Pages

Friday 2 November 2012

కృష్ణ చైతన్యం - ఇస్కాన్ రాజమండ్రీ


ఇస్కాన్ అనగానే సుందరమైన రాధా మాధవుల పాలరాతి విగ్రహాలు, రాసలీలల వర్ణచిత్రాలు, అద్భుతమైన మందిరాలు జ్ఞాపకం వస్తాయి.  ఎప్పటినుంచో రాజమండ్రీ ఇస్కాన్ దేవాలయాన్ని చూడాలని అనుకొంటూ ఆఖరికి ఈమధ్యన వెళ్ళాను.  బెంగళూరు, తిరుపతిల తరువాత ధక్షిణ భారతదేశంతో ఉన్న మూడవ అతిపెద్ద ఇస్కాన్ మందిరం ఇదే.


గోదావరి నదికి, రైల్వే ట్రేక్‌కి మధ్యన గౌతమీఘాట్ మీద రెండెకరాల స్థలంలొ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ్ కాన్షస్నెస్ - ఇస్కాన్) మందిరాన్ని 2006 లో ప్రారంభించారు. ఈ మందిర అద్యక్షులు శ్రీమాన్ సత్య గోపీనాథ్ స్వామి.  దేవాలయం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పది చిన్న చిన్న మందిరాలు నిర్మించి వాటిలో విష్ణుమూర్తియొక్క దశావతారాల విగ్రహాలను ఉంచారు. అందుకే దీనిని  శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ దశావతార మందిరం అని అంటున్నారు.

మందిరంలో ఫోటోలు తీసుకోవడానికి అనుమతికోసం, బ్లాగ్‌లో రాయడానికి వివరాలకోసం మందిరం యొక్క కార్యాలయంలో శ్రీ హేమా నిర్మల్‌దాస్ గారిని కలిసినప్పుడు హరే కృష్ణ మతాన్ని స్థాపించిన ఏ.వీ.భక్తివేదాంత ప్రభుపాద గురించి తెలియజేస్తూ, ఆయన జీవిత చరిత్రని చదవమని సూచించారు. దేవాలయం మొదటి అంతస్తులో ఉన్న గోవిందా గిఫ్ట్ షాపులో ఆ పుస్తకం కొన్నాను. కృష్ణ చైతన్య దీప్తిని రగిలించడానికి జీవితమంతా అంకితంచేసిన శ్రీ ప్రభుపాద చరిత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది.


ఆయన జీవించిన కాలాన్ని రెండు భాగాలుగా విభజిస్తే - మొదటిది ఆయని భారతదేశంలో ఉన్న 69 సంవత్సరాలు, తరువాతది 1965లో అమెరికా వెళ్ళినతరువాత ఆయన జీవించిన చివరి 12 సంవత్సరాలు. ఈ 12 ఏళ్లల్లో భాగవతం గురించి, భగవద్గీత గురించి, భారతదేశ భక్తి వేదాంతాలగురించి 60కంటె ఎక్కువపుస్తకాలు ఆంగ్లంలో రాసి, ప్రపంచవ్యాప్తంగా 120 కృష్ణ చైతన్య సంఘాలు స్థాపించి, 4000కంటే ఎక్కువమందికి మంత్రోపదేశంచేసి శిష్యరికాన్ని ప్రసాదించిన శ్రీపభుపాద స్వామి మనం ఇప్పుడు చెప్పుకొంటున్న మల్టీ టాస్కింగ్ అనే పదానికి నిజమైన ఉదాహరణ. అన్నింటికన్న ముఖ్యంగా ఈ  ప్రక్రియని ఒకవృద్దుడు చేసిచూపించడం!  ఒక చెట్టును కొట్టే వ్యక్తి గొడ్డలితో వందసార్లు నరికితేనే కానీ కూలని చెట్టు ఇంకొక్క దెబ్బకి నేలకొరిగితే ఆ గొప్పతనమంతా నూటఒకటో దెబ్బదే అని ఎలా చెప్పలేమో; అలాగే భక్తి వేదాంత స్వామి భారతదేశంలో ఉన్న 69 సంవత్సరాలలూ ఏవిధమైన ప్రాముఖ్యతా లేనివని చెప్పలేము. ఈ సమయంలో ఆయన కేవలం మూడు పుస్తకాలు రాసి ఉండవచ్చు కానీ, ఎప్పుడూ ఒకే దృక్పదం అదే కృష్ణ ప్రేమ. దానికోసమే నీరు పల్లానికి ప్రవహించినట్లు, విల్లు నుంచి సంధించిన బాణం లక్ష్యం కేసి దూసుకొనిపోయినట్లు ప్రయత్నం తరువాత ప్రయత్నం చేస్తూ నిర్దేశించుకొన్న కర్తవ్యాన్ని నిర్వహించిన మార్గదర్శి ఆ మహానీయుడు.

