చిన్నప్పుడు విన్న, చదివిన కథలు జ్ఞాపకం ఉన్నాయా?
16వ శతాబ్ధంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన విజయనగర సామ్రాజ్యపు అధినేత శ్రీకృష్ణదేవరాయలు పండితుడు, కవి. ఈయన ఆస్థానంలో ఎనిమిదిమంది మహా కవులు ఉండేవారు. వీరిని అష్టధిగ్గజాలు అనేవారు. ఈ కవుల సభకి భువనవిజయం అని పేరు. తెనాలి రామకృష్ణుడు అష్టధిగ్గజకవులలో ఒకడు. ఇతనికి వికటకవి అని మరొక పేరు కూడా ఉంది. వికటకవి అంటే నవ్వుపుట్టించేకవి అని అర్థం. శ్రీకృష్ణదేవరాయలు, తెనాలిరామకృష్ణుడు మధ్య ఎన్నో సన్నివేశాలు, చమత్కారమైన విషయాలు, చిక్కుముడుల పరిష్కారాలు, చతుర సంభాషణలు మొదలైనవి కథలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. తెనాలిరామలింగడి హాస్యం, (You Tube link) చమత్కరాలు ఎంతగా చక్కిలిగింతలు పెట్టేవో జ్ఞాపకం ఉందా?
అలాగే పంచతంత్రం కథలు -
ఇక చందమామ మాసపత్రిక -
పురాణాల కథలు, బేతాళుడు - విక్రమార్కుడు, మంచి దెయ్యాల కథలు, చిలిపి దెయ్యాల అల్లరి, రామయ్యా - సోమయ్యలు; జానపద కథల్లో రాజులు, మాంత్రికులు, రాజకుమార్తెలు, పేదరాసిపెద్దమ్మ... ఇంకా ఎన్నో చందమామల్లో చదివి పెరిగి పెద్దయిన మనం ఆ చిన్న మాసపత్రికని, అందులో కథలకు వేసిన బొమ్మల్ని మరచిపోలేం.

పూర్వం మహిలారోప్యం అనే దేశంలో అమర్ శక్తి అనే రాజు ఉండేవాడు. ఇతను చాలా పరాక్రమవంతుడు, సకలశాస్త్ర పారంగతుడు. ఇతనికి వాసు శక్తి, ఊగ్ర శక్తి, అనేక శక్తి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. పండిత పుత్రులు పరమశుంఠలు అన్నట్టు, వీళ్ళు బుద్ధి హీనులు. అమరశక్తి తరువాత రాజ్యం పరిపాలించడానికి కావలసిన తెలివి ఏమాత్రంలేని కుమారులని చూసి రాజు చాలా దిగులు పడ్డాడు. మన పురాతనమైన శాస్త్రాలు చదివిస్తే ఉపయోగం ఉండవచ్చు, కానీ అలా చెయ్యడానికి చాలా సంవత్సరాల సమయం కావాలి. మంత్రులు విష్ణుశర్మ అనే ఒక వృద్ద పండితుని పేరుని రాజుకి సూచిస్తారు. అతను రాజకుమారులకి విజ్ఞానాన్ని అందిచ గలడని చెపుతారు. రాజు ఆ బాధ్యతని విష్ణుశర్మకి ఆనందంగా అప్పగిస్తాడు. విష్ణుశర్మ, విజ్ఞానాన్ని కథలరూపంలో రాజకుమారులకి అందించడానికి ఐదు భాగాల పంచతంత్రంగా కూర్చి, కేవలం ఆరు నెలల సమయంలో రాజకుమారులను విజ్ఞానవంతులని చేస్తాడు. జంతువులు, పక్షులు, మనుషులు ప్రధాన పాత్రలుగా ఉండే ఆ కథలు చాలా బాగుంటాయి.
ఇక చందమామ మాసపత్రిక -
పురాణాల కథలు, బేతాళుడు - విక్రమార్కుడు, మంచి దెయ్యాల కథలు, చిలిపి దెయ్యాల అల్లరి, రామయ్యా - సోమయ్యలు; జానపద కథల్లో రాజులు, మాంత్రికులు, రాజకుమార్తెలు, పేదరాసిపెద్దమ్మ... ఇంకా ఎన్నో చందమామల్లో చదివి పెరిగి పెద్దయిన మనం ఆ చిన్న మాసపత్రికని, అందులో కథలకు వేసిన బొమ్మల్ని మరచిపోలేం.
© Dantuluri Kishore Varma
చెప్పడంకోసమే పుట్టింది కథ!చిట్టిపొట్టి పిల్లలను ఆకట్టుకునే కథలు చెప్పేవారేరీ నేడు!ఎవరికీ అంత తీరిక లేదు,ఓపిక అసలేలేదు!మన సంస్కృతిని తెలిపే కథలు చెప్పి మీ టపాను బాలరంజకం చేయబోతున్నందుకు ముందస్తు అభినందనలు!!
ReplyDeleteధన్యవాదాలు సూర్యప్రకాష్ గారు.
Deleteమంచి పని మొదలు పెట్టారు. అభినందనలు.
ReplyDeleteధన్యవాదాలు లలిత గారు.
Deletebeautiful...exploring magnificent respect on our culture...
ReplyDeleteall the best kishore varma garu...
థాంక్స్ అండీ!
Delete