రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. ఆకాశానికి చిల్లులు పడినట్టు కుండపోత వర్షాలు కురిశాయి. మందాకినీ, అలకనందా నదులు పొంగిపొర్లాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తర్‌ఖండ్‌లో చార్‌దాం యాత్ర చేసుకొంటున్న వేలకొద్దీ భక్తులు వరదల్లో, అవి తీసుకొని వచ్చిన బురదలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.
దైవం కన్నేర్రజేసిందో, ప్రకృతి కినుక వహించిందో తెలియదు. ఒకవైపు హిమాలయ ప్రాంతంలో చెట్లు నరికేయడం వల్ల వర్షాలకి నేల కోతకు గురయ్యి బురదను విపరీతంగా తీసుకొని వచ్చిందంటున్నారు. మరొకవైపు కేదార్‌నాథ్‌లో ఉన్న ధారిదేవి అని పిలవబడే కాళీమాత విగ్రహాన్ని హైడల్ పవర్ ప్రాజెక్ట్ కోసం తరలించడం వల్ల ఆ మరునాడే వరదలు ముంచెత్తి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేశాయని అంటున్నారు. 1882లో కూడా ఇలానే జరిగిందట.
భవనాలు కొట్టుకుపోయాయి. వంతెనలు కూలిపోయాయి. అన్ని మార్గాలూ మూసుకొనిపోయాయి. సైనికులు రక్షణగోడలా నిలిచారు. ప్రాణాపాయం లేకుండా ఆపలేకపోవచ్చు. కానీ, చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోయి ప్రాణాలు అరచేత పట్టుకొని సహాయం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళని సురక్షితప్రాంతాలకి తరలిస్తూ, తమప్రాణాలని ఫణంగా పెట్టి కర్తవ్య నిర్వాహణ చేస్తున్న సైనికులకి ఏమి చెప్పి కృతజ్ఞత తెలియజేయగలం!
విపత్తునుంచి బయట పడినవాళ్ళ ఆనందం, ఆప్తులని కోల్పోయినవాళ్ళ విషాదం, తప్పిపోయిన బందువులు ఏమయ్యారో తెలియని ఆందోళన, `ప్రకృతికి హానిచేస్తే కళ్ళేర్రజేస్తుంది` అనే ప్రశ్చాత్తాపం, `అన్నీ కొట్టుకొనిపోయాయి దేవదేవుని ఆలయం మాత్రం నిలిచేవుంది` అనే దైవం మీద మొక్కవోని విశ్వాశం, వీటన్నింటికీ అతీతమైన అవకాశవాద రాజకీయం - ఒక విపత్తు ఎన్ని పార్శ్వాలు చూపిస్తుందో!
ఫొటోలు: Deccan Chronicle
© Dantuluri Kishore Varma
హ్మ్.. అవునండీ.
ReplyDeleteమీ వ్యాఖ్యకి ధన్యవాదాలు శిశిరగారు!
Delete