Pages

Friday 16 August 2013

లవ్ స్టోరీ

1970లో ఎరిక్ సేగల్ రాసిన లవ్‌స్టోరీ అనే నూటపదిహేను పేజీల చిన్ని ఇంగ్లీష్ నవల 21 మిలియన్ కాపీలు అమ్ముడయ్యింది. రాయల్టీగా రచయితకి  ఎంత వస్తుందో తెలియదు కానీ, పుస్తకానికి డాలర్ చొప్పున వచ్చినా ఇలాంటి ఒక్క పుస్తకంతో కోటీశ్వరుడు ఐపోవచ్చు. రచయితలకి గొప్ప ఇన్స్పిరేషన్ కలిగించే పాయింట్ ఇది. డబ్బున్న అబ్బాయీ పేద అమ్మాయి మధ్య ప్రేమ, పెద్దలని ఎదిరించి పెళ్ళిచేసుకోవడం, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు లాంటి ఇతివృత్తంఉన్న కథలు కొన్ని వందలు వచ్చి ఉంటాయి. చాలా వాటిని సినిమాలుగా కూడా చూశాం. అలాంటి సాధారణమైన కథే ఇది కూడా. కానీ ఎందుకు అంత ఎక్కువగా అమ్ముడుపోయింది? నేను అనుకోవడం ఏమిటంటే నవల చివరిలో గుండెల్ని పిండేసే విషాదాన్ని చొప్పించాడు రచయిత. జాలీ గా సాగిపోయే సాధారణమైన కాలేజ్ కథ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని హృదయాన్ని బరువెక్కిస్తుంది. ఇలా కాకుండా `ఆ తరువాత వాళ్ళిద్దరూ కలకాలం ఆనందంగా ఉన్నారు,` అని ముగింపు ఇస్తే అట్టర్ ఫ్లాప్ అయివుండేది.
*     *     *
తెలివిగా, చమత్కారంగా మాట్లాడే హీరోయిన్ జెన్నీఫర్ కేవిల్లరీ మ్యూజిక్ స్టుడెంట్. ఒక రొట్టెలు చేసుకొనే వాడి కూతురు. హీరో ఒలివర్ బ్యారెట్, సంపన్న బ్యారెట్ వంశానికి వారసుడు, హార్వార్డ్ కాలేజ్ విద్యార్థి , హాకీ ప్లేయర్.

మొట్టమొదటిసారి వాళ్ళిద్దరూ లైబ్రరీలో కలుసుకొన్నప్పుడు `నువ్వోక డబ్బున్న స్టుపిడ్‌వి` అంటుంది.
`కాదు, నేను తెలివైన పేదవాడ్ని,` అంటాడు. 
`అది నువ్వుకాదు, నేను,` అని సమాధానం చెపుతుంది. 
`ఎందుకు తెలివైనదాన్ననుకొంటున్నావ్?` అని ప్రశ్నిస్తాడు.
`ఎందుకంటే, నేను నీతో కాఫీకి రావడం లేదు కనుక.`
`అసలు, నిన్ను పిలిస్తే కదా?` 
`అందుకే కదా నిన్ను స్టుపిడ్ అన్నాను,` అంటుంది.   

బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా, సిద్ధర్థ్‌ల్లా అనిపిస్తాయి ఈ క్యారెక్టర్లు రెండూ. ఒలివర్ తండ్రిది ప్రకాష్‌రాజ్ లాంటి మనస్థత్వమే! తండ్రి అంటే అతనికి అసహ్యం, కోపం. తండ్రి మాటకాదని కేవిల్లరీని పెళ్ళిచేసుకొంటాడు. ఒలివర్ని లా చదవించడానికి, కేవిల్లరీ టీచర్ ఉద్యోగం చేస్తుంది.

ఒక సందర్భంలో మొగుడూ పెళ్ళాల మధ్య ఓ చిన్న గొడవతో ఒలివర్ టెలీఫోన్ విసిరి కొడతాడు. ఆమె ఇంటిలోనుంచి బయటకు వెళ్ళిపోతుంది. నిజానికి ఒక్కక్షణం ఆమెని వదిలి ఉండలేడు. ఊరంతా ఆమెకోసం వెతికి, నిస్పృహతో రాత్రికి ఇంటికి చేరితే, మెట్లమీద కూర్చొని అతనికోసం ఎదురుచూస్తూ ఉంటుంది. `సారీ` అంటాడు. `Love means not ever having to say you`re sorry,` అంటుంది  ఈ ఒక్క సన్నివేశంతో వాళ్ళ ఇంటర్ డిపెండెన్సీని రచయిత మనకి చెపుతాడు. అలాంటిది, అకస్మాత్తుగా హీరోయిన్ ల్యుకేమియతో మరణించబోతుందని తెలిస్తే హీరో పరిస్థితి ఏమవుతుంది? లా పూర్తి చేస్తాడు మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయాయి, ఇక పిల్లల్ని కనవచ్చు అనుకొనే సమయంలో ఇలాంటి పిడుగులాంటి వార్త!   

