ఒక వ్యక్తి ఉదయాన్నే బీచ్ వడ్డున నడుస్తున్నాడు. కెరటం వచ్చి వడ్డున కొట్టినప్పుడల్లా కొన్ని స్టార్ ఫిష్ తీరమ్మీద ఉండిపోతున్నాయి. అతను నడిస్తున్నంత మేరా ఒక్కొక్క స్టార్ ఫిష్ ని ఏరి సముద్రంలోనికి విసిరేస్తున్నాడు.
అతనిని గమనిస్తున్న ఒక యువకుడు ఆయన దగ్గరకు వెళ్ళి, "ఏమి చేస్తున్నారు మీరు?" అని అడిగాడు.
"కెరటంతో పాటూ వెనక్కి వెళ్ళలేకపోయిన వాటిని సముద్రం లోనికి విసిరి, వాటి ప్రాణాలను రక్షిస్తున్నాను," అని చెప్పాడు ఆ పెద్దాయన.
"అటువంటి స్టార్ ఫిష్ ఈ తీరం మీద లక్షలకొద్దీ ఉన్నాయి. ఎన్నింటిని మీరు సేవ్ చెయ్యగలరు? దానివలన ఏమి మార్పువస్తుంది?" అని అనుమానం వ్యక్తం చేసాడు ఆ యువకుడు.
"నాకు ఇదొక్కటే పనికాదు. వీటన్నింటినీ రక్షించాలంటే ఎవరితరమూ కాకపోవచ్చు. కానీ, ఇలా తీరం వెంబడినడుస్తున్నప్పుడు మనకి తోచినంత మేర వాటికి సహాయం చెయ్యవచ్చుకదా? అదే నేను చేస్తున్నది. ఈ చిన్నపని వలన ఏమి మార్పు వస్తుంది అని అడిగావు కదా? ఇదిగో దీని విషయం లో మార్చగలిగానుకదా?" అంటూ అప్పుడే చేతిలోనికి తీసుకొన్న ఫిష్ ని ఆ యువకుడికి చూపించి తన పనిని కొనసాగించాడు.
(ఎక్కడో చదివింది, నా మాటల్లో మీ కోసం)
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment