బుద్ధుడు అంటే జ్ఞాని, తెలుసుకొన్నవాడు అని అర్థం. 29 సంవత్సరాల వయసున్నప్పుడు భార్యని, కుమారుణ్ణి, రాజ్యాన్ని విడిచిపెట్టి మనుష్యులు అనుభవిస్తున్న కష్టాలకి కారణాన్ని అన్వేషిస్తూ బయలుదేరిన సిద్ధార్థుడు ఆరు సంవత్సరాలు కఠిన నియమాలతో తపస్సుచేస్తాడు. కానీ, తన ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఆహార, పానీయాలు కూడా తీసుకోకుండా ధ్యానం కొనసాగిస్తాడు. ఫలితం ఉండదు. అప్పుడు ఒక బాలిక అతనికి కొంత ఆహారాన్ని ఇస్తుంది. స్వీకరిస్తాడు. ఒక గొప్ప సత్యం అవగతమౌతుంది. శారీరకమైన కష్ఠాలు కలిగించుకోవడం ద్వారా అద్యాత్మికమైన సమాదానాలు పొందలేమని. ఈ సంఘటన తరువాత అహారాన్ని భుజిస్తూ, నీటిని సేవిస్తూ, స్నానపానాదులు చేస్తూ తన ధ్యానాన్ని కొనసాగిస్తాడు. ఇది కఠిన నియమాల సాధన కాకుండా, అలాగని భౌతికమైన సుఖాల్లో మునిగి తేలకుండా మధ్యేమార్గంగా ఉండే విధానం.
ఈ క్రమంలో ప్రస్తుతం బీహార్లో ఉన్న బోధ్‌గయా అనే ప్రాంతంలో భోది వృక్షం క్రింద సిద్దార్థుడికి జ్ఞానోదయమై బుద్దుడు అవుతాడు. తను తెలుసుకొన్న సత్యాన్ని తన శిష్యులకి ఉత్తర్‌ప్రదేశ్‌లో వారణాసికి దగ్గర సారానాథ్లో మొట్టమొదటిసారి భోదిస్తాడు. బుద్దుని బోదనలనే దమ్మపదం అంటారు. బుద్దుని బోధనలని అనుసరించే శిష్యుల సంఘం ప్రారంభమౌతుంది.
ఈ క్రమంలో ప్రస్తుతం బీహార్లో ఉన్న బోధ్‌గయా అనే ప్రాంతంలో భోది వృక్షం క్రింద సిద్దార్థుడికి జ్ఞానోదయమై బుద్దుడు అవుతాడు. తను తెలుసుకొన్న సత్యాన్ని తన శిష్యులకి ఉత్తర్‌ప్రదేశ్‌లో వారణాసికి దగ్గర సారానాథ్లో మొట్టమొదటిసారి భోదిస్తాడు. బుద్దుని బోదనలనే దమ్మపదం అంటారు. బుద్దుని బోధనలని అనుసరించే శిష్యుల సంఘం ప్రారంభమౌతుంది.
కాకినాడకి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రపాలితప్రాంతం పుదుచ్చేరీలో భాగమయిన యానంలో సుందరమైన బుద్ధాపార్క్ ఉంది. లోపలికి వెళ్ళడానికి ఉన్న మూడు ద్వారాలకీ బౌద్ధ సాహిత్యంలో కనిపించే పాళిభాషలోని పదాలు కలిసి వచ్చేలా బుద్ధద్వారా, సంఘద్వారా, దమ్మద్వారా అని పేర్లు పెట్టారు.
ద్వారాలకి ఇరువైపులా టెర్రకోట కుఢ్య చిత్రాలు, పార్క్ లోపల అందమైన లాన్, పెద్ద తటాకం మధ్యలో పీఠమ్మీద ధ్యానముద్రలో గౌతమబుద్దుడు. ఆ పీఠందగ్గరకి వెళ్ళడానికి అందమైన వంతెన. తటాకం చుట్టూ వాకింగ్‌ట్రేక్, ట్రేక్ వెంబడి ప్రక్కనే చెట్టుమొదళ్ళతో చేసినట్టు కనిపిస్తున్న సిమ్మెంటు బెంచీలు, లైట్లు, అక్కడక్కడా మండపాలు, సుందరమైన రాతి విగ్రహాలు, పచ్చని చెట్లు, ఒకవైపు స్టేడియంలో లాగ అర్ధచంద్రాకారపు మెట్లు, పిల్లలు ఆడుకోవడానికి చిన్న సాండ్‌పిట్ ఉన్నాయి. బుద్ధా పార్క్ అని నామకరణం చేసినందుకు, ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు అనేటంత ప్రశాంతంగా ఉంది.
© Dantuluri Kishore Varma
వర్మగారు..యానం విశేషాలు ఇంకా ఫోటోలు బాగున్నాయి.దాదాపుగా ఓ ఏడాది క్రితం యానం వచ్చినపుడు వేరే పనులవల్ల ఈ బుద్దా పార్క్ చూడలేకపోయాను.మీ పోస్ట్ వల్ల చూసిన అనుభూతి కలిగింది.
ReplyDeleteఒకగంట సమయం దొరికితే, సాయంత్రం సమయంలో ఇలాంటి ప్రదేశంలా గడిపితే చాలా బాగుంటుంది మూర్తిగారు. ముఖ్యంగా వాకింగ్ ట్రేక్, ఇంటికి దగ్గరగా ఉంటే రోజూ వాక్ చెయ్యవచ్చుకదా అనిపించింది. కామెంటుకి ధన్యవాదాలు.
Deleteనైస్ పోస్ట్ . చాలా ప్రశాంతంగా ఉంది . థాంక్ యూ !
ReplyDeleteమీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది వనజగారు. ధన్యవాదాలు.
Deleteమధ్యే మార్గము గురించి చాలా చక్కగా చెప్పారు
ReplyDeleteరాజశేఖర్‌గారు ధన్యవాదాలు.
Deleteఆహా ఏమి రుచి
ReplyDeleteచెప్పగలమా మైమరచి
అట్టులలో పై మెట్టు
ఒక్కక్క మెట్టుకి బహుటేస్ట్
డిమినిషింగ్ యుటిలిటీ ఉండదసలు
ఎకానమిక్స్ అందని ఓ ఓ పెసరట్టు
అందుకో మా శాల్యుట్లు !
పెసరట్టుమీద మీరు రాసిన లైన్లు
Deleteఅద్భుతంగా ఉన్నాయసలు
ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు.
(`ఇంకొక్క పెసరట్టు` అనే మరోపోస్టుకి పెట్టవలసిన కామెంటుని పొరపాటున ఇక్కడ రాశారు. ఈ పోస్టు చదివిన పాఠకులు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికే ఈ సవరణ. మరొకలా భావించకండి).