న వారు చెప్పాలి. పాటని సత్యం సంగీత దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. భావుకత్వం అత్యద్భుతంగా ఉంటుంది. చిత్రీకరణ హుందాగా ఉంటుంది. 1980లో చిత్రం విడుదలైంది. పాట జనాలకి విపరీతంగా నచ్చింది. నాకు కూడా బాగా నచ్చినపాటల్లో ఇది ఒకటి.
పాటలో భావుకత్వాన్ని చదువుతూ ఆనందించండి...
తొలి సంజ వేళలో - తొలి పొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో - వినిపించే రాగం భూపాలం
ఎగిరొచ్చే కెరటం సింధూరం
జీవితమే రంగుల వలయం
దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం - దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యారాగం - మేలుకొలిపే అనురాగం
సాగరమే పొంగులనిలయం
దానికి ఆలయం సంధ్యాసమయం
వచ్చే ప్రతికెరటం చేరదు అది తీరం
లేచే ప్రతికెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం - మేలుకొలిపే అనురాగం
ఇంతకీ వివేకానందా రాక్ మెమోరియల్ గురించి మీకు తెలుసా?
భారతదేశపు దక్షిణపు కొన నుంచి సముద్రంలోకి ఏభై మీటర్ల దూరంలో హిందూమహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతాలు కలిసే చోట ఒక చిన్న ద్వీపంలాంటి శిల ఉంది. బుద్దుడికి భోది వృక్షం ఎలాగో, వివేకానందునికి కన్యాకుమారి వద్ద ఈ శిల అలాగ. 1970లలో దీనిని వివేకానందా రాక్ మెమోరియల్‌గా అభివృద్దిచేశారు. (వివేకానందా రాక్ మెమోరియల్ గురించి పూర్తి టపా ఇక్కడ చదవండి) .
© Dantuluri Kishore Varma
Subscribe to:
Posts (Atom)