అసలు టాపిక్ నుంచి కొంచెం డైవర్షన్ తీసుకొన్నట్టున్నాను. సరే, మళ్ళి రాజమండ్రీ ఇస్కాన్ మందిరంకి వస్తే - రెండు అంతస్తులుగా నిర్మించారు. క్రింద వేదిక్ ఎగ్జిబిషన్‌ని నిర్వహిస్తున్నారు. రామాయణం, భాగవతం ఘట్టాలు, సాక్షాత్తు కృష్ణావతారంగా భావించబడే చైతన్య మహాప్రభు జీవిత సంఘటనలను  విగ్రహాల రూపంలో ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. పై అంతస్తులో రాధా మాధవ, చైతన్యప్రభు విగ్రహాలు; పూరీ జగన్నాధుని ఆలయంలో ఉండే శ్రీకృష్ణ,సుభద్ర,బలరామ ప్రతిమలను పోలిన విగ్రహాలు; శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహమూ ప్రతిష్ఠించిన ప్రధాన ఆలయం ఉంది. అలంకరణలతో ఈ ప్రతిమలు అత్యంత సుందరంగా ఉన్నాయి. మందిరానికి చేర్చి వేదాంత పార్క్ ఉంది. పచ్చటి లాన్లతో,ఫౌంటెన్లతో, భాగవతఘట్టాల మందిరాలతో చాలా బాగుంది.

ఒకసారి శ్రీ ప్రభుపాద ఒకపిల్లవాడు వీధిలో పారవేసిన ఎంగిలి విస్తరికోసం ఒక వీధి కుక్కతొ కలియబడడం చూశారట. అప్పుడే ఆయన ఇస్కాన్ మందిరం ఉన్న  చుట్టుప్రక్కల 10మైళ్ళ ప్రాంతంలో పిల్లలెవరూ ఆకలితో ఉండరాదని నిర్ణయించారట. అందువలన రాజమండ్రీలో 42 ప్రభుత్య పాఠశాలల్లో చదువుతున్న సుమారు 20,000 మంది విద్యార్దులకి ప్రతీరోజూ మద్యహ్న భోజనం సమకూరుస్తుంది. ఇస్కాన్ ఆద్వర్యంలో ఒక గోశాల ఉంది. ఇక్కడ 200 గోవులకి సంరక్షణ చూస్తున్నారు.

భక్తి, సేవల అపూర్వ సంగమం - కృష్ణ చైతన్య సంఘం
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare

Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare


© Dantuluri Kishore Varma

10 comments:

  1. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.

    ReplyDelete
  2. నాలుగు సంవత్సరాల క్రితం నేనూ దర్శించాను చాలా బాగుంది.

    ReplyDelete
  3. నా బ్లాగ్‌కి మీకు స్వాగతం విజయమోహన్‌గారు. చదివి వ్యాఖ్య చేసినందుకు ధన్యవాదాలు. ఇకముందు కూడా మీ స్పందన తెలియజేస్తూ ఉండాలని కోరుకొంటున్నాను.

    ReplyDelete
  4. nice...... :)
    - Rajahmundry (Grand city of culture)

    ReplyDelete
  5. Thank you Mr.Siva. Keep following my blog and give your feed back.

    ReplyDelete
  6. sir miru blog mana kakinadalo ani kakuda east, west godavari kalipi mana godavari jilla lo ani petdethe baguntundi emo... :)apdu enka baguntundi ankuntunnnaaaaaaaaaaaa

    ReplyDelete
  7. మీరన్నది నిజమే శివగారు, గోదావరి జిల్లాల వారిది ఒక ఉమ్మడి సంస్కృతి. పేరు ఏదయినా ఇది మన తెలుగువారి అందరిబ్లాగ్‌గా ఉండాలని కోరిక. క్రమంగా సాధ్యమైనన్ని ఎక్కువ ప్రదేశాలగురించి, విషయాలగురించి వ్రాయాలని ఉంది. కేవలం నేను పుట్టిన ఊరి మీద అభిమానంతో ఈ బ్లాగ్‌కి మనకాకినాడలో... అని పేరు పెట్టడం జరిగింది. మీ అభిమానానికి కృతజ్ఞతలు.

    ReplyDelete
  8. 2006 కి ముందు రాజమండ్రీ ఇస్కాన్ - మందిరం. తరువాత ఇప్పుడు మీరు పెట్టిన ఫొటోలున్న గుడిని (ఆలయాన్ని) నిర్మించారు. ధ్వజస్తంభం (ఇది బ్రహ్మ తో సమానం) ఉన్నవన్నీ ఆలయాలు, లేనివి మందిరాలు. ఈ సారి వీలయితే వారి వంటగదిలోనికి కూడా వెళ్లి చూడండి. చాలా శుభ్రంగా, ఆధునిక సాంకేతిక పరికరాలతో ఉంటుంది. వారు తీసుకెళ్ళే భోజనం కూడా వేడి తగ్గకుండానే వడ్డించే ఏర్పాట్లు చేశారు.

    ReplyDelete
  9. శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ దశావతార మందిరం అని వ్యవహరించడం చూశాను. మందిరం, ఆలయాలకి తేడా మీరు చెప్పాక తెలిసింది. ధన్యవాదాలు. చాలాకాలంతరువాత మీ కామెంట్ చూడటం ఆనందంగా ఉంది రసజ్ఞ గారు.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!