Pages

Monday, 7 July 2014

మదిమదిలోనూ కోరిక

అసలు వానంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు చెప్పండి? వేడి గాళుపులతో విసుగెత్తిపోయిన తరువాత, ఉక్కబోతలతో ఉసూరుమనిపోయిన తరువాత కమ్ముకొచ్చే మేఘాలు, సేదతీర్చే వర్షపు గాలి ఎవరినైనా ఆనందింపజేస్తాయి. ప్రతీ ఏడాదిలాగే ఈసారీ వేసవి వచ్చింది. కానీ వెళ్ళేటప్పుడే కొంత జాగు చేస్తుంది. ఈ పాటికే వానలు మొదలైపోవాలి. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిందని చెపుతున్న ఎల్నినో ఈ సంవత్సరానికి వర్షాలు కురియకుండా చేస్తుందా అనే భయాన్ని కలిగిస్తుంది. నిన్న హైదరాబాదులో, విజయవాడలో, మరొకచోటా కుంభవృష్టి కురిసిందని పేపర్లలో చదువుతూ కాకినాడ వాళ్ళం `మనకు లేదే!` అని ఉసూరుమంటున్నాం. మేఘాలు వస్తున్నాయి, పెళపెళమని ఉరుముతున్నాయి. నాలుగు చినుకులు `అలా, అలా` రాలి తడిసిన మట్టివాసన ముక్కుపుటాలకు చేరేలోపునే అంతా అయిపోతుంది. `వానల్లు కురియాలి వానదేవుడా,` అని చేతులెత్తి మ్రొక్కకపోయినా, ఆకాశం, నేలా ఏకమయిపోయేలా కురిస్తే బాగుండని మదిమదిలోనూ కోరిక!    

వానంటే మీకూ ఇష్టమే కదూ? అయితే ఈ క్రింది టపాలు కూడా చదవండి.   

4 comments:

  1. మీకు వానే కాదు ప్రకృతిని పట్టి జేబులో పెట్టుకోగల నైపుణ్యం ఉంది.
    మంచి పోస్ట్ బాగుంది వర్మాజి.

    ReplyDelete
    Replies
    1. I am flattered :) ధన్యవాదాలు మెరాజ్ గారు.

      Delete
  2. Sir
    Very nice. Meeru ye... Subject meda rasina alaookaga ala ..ala... Mandu vesavi lo tolakari jallula... challani malayamaarutamla.... Himagirula nundi jalu vare jala taramginila... phashanalanu saitam kariginche sangeeta taramginila ... anipistunnai sir. samajaniki avasaramaina vishayalanu andistu... youth ni educate cheyyalane me tapana ki na joohar ...

    ReplyDelete
    Replies
    1. కళ్యాణిగారు మీ ప్రశంసకు ధన్యవాదాలు :)

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!