ఈ సంగతి ఆమెకి తెలిసినరోజు ఆమె కళ్ళల్లో విషాదాన్ని చూస్తాడు. అది తనగురించి కాదు, అతని గురించి విషాదం. ఆ సన్నివేశం గుండెలు పిండేస్తుంది.  

కథ ఆమె చివరి రోజులకి, హాస్పిటల్‌కి చేరుతుంది. విషయం తెలుసుకొని ఒలివర్ తండ్రి హడావుడిగా వస్తాడు. కోడలి ఆరోగ్య పరిస్థితి గురించి కొడుకుని అడుగుతాడు. కానీ, ఆమె అప్పటికి కొన్ని క్షణాల ముందే చనిపోయిందని తెలుసుకొని, `ఐయాం సారీ,` అంటాడు బాధగా. అప్పుడు ఒలివర్ అప్రయత్నంగా,  `Love means not ever having to say you`re sorry,`  అంటాడు. తను మరణించినా నిజమైన ప్రేమ యొక్క స్పిరిట్‌ని అతనిలో నింపిందా!?
*     *     *
అసలు ఈ కథని సినిమాకోసం స్క్రిప్ట్‌గా రాశాడట ఎరిక్ సేగల్. అయితే, సినిమాకి హైప్ క్రియేట్ చేసే ఉద్దేశ్యంతో నవలగా రాయించి సినిమా రిలీజ్‌కి ముందు ఫిబ్రవరి 14 తారీకున, వాలంటైన్స్ డే  స్పెషల్ గా మార్కెట్‌లోకి వదిలారట. రాబోయే సినిమా తాలుక నవలగా దీనికి, నవల సృష్టించిన సెన్సేషన్‌తొ సినిమాకీ మేలుజరిగి రెండూ బంపర్ హిట్ అయిపోయాయి.   

బై ఫర్ నౌ!        
© Dantuluri Kishore Varma

8 comments:

  1. కధ సామాన్యమైనదే! పుస్తకాలు అలా అమ్ముడుపోయాయంటే కధనలో కవి చూపిన చమత్కారం కవచ్చు. అది మీరూ చెప్పలేదు....:)

    ReplyDelete
    Replies
    1. చెప్పాను శర్మగారూ.ఇంతటి విజయం సాధించడానికి ఈ కథ సుఖాంతం కాకుండా, ట్రాజిడీగా మలచడం ముఖ్యమైన రీజన్. మనకి `అయ్యో!` అనిపించిన ఫీలింగే నవలని ఎప్పటికీ గుర్తించుకొనేలా చేస్తుంది. రాసిన నలభై సంవత్సరాల తరువాత కూడా ఈ పుస్తకాన్ని కొంటున్నారంటే అదే కారణం. మీ కామెంటుకి ధన్యవాదాలు.

      Delete
  2. జెన్నీఫర్ కేవీల్లరి..చివరి పేరుని బట్టి బహుశా ఆ పాత్ర American-Italian descent అయ్యివుండవచ్చు..!

    ReplyDelete
    Replies
    1. అవును మూర్తిగారు, వాళ్ళిద్దరూ మొట్ట మొదటిసారి (మిడ్జెట్)రెస్ట్రాంట్‌కి వెళ్ళినప్పుడు తనని తాను పరిచయం చేసుకొంటు ఆమె అదేమాట చెపుతుంది.

      Delete
  3. These are opening lines if I remember correctly

    "What can you say about a twenty-five-year-old girl who died? That she was beautiful. And Brilliant. That she loved Mozart and Bach. And the Beatles. And me."

    I don't think the tragic ending generated sales, in fact in the very beginning itself the reader will know about this. And yes every love story gives a bit of tragedy :-)

    The story is very simple & sincere, easy to read and stir the emotions. I guess that is reason to reach many !

    ReplyDelete
    Replies
    1. You are right. Those are the opening lines.

      I did not say the novel had been a hit because of the suspense(in fact, there is no suspense at all), but for the tragic ending. In spite of readers knowledge about the heroine`s fate they feel immensely sad at the end. (I did feel that way!)

      Though I assume it is the principal reason for the success of the novel, other things that you mentioned must have had their share in it.

      Thanks for the comment.

      Delete
  4. is that novel available now...if so where can i buy it.

    ReplyDelete
    Replies
    1. ఫ్లిప్ కార్ట్‌లో ప్రయత్నించండి.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!